అధ్యాయము 1
The Sentence
1. మనము మాట్లాడుకొనునపుడు గాని, వ్రాయునపుడు గాని మాటలను వాడుతాము. సాధారణంగా ఈ మాటలను విడివిడిగా కాకుండా క్రింద పేర్కొన్న విధంగా సామూహికంగా వాడుతుంటాము.
Little Jack Horner sat in a corner.
ఈ విధంగా వాడిన పదముల సముదాయాన్ని వాక్యము అని అంటాము. ఇటువంటి పదముల సముదాయం పూర్తిగా అర్ధవంతం అయినట్లయితేనే దానిని వాక్యం అని అంటాము.
వాక్యములలోని రకములు
2. వాక్యములు నాలుగు విధములు :
1. వివరించునవి లేక నొక్కివక్కాణించునవి :
Humpty Dumpty sat on a wall.
2. ప్రశ్నలు అడుగునవి :
Where do you live?
3. ఒక అజ్ఞనుగాని (command), విన్నపమును గాని (request) బ్రతిమాలుటను గాని (entreaty) తెలియజేయునవి Be quiet.
Have mercy upon us.
4. బలమైన మానసిక భావాలను (sudden and intense feelings) తెలియజేయునవి :
How cold the night is! What a shame 1
ఒక statement ను నొక్కి వక్కాణించే మాటల సముదాయాన్ని కాని ఇచ్చువానిని Declarative లేక Assertive వాక్యములు అని అంటాము.
ప్రశ్నను అడుగు వాక్యమును interrogative sentence అని అంటాము.
ఆజ్ఞను ఇచ్చు వాక్యమునుగాని విన్నపము చేయు వాక్యమునుగాని imperative (ఆవశ్యమైన) sentence అని అంటాము.
ఆకస్మికముగా ఒక అభిప్రాయమును (strong feeling) బయటికి చెప్పు వాక్యమును Exclamatory sentence అని అంటాము.
Read and Learn more Synthesis of Sentences
అధ్యాయము 2
Subject And Predicate
3. మనము ఒక వాక్యాన్ని వ్రాయునపుడు గాని మాట్లాడునపుడు గాని
(1) ఒక వ్యక్తికి గాని ఒక వస్తువుకు గాని పేరు ఇవ్వడం జరుగుతుంది.
(2) ఆ వ్యక్తి గురించిగాని ఆ వస్తువు గురించి గాని ఏదో కొంత చెప్పడం జరుగుతుంది.ఇంకో విధంగా చెప్పాలంటే, వాక్యములో పేర్కొనడానికి subject (కర్త) ఉండాలి. అదే విధంగా ఆ వ్యక్తిని గురించి గాని ఆ వస్తువును గురించి గాని ఏదో కొంత చెప్పే predicate వుండాలి. అంటే ప్రతి వాక్యంలో రెండు ప్రధాన భాగములు ఉంటాయి :-
(1) మనము మాట్లాడే వ్యక్తి గాని వస్తువుగాని ఉన్నట్టిది మొదటి భాగము. దీనిని subject అంటారు (2) Subject ను గురించి చెప్పునది రెండవ భాగము. దీనిని predicate అంటారు.
4. సాధారణంగా వాక్యములోని subject భాగము వాక్యమునకు మొదట ఉంటుంది కాని కొన్ని సార్లు మాత్రం predicate తర్వాత subject వస్తుంది.
Here comes the bus.
Sweet are the uses of adversity.
5. Imperative sentences లో (అవశ్యము ఈ పని చేయవలయును అని చెప్పునవి) subject ను వదలి వేయడం జరుగుతుంది.
Sit down. [Here the Subject You is understood]
Thank him. [Here too the Subject You is understood]
అభ్యాసము 1
ఈ క్రింది వాక్యములలో Subject ను Predicate లను వేరు చేయండి :
1. The crackling of geese saved Rome.
2. The boy stood on the burning deck.
3. Tubal Cain was a man of might.
4. Stone walls do not make a prison.
5. The singing of the birds delights us.
6. Miss Kitty was rude at the table one day.
7. He has a good memory.
8. Bad habits grow unconsciously.
9. The earth revolves round the Sun.
10. Nature is the best physician.
11. Edison invented the phonograph.
12. The sea hath many thousand sands.
13. We cannot pump the ocean dry.
14. Borrowed garments never fit well.
15. The early bird catches the worm.
16. All matter is indestructible.
17. Islamabad is the capital of Pakistan.
18. We should profit by experience,
19. All roads lead to Rome..
20. A guilty conscience needs no excuse.
21. The beautiful rainbow soon faded away.
22. No man can serve two masters.
23. A sick room should be well aired.
24. The dewdrops glitter in the sunshine.
25. I shot an arrow into the air.
26. A barking sound the shepherd hears.
27. On the top of the hill lives a hermit.
అధ్యాయము 3
The Phrase And The Clause
6. “In a corner” అను పదసముదాయమును పరిశీలించండి. దీనిని Phrases అని అంటారు. Phrase అనగా మూడు, నాలుగు పదములు ఉన్న పదబంధము అని అర్ధము. Phrases అర్థయుత మైనప్పటికి, అవి స్వతహాగా పూర్తి అర్ధాన్ని యివ్వవు. Italics ఉన్న యీ క్రింది పద సముదాయములను (జట్టులు) Phrases అని అంటారు.
The sun rises in the east. Humpty Dumpty sat on a wall. There came a giant to my door.
It was a sunset of great beauty.
The tops of the mountains were covered with snow.
show me how to do it.
7. talics ప్రింటులో నున్న ఈ క్రింది phrasesను పరిశీలించండి :
He has a chain of gold.
He has a chain which is made of gold.
పై రెండు వాక్యములలో మొదటి వాక్యములో నున్న “of gold” అను రెండు పదముల జంటను phrase అని అంటాము. రెండవ వాక్యములోని which is made of gold అను అయిదు మాటల సమూహమును Clause అని అంటాము.
ఈ క్రింది వాక్యములలో పై విధంగా group గా ఉన్న పదములను clauses అంటాము.
People who pay their debts are trusted.
We cannot start while it is raining.
I think that you have made a mistake.
అధ్యాయము 4
Parts Of Speech
8. వాక్యములలోని పదములను వివిధములైన పేర్లతో విభజించడం జరిగింది. Grammer లో యీ విభజనను Parts of speech అని అంటాము. ఆ పదములకు గల వివిధమైన గుర్తింపులు అవి వాక్యములో చేయు పనులను బట్టి (duties) వచ్చినవి. ఈ గుర్తింపులు ఎనిమిది. అవి యివి :-
1) Noun (నామవాచకము)
2) Adjective (విశేషణము)
3) Pronoun (సర్వనామముnoun కు బదులుగా వచ్చునది)
4) Verb (క్రియ or action word)
5) Adverb (క్రియా విశేషణము అనగా verb నకు యింకొంత అర్ధమును కలుపునది.) 6) Preposition (విభక్త్యర్ధకమైన అవ్యయము. విభక్తులు అని కూడా అంటాము)
7) Conjunction (కలుపునది అనగా సముచ్ఛయము)
8) Interjection (సంతాపాద్యర్థకము అనగా సంతాపమును తెలియచేయునది) అయ్యో! అను భావము.
9. Noun. ఒక మనిషి యొక్క పేరును గాని, ఒక ప్రదేశము యొక్క పేరును గాని, ఒక వస్తువు యొక్క పేరును గాని తెలియజేయు పదమును నామవాచకము (Noun) అంటారు.
Akbar was a great King.
Kolkata is on the Hooghly.
The rose smells sweet.
The sun shines bright.
His courage won him honour.
గమనిక (Note): వస్తువు అనగా (i) మనము కంటితో చూచునది, వినునది, చేతితో తాకబడునది, వాసన చూడబడునది మొదలయినవి. (ii) మనం ఊహించగలిగినవి, తాకలేనివి మరియు చూడ వీలు కానట్టివి. వీనిని English లో abstract nouns అని అంటారు. మనస్సుతో ఊహించుకోవాలి.
10. Adjective. నామవాచకమునకున్న అర్ధమునకు మరికొంత అర్ధమును కలిపిన పదమును Adjective అని అంటారు.
He is a brave boy.
There are twenty boys in this class.
11. Pronoun. నామవాచకమునకు బదులుగా వాడు పదమును Pronoun (సర్వనామము) అని అంటారు.
John is absent, because he is ill.
The books are where you left them.
12. Verb. ఒక పనిని గాని విషయమును గాని తెలియజేయు పదమును Verb అంటారు. Verb లో
action (క్రియ) ఉంటుంది.
The girl wrote a letter to her cousin.
Kolkata is a big city.
Iron and copper are useful metals.
13.Adverb (క్రియా విశేషణము). Verb కు గాని, Adjective కు గాని, లేక యింకొక Adverb కు గాని మరికొంత భావమును కలుపు పదమును Adverb అని అంటారు. (add + verb = adverb)
He worked the sum quickly.
This flower is very beautiful.
She pronounced the word quite correctly.
14. Preposition. (విభక్తి ప్రత్యయము). Noun గాని pronoun గాని మరియొక పదముతో సంబంధము కలిగి యుండును. యీ సంబంధమును తెలియజేయు పదమును Preposition అంటారు.
There is a cow in the garden.
The girl is fond of music.
A fair little girl sat under a tree.
15. Conjunction (సముచ్చయము). రెండు పదములను గాని, రెండు వాక్యములను గాని కలుపు పదమును Conjunction అని అంటారు.
Rama and Hari are cousins.
Two and two make four.
I ran fast, but missed the train.
16. Interjection (ఆశ్చర్యార్ధకము). అకస్మాత్తుగా మనలో ఉద్భవించు భావావేశమును (intense feeling) తెలియజేయు పదమును Interjection అని అంటారు.
Hurrah! We have won the game.
Alas she is dead.
17. A, an, the, this, that, these, those, every, each, some, any, my, his, one, two అను పదములను Determiners అని అంటారు. కొన్ని Modern Grammars లో determiners ను కూడా part of speech గా గుర్తిస్తున్నారు. యివి వాని తరువాత follow అయ్యే నామవాచక భావమును కొంత తగ్గించును. ఈ గ్రామరు పుస్తకములో a, an మరియు the తప్ప మిగిలిన పై determiners ను adjective గా పరిగణించడం జరిగింది.
18. ఆయా పదములు అవి వాక్యములో చేయు పనిని బట్టి అవి ఏ part of speech కి చెందినవో గుర్తించవచ్చు. కావున ఏ పదము ఏ part of speech కి చెందినదో వాక్యమును చూడకుండా చెప్పడం కష్టము.
They arrived soon after. (Adverb)
They arrived after us. (Preposition)
They arrived after we had left. (Conjunction)
పైన ఇచ్చిన మూడు ఉదాహరణలను గమనించండి. ఒకే పదాన్ని వేరు వేరు వాక్యాల్లో వేరు వేరు parts of speech గా ఉపయోగించడం జరిగింది.
అభ్యాసము 2
ఈ క్రింది వాక్యములలో Italics ప్రింటులోనున్న పదములు ఏ భాషా విభాగమునకు చెందినవో రాయుచూ, అందుకు గల కారణములను కూడా పేర్కొనండి :
1. Still waters run deep.
2. He still lives in that house.
3. After the storm comes the calm.
4. The after effects of the drug are bad.
5. The up train is late.
6. It weighs about a pound.
7. He told us all about the battle.
8. He was only a yard off me.
9. Suddenly one of the wheels came off.
10. Mohammadans fast in the month of Ramzan.
11. He kept the fast for a week
12 He is on the committee..
13. Let us move on.
14. Sit down and rest a while.
15. I will watch while you sleep.
16. They while away their evenings with books and games.
అధ్యాయము 5
The Noun: Kinds Of Nouns
19. ఒక వ్యక్తి యొక్క పేరును గాని, ఒక ప్రదేశము యొక్క పేరును గాని, ఒక వస్తువు యొక్క పేరును గాని తెలియజేయు పదమును నామవాచకము (Noun) అందురు.
గమనిక (Note: మన ఆలోచనలోనికి వచ్చు భావము కూడా భావపూరితమైన “thing” అవుతుంది. (Abstract Noun). వీనిని మానసికంగా మాత్రమే ఊహించుకోవాలి.
20. ఈ క్రింది వాక్యములను గమనించండి:
Asoka was a wise king.
ఒక ప్రత్యేకమైన గుర్తింపుగల రాజును మనము Asoka అని పిలిచాము. కాని యింకొక పదమైన ‘King’ అను పదముతో యితర రాజులను గురించి కూడా పేర్కొనవచ్చును. ఇచ్చట Asoka అను పదము Proper noun అవుతుంది. King అను పదము అందరు రాజులకు చెందుతుంది కావున common noun అవుతుంది. ఎందుకంటే king అను ఆ పదముతో ఎవరినయినా పిలవవచ్చును కాబట్టి. అదే విధంగా : –
Sita is a Proper Noun, while girl is a Common Noun.
Hari is a Proper Noun, while boy is a Common Noun.
Kolkata is a Proper Noun, while city is a Common Noun.
India is a Proper Noun, while country is a Common Noun.
‘Girl’ అను పదము common noun. ఎందుకంటే ఆ మాటతో ఏ అమ్మాయిని అయినా పిలువవచ్చును. కాని యిచ్చట ‘Sita’ అను పేరుతో ఒకే ఒక గుర్తింపుగల అమ్మాయిని పిలుస్తాము. అంటే ‘Sita’ అను పదము proper noun. Proper అనగా తనకు చెందిన అనే అర్ధం వస్తుంది కదా !
Definition. ( నిర్వచనము) – ఒకే రకానికి చెందిన వ్యక్తులనుగాని, వస్తువులనుగాని ఒకే పేరుతో పిలిచినట్లయితే, ఆ పదమును Common Noun అంటారు. ఒకే పేరుతో అందరిని పిలవడానికి వీలయినప్పుడు అట్టి పదము Common Noun జాబితా లోనికి వస్తుంది.
Definition. ( నిర్వచనము). ఒకే ఒక వ్యక్తికిగాని ప్రదేశానికిగాని చెందిన పేరును proper noun అని అంటాము. Proper అనగా ఒకే వ్యక్తి యొక్క గాని ప్రదేశము యొక్క గాని గుర్తింపునకు (గ్రామరులో స్వంతము అని అర్ధము.
Note. 1. Proper noun కు మొదటి అక్షరము capital letter ఉపయోగించాలి.
Note. 2. Pronouns ను కొన్నిసార్లు common nouns గా కూడా గుర్తిస్తున్నారు.
1. He was the Lukman (= the wisest man) of his age.com
2. Kalidas is often called the Shakespeare (= the greatest dramatist) of India.
Collective nouns మరియు abstract nouns, common nouns లో భాగమే.
21. మనుష్యుల గుంపునుగాని, కొన్ని వస్తువుల సముదాయమునుగాని ఏకంగా ఒక్క పదంలో తెలియజేయు పదాలను Collective Nouns అంటారు.
Crowd, mob, team, flock, herd, army, fleet, jury, family, nation, parliament, committee.
A fleet= a collection of ships or vessels.
An army = a collection of soldiers.
A crowd = a collection of people.
The police dispersed the crowd.
The French army was defeated at Waterloo.
The jury found the prisoner guilty.
A herd of cattle is passing.
22. ఒక లక్షణమును గురించి గాని, ఒక చర్యను (action) గురించి గాని, ఒక పరిస్థితిని (State or condition) గురించి గాని చెప్పు పదమును Abstract nouns అని అంటారు. ఇవి భావరూపములు.
Quality.—oodness, kindness, whiteness, darkness, hardness, brightness, honesty, wis- dom, bravery. (మంచి తనము, జాలి, తెలుపు, చీకటి, గట్టితనము, కాంతి, నిజాయితీ, జ్ఞానము, ధైర్యము)
Action.– -Laughter, theft, movement, judgement, hatred. (నవ్వు, దొంగతనము, కదలిక, తీర్పు, ద్వేషము) Laughter లో నవ్వు భావరూపం. Laughing అను verb లో నవ్వు కార్యరూపము.
State.– – Childhood, boyhood, youth, slavery, sleep, sickness, death, poverty. (పసితనము, బాల్యము, యవ్వనము, బానిసత్వము, నిద్ర, జబ్బు, మరణము, బీదతనము)
Arts (కళల పేర్లు), Sciences (శాస్త్రముల పేర్లు), (grammer, music, chemistry మొదలగు పదములు) కూడా Abstract nouns (వ్యాకరణము, సంగీతము, రసాయనశాస్త్రము)
కంటికి కనిపించనివి, చేతికి చిక్కనివి, కేవలం మనస్సుతో మాత్రమే అవగాహన చేసుకోగలిగిన వన్నియు Abstract nouns. Abstract nouns ను అర్ధం చేసుకోవడానికి యింకొక ఆధారము కావలయును. “మరణము” అను పదము (death) Abstract Noun కాని మరణము అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి యింకొక వస్తువయిన శవము కావలయును. మరణమును గాని, నవ్వును గాని ఇతర abstract nouns ను గాని ఒక చోటి నుండి ఇంకొక చోటికి మార్చజాలము. అలానే పర్వతము, సముద్రము, గాలి మొదలగు పంచభూతములను కూడా ఇంకొక చోటికి మార్చజాలము. ఒక విద్యార్ధి యొక్క తెలివిని కంటితో చూడగలమా? ఒక చోటినుండి ఇంకొక చోటికి మార్చగలమా? Marks sheet ను బట్టి మాత్రమే
తెలుసుకుంటాం.
23. Abstract Nouns ఈ క్రింది విధముగా form అవుతాయి.
1. Adjectives నుండి
Kindness from kind; honesty from honest.
(kindness – దయ (Abstract Noun. He has kindness అతనికి దయ ఉన్నది. (kind) దయగల (Adjective) He is a kindman. అతను దయగల వాడు.
2. Verbs నుండి ఎటువంటివాడు అనేదాని జవాబు. He అనే pronoun ను వర్ణిస్తుంది.
Obedience from obey, growth from grow.
3. Common nouns o
Childhood from child; slavery from slave. slave 3 (common noun) skavery (abstract noun) బానిసత్వము. ఇచ్చట slavery అను పదము ఒకరి పరిస్థితిని తెలియచేస్తుంది కదా!
24. Nouns కు ఇంకొక వర్గీకరణ (classification) కూడా ఉన్నది. అవి countable nouns (లెక్కించదగినవి) మరియు unaccountable nouns (లెక్కించవీలు కానివి)
Countable Nouns: book, pen, apple, boy, sister, doctor, horse.
Uncountable nouns: milk, oil, sugar, gold, honesty
Countable Nouns కు ఏకవచన ఏకవచన బహువచన రూపములు లేవు.
బహువచన రూపములు ఉన్నవి. కాని Uncountable nouns కు
ఇన్ని లీటర్ల పాలు అంటాముగాని, ఇన్ని చుక్కల పాలు అనము.
అభ్యాసము 3
ఈ క్రింది వాక్యములలో nouns ను గుర్తించి వాటి వర్గీకరణను (classification) పేర్కొనుము.
1. The crowd was very big..
2. Always speak the truth.
3. We all love honesty.
4. Our class consists of twenty pupils.
5. The elephant has great strength.
6. Solomon was famous for his wisdom.
7. Cleanliness is next to godliness.
8. We saw a fleet of ships in the harbour.
9. The class is studying grammar.
10. The Godavari overflows its banks every year.
11. A committee of five was appointed.
12. Jawaharlal Nehru was the first Prime Minister of India.
13. The soldiers were rewarded for their bravery.
14. Without health there is no happiness.
15. He gave me a bunch of grapes.
16. I recognized your voice at once.
17. Our team is better than theirs.
18. Never tell a lie.
19. Wisdom is better than strength.
20. He sets a high value on his time.
21. I believe in his innocence.
22. This room is thirty feet in length.
23. I often think of the happy days of childhood.
24. The streets of some of our cities are noted for their crookedness.
25. What is your verdict, gentlemen of the jury?
అభ్యాసము 4
ఈ క్రింది వానికి collective noun పదములు రాయండి.
(1) Cattle; (2) Soldiers; (3) Sailors.
Adjectives గా బాలురకు ఉన్న ఈ క్రింది లక్షణములను abstract nouns గా మార్చి వ్రాయుము.
(1) Lazy; (2) Cruel: (3) Brave; (4) Foolish.
అభ్యాసము 5
క్రింద ఇవ్వబడిన adjectives ను abstract nouns గా మార్చి వ్రాయుము.
Long | strong | wide, | broad, | high, |
young, | true, | wise, | free, | poor, |
humble, | short | good, | proud, | just, |
decent, | prudent, | vacant, | brave, | vain, |
cruel | dark, | sweet, | novel, | sane, |
bitter, | deep, | human, | quick, | ignorant. |
క్రింద ఇవ్వబడిన verbs ను abstract nouns గా మార్చి వ్రాయుము.
Laugh, | believe, | choose, | defend, | free, |
obey, | serve, | move, | think, | see, |
live, | hate, | conceal, | protect, | judge, |
expect, | please, | seize, | advise, | pursue, |
excel | act, | flatter, | punish, | relieve, |
know | starve, | depart, | die, | converse |
steal, | occupy, | persevere, | succeed, | discover. |
క్రింద ఇవ్వబడిన common nouns ను abstract nouns గా మార్చి వ్రాయుము.
King, | infant, | mother, | priest, | friend, |
man, | owner, | agent, | boy | captain, |
thief, | rogue, | hero, | bond, | rascal, |
woman, | regent, | beggar, | pirate, | patriot, |
bankrupt, | author, | coward, | pilgrim, | glutton. |
అధ్యాయము 6
The Noun: Gender
(పుంలింగ, స్త్రీలింగ వివరణ)
25. ప్రాణులు (మనుష్యులు – జంతువులు) వు:లింగమునకు గాని, స్త్రీలింగమునకు గాని చెందినవై ఉన్నవి. ఈ క్రింది జంట పదములలో లింగ భేదమును గమనించండి.
Boy
Girl
Lion
Lioness
Hero
Heroine
Cock-sparrow
Hen-sparrow
ఏమి గమనించావు?
పై జంట పదములలో మొట్ట మొదటిది పుంలింగమునకు చెందినది. రెండవ పదము స్త్రీ లింగమునకు చెందినది.
మగ జాతికి చెందిన వానిని Masculine Gender అంటారు. స్త్రీ జాతికి చెందిన వానిని Feminine Gender అంటారు.
26. మగజాతికి స్త్రీ జాతికి రెంటికీ వర్తించే noun ను Common Gender అంటారు.
Parent, child, friend, pupil, servant, thief, relation, enemy, cousin,
person, orphan, student, baby, monarch, neighbour, infant. (parent అనగా తల్లిగాని, తండ్రిగాని కావచ్చు – child అనగా మగపాప గాని ఆడపాపగాని కావచ్చు – orphan అనగా తల్లిదండ్రులు లేనట్టి బాలుడుగాని, బాలికగాని కావచ్చు – ఇలా అర్ధము చేసుకోవలయును.)
27. పుంలింగమునకు మరియు స్త్రీ లింగమునకు చెందని nouns ను Neuter Gender (నపుంసక లింగము) అంటారు.
Book, pen, room, tree.
28. కొన్ని సందర్భములలో ప్రాణము లేని కొన్ని వస్తువులకు ఊహాజనితమైన ప్రాణమును ఇచ్చి వర్ణించడం జరుగుతుంది. అట్టి పరిస్థితిలో వానికి పుంలింగ, స్త్రీ లింగ వర్గీకరణ (classification) వర్తిస్తుంది. బలమునకు, పోట్లాట పటిమకు చెందిన వానిని పుంలింగము క్రింద జమ కడతాము.
The Sun, Summer, Winter, Time, Death,
The sun sheds his beams on rich and poor alike.అందమునకు, నెమ్మది తనమునకు, సుకుమారమునకు చెందిన వానిని స్త్రీ లింగము క్రింద జమ కడతాము.
The Moon, the Earth, Spring, Autumn, Nature, Liberty, Justice, Mercy, Peace, Hope, Charity.
The moon has hidden her face behind a cioud.
Spring has spread her mantle of green over the earth.
Peace hath her victories no less renowned than war.
ఈ పద్ధతి poetry లో ఎక్కువ వాడకములో ఉంటుంది. కాని కొన్ని nouns కు ఈ పద్ధతి prose లో కూడా ఉన్నది. ship ను సాధారణంగా she అని అంటారు.
The ship lost all her boats in the storm.
Ways Of Forming The Feminine Of Nouns
29. Nouns కు స్త్రీ లింగ రూపము ఇచ్చుటకు మూడు పద్ధతులు ఉన్నవి :-
1. పూర్తిగా వేరే పదమును వాడుట ద్వారా
Masculine | Feminine |
Bachelor | Maid spinster |
Boy | girl |
Brother | sister |
Buck | doe |
Bull (or ox) | cow |
Bullock | heifer |
Cock | hen |
Colt | filly |
Dog | bitch |
Drake | duck |
Drone | bee |
Earl | countess |
Father | mother |
Gander | goose |
Gentleman | lady |
Hart | roe |
Horse | mare |
Husband | wife |
King | queen |
Lord | lady |
Man | woman |
Monk (or friar) | nun |
Nephew | niece |
Papa | mamma |
Ram | ewe |
Sir | madam |
Son | daughter |
Stag | hind |
uncle | aunt |
wizard | witch |
2. – ess, me, trix, a మొదలైన syllable ను (sound units) కలుపుట ద్వారా
Masculine | Feminine |
Author | authoress |
Baron | baroness |
Count | countess |
Giant | giantess |
Heir | heiress |
Host | hostess |
Jew | Jewess |
Lion | lioness |
Manager | manageress |
Mayor | mayoress, |
Patron | patroness |
Peer | peeress |
Poet | poetess |
Priest | priestess |
Prophet | prophetess |
Shepherd | shepherdess |
Steward | stewardess |
Viscount | viscountess |
గమనిక (Note: పై రెండవ భాగమునకు చెందిన యీ క్రింది మాటలలో Masculine పదమునకు చెందిన ఆఖరి అచ్చును తీసివేసిన తరువాత – ess వాడుట ద్వారా feminine form వచ్చినది.
Masculine | Feminine |
Actor | actress |
Benefactor | benefactress |
Conductor | conductress |
Enchanter | enchantress |
Founder | foundress |
Hunter | huntress |
Instructor | instructress |
Negro | negress |
Abbot | abbess |
Duke | duchess |
Emperor | empress |
Preceptor | preceptress |
Prince | princess |
Songster | songstress |
Tempter | temptress |
Seamster | seamstress |
Tiger | tigress |
Traitor | traitress |
Waiter | waitress . |
Master | mistress |
Murderer | murderess |
Sorcerer | sorceress |
గమనిక (Note: Masculine noun ను Feminine noun గా మార్చడానికి – ess వాడుట బహుళ వ్యాప్తిలో నున్నది. ఇచ్చట – ess కు ముందు భాగములో నున్న vowel ను తీసివేయవలయును.
Masculine | Feminine |
Hero | heroine |
Testator | testatrix |
Czar | czarina |
Sultan | sultana |
Signor | signora |
Fox | vixen |
3. Masculine పదమునకు ముందునగాని వెనకగాని ఒక కొత్త పదమును వాడుట ద్వారా
Masculine | Feminine |
Grandfather | grandmother |
Greatuncle | greataunt |
Manservant | maidservant |
Landlord | landlady |
milkman | milkwoman |
peacock | peahen |
salesman | saleswoman |
washerman | washerwoman |
అధ్యాయము 7
The Noun: Number
30. 1. ఈ క్రింది జంట పదములలోని ప్రతి రెండవ పదములో వచ్చిన మార్పును గమనించుము.
Tree
Trees
Box
Boxes
Ox
Oxen
Man
Men
ఈ జంట పదములలోని మొదటి పదం ఏకవచనాన్ని రెండవ పదం బహువచనాన్ని సూచిస్తుంది. 2. ఒకే వ్యక్తిని గాని ఒకే వస్తువును గాని పేర్కొనునట్టి noun ను singular noun అని అంటాము. Boy, girl, cow, bird, tree, book, pen.
3. రెండు వ్యక్తులను గాని అంతకంటే ఎక్కువ మందినిగాని, రెండు వస్తువులను గాని, అంతకంటే ఎక్కువ వస్తువులనుగాని పేర్కొను noun ను plural noun అని అంటాము.
Boys, girls, cows, birds, trees, books, pens.
ఈ విధముగా English లో కూడా Singular number మరియు Plural number అని రెండు numbers ఉన్నవి.
How Plurals Are Formed
బహువచనములు ఎలా ఏర్పడును?
31. 1. సాధారణంగా singular nouns కు s ను కలుపుట ద్వారా plural number ఏర్పడును.
boy, boys;
pen, pens :
girl, girls;
desk, desks;
book, books;
cow, cows.
2. కాని, – S, – sh, – ch మరియు – × అను వాటితో అంతమగు nouns అన్నీ es కలుపుట ద్వారా
అవి plural noun గా ఏర్పడును.
class, classes;
brush, brushes;
branch, branches:
kiss, kisses,
match, matches;
tax, taxes:
dish, dishes,
watch, watches,
box, boxes.
3.తో అంతమగు nouns తో చాలా వరకు – es కలుపుట ద్వారా plural nouns ఏర్పడును.
buffalo, buffaloes,
potato, potatoes,
negro, negroes;
mango, mangoes,
cargo, cargoes,
volcano, volcances.
hero, heroes; echo, echoes:
4. కొన్ని తో అంతమగు nouns విషయంలో వానికి కేవలం – S కలుపుట ద్వారా వాని plural form
ఏర్పడును.
dynamo, dynamos;
canto, cantos;
piano, pianos;
solo, solos ;
ratio, ratios;
memento, mementos ;
quarto, quartos:
photo, photos :
stereo, stereos.
commando, commandos
kilo, kilos ;
5. – y అక్షరముతో అంతమగు
ఉన్నట్లయితే – y ని గా మార్చి – es
baby, babies;
army, armies :
logo, logos;
nouns విషయములో, వానికి ముందునున్న హల్లు (consonant)
ను కలుపవలయును.
lady, ladies:
story, stories;
అప్పుడు plural noun ఏర్పడును.
city, cities :
pony, ponies.
6. ఈ క్రింది పేర్కొన్న nouns కు ఆఖరి అక్షరము – f తో గాని – fe తో గాని అంతమగుచున్నది. ఇచ్చట చివరలో – / గాని లేక – fe గాని ఉంటే వాటిని గా మార్చి తదుపరి – es ను కలుపవలయును. ఈ విధంగా
plural noun ఏర్పడును.
thief, thieves :
wife, wives:
wolf, wolves ;
life, lives;
calf, calves;
leaf, leaves;
loaf, loaves;
half, halves;
knife, knives ; elf, elves;
shelf, shelves,
self, selves
sheaf, sheaves
7. Dwarf (బుడుత కీచు), hoof (జంతువు కాలిగిట్ట) మరియు scarf అనుపదములు plural form గా ఏర్పడునపుడు Sని గాని – ves ను గాని తీసుకొనును.
dwarfs or dwarves;
wharfs or wharves
hoofs or hooves;
scarfs or scarves;
– f – fe మరియు S లతో అంతమగు యితర పదములు
chief, chiefs;
gulf, gulfs;
safe, safes:
cliff, cliffs;
proof, proofs
handkerchief, handkerchiefs.
32. పదము మధ్యలో నున్న vowel ను (a,e, i, ou అనునవి) మార్చుట ద్వారా కొన్ని nouns, plural
nouns గా మారును.
man, men:
goose, geese;
MACwoman, women;
mouse, mice;
HIGH SCHOOL ENGLISH GRAMMAR
foot, feet; louse, lice.
tooth, teeth;
33. కొన్ని singular nouns en ను కలుపుకొనట ద్వారా plural nouns గా మారును.
ox, oxen;
child, children.
fish కు plural form కూడా fish గానే ఉంటుంది. ప్రస్తుతం fishes అను పదము అంతగా వాడుకలో లేదు.
34. కొన్ని nouns, singular మరియు plural గా కూడా ఒకే విధంగా ఉండును.
Swine, sheep, deer; cod, trout, salmon; aircraft, spacecraft, series, species.
Pair, dozen, score, gross, hundred, thousand (when used after numerals).
I bought three dozen oranges.
Some people reach the age of three score and ten.
The sari cost me five thousand rupees.
Stone, hundredweight.
He weighs above nine stone.
Twenty hundredweight make one ton.
Tummalanuns కు plural form మాత్రమే ఉంటుంది.
1. ఒకే విధమైన రెండు భాగముల కలయిక గల పరికరములునున్నవి.
Bellows, scissors, tongs, pincers, spectacles.
2. రెండు భాగములు కలిగియున్న dress materials
Trousers, drawers, breeches, jeans, tights, shorts, pyjamas.
3. మరికొన్ని యితర విధములైన nouns
Annals, thanks, proceeds (of a sale), tidings, environs, nuptials, obsequies, assets, chatels.
36. యింత క్రితం singular గా వాడుకలోనున్న కొన్ని nouns ప్రస్తుతం plural form లోనే చలామణిలో
Alms, riches, eaves.
Riches do many things.
37. ఈ క్రింది నామవాచకములు plural గా కనిపించినను అవి singular nouns మాత్రమే.
1. Subjects
mathematics, physics, electronics, etc.
2. News 3650
3. సాధారణ జబ్బులు
measles, mumps, rickets
4. కొన్ని ఆటల పేర్లు
billiards, draughts
Mathematics is his favourite study.
No news is good news.
India won by an innings and three runs.
Measles is infectious.
Billiards is my favourite game.
‘Means’ అను పదము singular గాను మరియు plural గాను ఉపయోగింపబడుతుంది.
‘wealth’ అను భావముతో దానిని వాడినపుడు అది బహువచనమును సూచిస్తుంది. He succeeded by this means (or, by these means) in passing the examination.
His means are small, but he has incurred no debt.
38. కొన్ని Collective Nouns. అవి singular form లో ఉన్నప్పటికీ, వానిని plural గానే భావింప వలయును.
Poultry, cattle, vermin, people, gentry.
These poultry are mine..
Whose are these cattle?
Vermin destroy our property and carry disease.
Who are those people (= persons)?
There are few gentry in this town.
గమనిక (Note: Common noun అయిన ‘people’ అను పదము యొక్క అర్ధము ‘దేశం’ అని. దీనిని singular గాను plural గాను వాడుతారు. Plural గా వాడినపుడు (peoples) వివిధ దేశాల ప్రజలు అని అర్ధం వస్తుంది.
The Japanese are a hard-working people.
There are many different peoples in Europe.
39. సాధారణంగా సంయుక్త పదములు (compound nouns) లోని ప్రధాన పదమునకు – 5 ను చేర్చుట ద్వారా plural భావము వచ్చును.
Singular | Plural |
Commander-in-chief | commanders-in-chief |
Coat-of-mail | coats-of-mail |
Son-in-law | sons-in-law |
Daughter-in-law | daughters-in-law |
Step-son | step-sons |
Step-daughter | step-daughters |
Maid-servant | maid-servants |
(but man-servant, plural men-servants) | |
Passer-by | passers-by |
Looker-on | lookers-on |
Man-of-war | men-of-war. |
spoonful ను spoonfuls అనియు handful ను handfuls అనియు అంటాము. ఎందువలన అనగా single words.
(Note): Proper Nouns o words . అవి singular words మాత్రమే.
Brahman 50 Mussulman 5 compound కావున వాటి plurals “Brahmans Mussulmans” గా ఉండును.
40. Foreign languages నుండి English లోనికి తీసుకొనిన చాలా పదములు వాటి మాతృకలోని plural forms ను యధావిధిగా ఉంచుకొనును.
From Latin-
Erratum, errata; formula, formulae (or formulas)
index, indices: memorandum, memoranda;
radius, radii; terminus, termini (or terminuses)
From Greek-
Axis, axes; parenthesis, parentheses:
crisis, crises; hypothesis, hypotheses;
basis, bases, phenomenon, phenomena:
analysis, analyses; criterio
From Italian-
Bandit, banditti, (or bandits)
From French-
Madame (madam), mesdames; monsieur, messieurs.
From Hebrew-
Cherub, cherubim (or cherubs); seraph, seraphim (or seraphs).
41. కొన్ని నామవాచకములకు (singular) రెండు విధాలుగా ఉండును. అర్ధంలో కూడా కొంత తేడా ఉంటుంది.
Singular | Plural |
Brother | brothers, sons of the same parent. |
brethren, members of a society | |
or a community. | |
Cloth | cloths, kinds or pieces of cloth. |
clothes, garments. | |
Die | dies, stamps for coining. |
dice, small cubes used in games. | |
Index | indexes, tables of contents to books |
indices, signs used in algebra. | |
Penny | pennies, number of coins. |
pence, amount in value. |
42. కొన్ని నామవాచకములకు ఏకవచనములో రెండు అర్ధములు మరియు బహువచనములో ఒకే ఒక అర్ధము ఉండును.
Singular | Plural | |
Light: | (1)radiance; | Lights: lamps. |
(2)a lamp. | ||
People : | (1)nation; | Peoples: nations. |
(2)men and women. | ||
Powder: | (1)dust; | Powders : doses of medicine. |
(2)a dose of medicine in fine grains like dust. | ||
Practice: | (1) habit, | Practices: habits. |
(2) exercise of a profession. | Brothers Brethren |
43. కొన్ని నామవాచకములకు ఏకవచనములో ఒక అర్ధము, బహువచనములో రెండు అర్ధములు
ఉండును.
Singular | Plural | ||
Colour: | hue. | Colours : | (1) hues ; 2) the flag of a regiment. |
Custom: | habit. | Customs: | ( (1) habits ;(2) duties levied on imports. |
Effect ; | result. | Effects : | (1) results ;(2) property. |
Manner: | method. | Manners | (1) methods ;(2) correct behaviour. |
Moral: | a moral lesson. | Morals : | (1) moral lessons ;(2) conduct |
Number: | a quantity. | Numbers: | (1) quantities ;(2) verses. |
Pain: | suffering. | Pains: | (1) sufferings.(2) care, exertion. |
Premise: | proposition | Premises: | (1) propositions ;(2) buildings. |
Quarter : | fourth part. | Quarters : | (1) fourth parts ;(2) lodgings. |
Spectacle: | a sight. | Spectacles : | (1) sights ;(2) eye-glasses. |
Letter; | (1) letter of the alphabet; (2) epistle. | Letters : | (1) letters of the alphabet; epistles ; literature. |
Ground : | (1) earth ;(2) reason. | Grounds : | (1) enclosed land(2) reasons ;(3)drugs |
44. కొన్ని నామవాచకములకు singular లోని అర్ధమునకు మరియు plural లోని అర్ధములకు తేడాలు ఉన్నవి.
Singular | Plural |
Advice : counsel. | Advices : information. |
Air: atmosphere. | Airs : affected manners. |
Good : benefit, well-being. | Goods : merchandise. |
Compass : extent, range. | Compasses : an instrument for drawing circles. |
Respect: regard. | Respects : compliments. |
Physic : medicine. | Physics : natural science. |
Iron : a kind of metal. | Irons : fetters. |
Force : strength | Forces : troops. |
45. అక్షరములకు figures కు (సంఖ్యలు) మరియు ఇతర symbols కు (సంకేతములు) apostrophe మరియు కలుపుట ద్వారా అవి plural గా మార్పుచెందును.
There are more e’s than a’s in this page.
Dot your i’s and cross your t’s.
Add two 5’s and four 2’s.
46. ఈ క్రింది విధంగా చెప్పడం సర్వసాధారణం.
The Miss Smiths. (Singular, Miss Smith.)
47. Abstract Nouns & plural forms.Love, kindness.
వానిని plural form లో వాడినపుడు అవి లెక్కించుటకు వీలుగా నున్న plurals గా మారును.
Provocations = instances or cases of provocation. (రెచ్చగొట్టు సంఘటనలు)
Kindnesses = acts of kindness. జాలి చూపించే అనేక చర్యలు అనవచ్చును. పదార్ధముల పేర్లు లెక్కించుటకు వీలుకాదు. అవి plurals కావు.
Copper, iron, tin, wood.
పై పదములను plural form లో రాసినట్లయితే, వాటి అర్ధము మారును.
Coppers = copper coins ;
tins = cans made of tin ;
irons = fetters ; (అనగా సంకెళ్ళు)
woods = forests. (చిట్టడవులు)
అధ్యాయము 8
The Noun : Case
48. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి :-
1. John threw a stone.
2. The horse kicked the boy.
మొదటి వాక్యములో John అను పదము noun అయి ఉన్నది మరియు అది subject (కర్త) “Who threw a stone ?” అను ప్రశ్నకు సమాధానము.
dare అను verb ఉన్నది.
(Phrase) so threw a stone predicate predicate threw
John దేనిని విసిరినాడు? రాయిని (stone)
Stone అను పదము object (కర్మ) అయి ఉన్నది.
రెండవ వాక్యములో horse అను పదము noun.
“Who kicked the boy ?” అను ప్రశ్నకు ఇది సమాధానము. కావున noun అయిన “boy” అను పదము యిచ్చట object (కర్మ పదము). horse అను పదము కర్త.
ఇది “Whom did the horse kick” అను ప్రశ్నకు సమాధానము.
49. ఒక గా ఒక pronoun గాని verb పదమునకు Subject అయి ఉన్న పరిస్థితిలో, అట్టి noun మరియు pronoun nominative case లో నున్నవి అని అర్ధము (కర్తరూపక విభక్తి ప్రత్యయము).
ఒక noun గాని pronoun గాని verb పదమునకు object గా నున్నపుడు అట్టి noun గాని pronoun గాని objective caseలో (కర్మరూపక విభక్తి ప్రత్యయము) అయి ఉన్నది అని అంటాము. దీనిని Accusative case అని కూడా అంటారు.
గమనిక (Note: Nominative case ను కనుగొనాలంటే “who” లేక “what అను పదమును verb ముందు ఉపయోగించాలి. Accusative case objective case) ను కనుగొనాలంటే, “whom” అను పదమును “verb” మరియు దాని “subject” ముందు ఉపయోగించాలి.
50. Preposition తరువాత వచ్చే noun accusative case లో (కర్మపూర్వక విభక్తి ప్రత్యయము) అవుతుంది అని చెప్పుకుంటాము.
The book is in the desk.
పై వాక్యములో desk అను నామవాచక పదము కూడా accusative case అయి ఉన్నది. అది “in” అను preposition చేత అజమాయిషీ (govern) చేయబడుచున్నది.
51. ఈ క్రింది వానిని చదవండి.
The window was broken. (Subject).
Hari broke the window. (Object). Nominative మరియు Accusative నామవాచకములు భావములో కొంత తేడాతో ఉన్నప్పటికి ఒకే రూపము కలిగి యుండును.
Nominative పదము క్రియా పదమునకు (verb) ముందున ఉంటుంది.
Accusative నామవాచకము క్రియా పదమునకు (verb) తరువాత ఉంటుంది.
52. ఈ క్రింది వాక్యములను పోల్చి చూడండి.
1. Rama gave a ball.
2. Rama gave Hari a ball.
ఈ రెండు వాక్యములలో noun అయిన ball “gave” అను verb పదమునకు object (కర్మ సంబంధము) అయి ఉన్నది.
రెండవ వాక్యములో రాముని చేత బంతి స్వీకరింపబడిన వాడు హరి అని చెప్పబడినది. కావున హరి అను పదము indirect (not direct) అగును. Ball అను noun ( నేరుగా నున్న) object అయి ఉన్నది. Indirect object పదము క్రియా పదము (verb) తరువాత మరియు దాని తరువాత direct object పదము ఉండును.
గమనిక (Note) :
Rama gave Hari a ball = Rama gave a ball to Hari.
Note:- Rama (Subject), gave (Verb), Hari (Indirect object), a ball (Direct object)
Will you do me a favour?= Will you do a favour to me ?
I bought Rama a ball= | bought a ball for Rama.
Fetch the boy a book= Fetch a book for the boy.
She made Ruth a new dress= She made a new dress for Ruth
Get me a taxi= Get a taxi for me.
Verb యొక్క indirect object, ఎవరికి ఒక వస్తువు యివ్వబడినదో, ఎవరికి ఒక నష్టము గాని లాభము గాని సంభవింపబడినదో సూచిస్తుంది.
53. ఈ వాక్యమును పరిశీలించండి.
This is Ram’s umbrella.
Ram’s umbrella. రామునికి చెందిన గొడుగు. ఇచ్చట original గా రాముడుగా నున్న పదము రాముని యొక్కగా (Rama’s) మారినది. ఇందువలన గొడుగు పైనున్న హక్కుదారుడు (owner) ఎవరో మనకు తెలియుచున్నది. కావున Rama’s (రాముని యొక్క) అను పదము possessive case అగును (ఆస్తి హక్కు తెలియచేయునది). Possessive case ను Genetive case అని కూడా అంటారు. Possessive case “ఎవరిది” అనే ప్రశ్నకు సమాధానం చెబుతుంది.
54. Possessive Case అన్ని సందర్భాలలో ఆస్తి హక్కును తెలియజేయదు. అది గ్రంథకర్తను, పుట్టుకను, వర్గీకరణను (kind) మొదలగు వాటిని కూడా తెలియజేయును.
Shakespeare’s plays= the plays written by Shakespeare.
A mother’s love= the love felt by a mother.
The President’s speech= the speech delivered by the President.
Mr. Aggarwal’s house= the house where Mr. Aggarwal lives.
Ashok’s school= the school where Ashok goes.
A children’s playground= a playground for children.
A week’s holiday= a holiday which lasts a week.
Formation Of The Possessive Case
55. నామవాచకము ఏకవచన రూపములో నున్నపుడు అట్టి నామవాచక పదమునకు ” కలుపుట ద్వారా Possessive Case వచ్చును.
The boy’s book : the king’s crown.
గమనిక (Note) :
1. ఒకే పదములో అనేక ‘స’ శబ్ధములు (hissing sounds) ఉన్నపుడు ” అక్షరమును వదలివెయ్యడం
జరుగుతుంది.
For conscience’ sake ; for goodness’ sake :
For justice’ sake; for Jesus’ sake; Moses’ laws.
2. Noun పదము Plural form లో ఉండి ” అక్షరముతో అంతమగునపుడు కేవలం apostrophe(‘) వాడుట ద్వారా possessive case ఏర్పడును.
Boys’ school; girls’ school; horses’ tails.
3. Noun పదము Plural formation లో ఉండి ‘S’ తో అంతం కాకుండా ఉంటే, ‘క’ ను కలుపుట ద్వారా possessive case వచ్చును.
Men’s club; children’s books.
56. ఒక noun గాని, బిరుదు (title) గాని కొన్ని పదముల సమూహమై ఉంటే చిట్టచివరి అక్షరానికి మాత్రమే possessive sign (s) ను చేర్చుతారు.
The King of Bhutan’s visit.
The Prime Minister of Mauritius’s speech.
57. రెండు nouns ఒక దానిని యింకొకటి విశదీకరించుకుంటూ ఉంటే, possessive గుర్తు (‘s) ఆఖరి పదమునకు చేర్చబడును.
That is Tagore the poet’s house.
58. రెండు నామవాచక పదములు ఒక దానికొకటి దగ్గరగా కలుపుకొని, పోలిక కలిగిగాని ఉంటే (‘and’
ను ఉపయోగించడం ద్వారా) చివరి పదము possessive గుర్తును తీసుకొనును.
Karim and Salim’s bakery.
William and Mary’s reign.
59. రెండు లేక అంతకు మించి సంబంధిత nouns ఉండి మరియు ప్రతి దాని యొక్క ఆస్తి హక్కు సమస్య వచ్చిన ఎడల, ప్రతి దానికి possessive గుర్తు పెట్టవలయును.
Raja Rao’s and R.K. Narayan’s novels.
Goldsmith’s and Cowper’s poems.
Use Of The Possessive Case
60. సాధారణంగా జీవకోటి (living beings) నామములకే Possessive Case ఉపయోగించబడుతుంది. The Governor’s bodyguard : the lion’s mane..
కావున మనము ఇలా చెప్పాలి :
(brl)
The leg of the table (not, the table’s leg). అలా రాస్తే,log పైన table కు ఆస్తిహక్కు ఉన్నట్లు అర్ధం వస్తుంది.
The cover of the book (not, the book’s cover).
The roof of the house (not, the house’s roof)
61. Personified object కు Possessive గుర్తును వాడతాము.
India’s heroes Nature’s laws : Fortune’s favourite ; at duty’s call; at death’s door.
62. కాలము (time), స్థలం (space), తూకము (weight) మొదలగు నామవాచకములకు కూడా
possessive గుర్తును వాడవచ్చును.
A day’s march; a week’s holiday; in a year’s time; a stone’s throw
a foot’s length ; a pound’s weight.
63. Possessive గుర్తును కలిగియున్న ఈ క్రింది పదములు కూడా వాడకములో నున్నవి.
At his fingers’ ends; for mercy’s sake; to his heart’s content;
at his wit’s end; a boat’s crew.
64. Proper name యొక్క possessives లాగా వ్యాపారము (trade), వృత్తి (occupation) లేక సంబంధము (relationship) మొదలైనవి మరియు భవనము, వ్యాపారము, సంస్థ మొదలయిన వీటన్నిటికి కూడా possessive వాడవచ్చును. VITO ELGA BHT
She has gone to the baker’s (= baker’s shop). Tonight I am dining at my uncle’s (= uncle’s house).
Can you tell me the way to St. Paul’s ( – St. Paul’s Church)?
65. ఒక noun కు possessive వాడవలయునా లేక preposition ‘of’ ను వాడవలయునా అని సందేహం వస్తుంది. అట్టి సమయములో possessive యొక్క ప్రధాన లక్షణము ఆస్తి హక్కును తెలియజేయుట అని గుర్తుంచు కొనవలయును. ఓడిపోవుట అనునది ఆస్తిహక్కు కాదు. అట్టి సమయములో ‘enemy’s defeat’ కంటే ‘The defeat of the enemy’ అని వ్రాయుట ఉత్తమము. Preposition అయిన ‘of ‘ ను ఉపయోగించినపుడు, మరియు possessive నకు ‘s’ ను ఉపయోగించినపుడూ అర్ధంలో తేడా ఉంటుంది. ఈ తేడాలు చాలా సున్నితంగా ఉండడాన్ని గమనించవలెను.
The Prime Minister’s reception in Delhi’ means a reception held by the Prime Minister in Delhi.
The reception of the Prime Minister in Delhi’ means the manner in which the people welcomed him when he entered Delhi.
The phrase the love of a father’ may mean either ‘a father’s love of his child’ or ‘a child’s love of his father.
Nouns In Apposition
66. Apposition = (పొందిక – చేరిక అను సమాంతర అర్ధము) రెండు nouns మధ్య భావములో అమరికగాని, పోలికగాని ఉన్నప్పుడు అట్టి పోలికను Apposition అని అంటారు. (Not opposition) ఈ క్రింది వాక్యములను చదవండి.
Rama, our captain, made fifty runs .
రాముడు మరియు our captain యిద్దరూ ఒకరేనని మనము గమనించవలయును.
Noun అయిన captain అను పదము యింకొక noun అయిన Rama అను పదమును follow అగుచున్నది. ఇచ్చట captain అను పదమును ఉపయోగించుట ద్వారా రాముడెవరైనదీ స్పష్టముగా చెప్పబడుచున్నది మరియు రాముడు అనే proper noun ను వాడుట ద్వారా captain అనగా ఎవరు అని తెలియుచున్నది దీనినే భావముల అమరిక అని అంటాము.
రెండు నామవాచక పదములు ఉండి, రెండవది మొదటి దానిని వర్ణిస్తూ ఉండినచో రెండవ పదము మొదటి పదమునకు apposition లో ఉన్నది అని భావము. అనగా రెండు పదములకు పొందిక అయిన భావార్ధము ఉన్నది అని అర్ధము. పై వాక్యములో captain అను నామవాచక పదము యింకొక నామవాచక పదమైన Rama అను noun కు apposition లో ఉన్నది. రెండు పదములు కూడా nominative case లో నున్నవి.
మరికొన్ని ఉదాహరణలు :-
1. Kabir, the great reformer, was a weaver.
2. Yesterday I met your uncle, the doctor.
3. Have you seen Ganguli, the artist’s drawings ?
మొదటి వాక్యములోని రెండవ noun (apposition) nominative case లో ఉన్నది.
రెండవ వాక్యములో apposition పాత్రలో నున్న noun accusative case నున్నది (object రూపము) – ఎందువలన? ఆ వాక్యము లోని “met” అను verb నకు object గా నున్నది కావున.
3 వ వాక్యములో apposition లో నున్న noun పదము Genitive Case లో నున్నది. ఎందువలన?
అధ్యాయము 9
The Adjective
67. ఈ క్రింది వాక్యములను చదవండి :
1. Sita is a clever girl. (Girl of what kind ?)
2. I don’t like that boy. (Which boy ?)
3. He gave me five mangoes. (How many mangoes ?}
4. There is little time for preparation. (How much time?)
మొదటి వాక్యములో ‘clever’ అను పదము (adjective) సీతను వర్ణిస్తుంది.
రెండవ వాక్యములో ‘that’ అను పదము ‘ఏ పిల్ల వాడు’ అనే భావమును వివరిస్తుంది.
మూడవ వాక్యములో ‘five’ అను పదము అతను నాకు ఎన్ని మామిడి పండ్లు యిచ్చినాడు అనే విషయాన్ని చెబుతుంది.
నాలుగవ వాక్యములో ‘little’ అను పదము పని పూర్తి చేవుకోవడానికి ఎంతకాల వ్యవధి ఉన్నది అనే విషయం చెప్పుతుంది.
ఒక విషయమును విపులీకరించడానికి గాని, ఎత్తి చూపించడానికి గాని, ఎన్ని, ఎంత అని చెప్పడానికి గాని వాడబడే పదం మరియు అట్టి పదము నామవాచకముతో కలిసి ఉంటే, అది adjective అవుతుంది. adjective అయిన పదము number ను గురించి గాని, పరిమాణమును (quantity) గురించి గాని గుణమును గురించి గాని చెప్పునది అయి ఉండవలయును.
కావున, noun యొక్క అర్ధమును విపులీకరించడానికి దానికి తోడుగా వాడబడిన పదమును adjective
అని అంటాము.
Adjective అనగా nounకు గాని pronoun కు గాని ఇంకా కొంచెం భావమును కలుపునది అని అర్ధము.
68. ఈ క్రింది వాక్యములను గమనించండి :
1. The lazy boy was punished.
2. The boy is lazy.
మొదటి వాక్యములో Adjective అయిన lazy అను పదము noun తో పాటుగా కలిసి ఉన్నది. Boy యొక్క లక్షణాన్ని వివరిస్తుంది. Boy కు ముందు వాడబడింది. Lazy అను పదమును చెడుగా మాట్లాడడానికి మరియు గుణాన్ని చెప్పడానికి అనగా epithet గా మరియు attributive గా కూడా వాడతాము.
రెండవ వాక్యములో Adjective అయిన lazy అను పదము verb పదము అయిన “is” తో కలిపి ఉపయోగించబడినది. ఇచ్చట verb (is) + adjective (lazy) అను రెండు పదములు కలిసి predicate అయినవి. కావున, lazy అను పదము predicative గా వాడబడినది అని చెప్పుకుంటాము.కొన్ని Adjectives predicate form లో మాత్రమే వాడవచ్చును.
She is afraid of ghosts.
I am quite well.
Kinds Of Adjectives
Adjective ను ఈ క్రింది రూపములలో వాడతాము:-
69. నాణ్యమును (Quality ని) తెలియజేయునది. వీనిని Descriptive Adjectives అని కూడా అంటారు. ఇవి రకమును (class), గుణమును (quality) ని తెలియజేయును.
Kolkata is a large city.
He is an honest man.
The foolish old crow tried to sing.
This is a Grammar of the English language.
Proper Noun & form eo
adjectives
ఇవి French wines Turkish tobacco, Indian tea మొదలైనవి. వీనిని కొన్ని సందర్భములలో Proper Adjectives అని కూడా అంటారు. సాధారణంగా వీనిని adjectives of quality జాబితాలో కలుపుతారు.
Of what kind ? ఈ ప్రశ్నకు adjectives of quality మనకు సమాధానము చెప్పును.
70. Adjectives of Quantity (పరిమాణము) ఇవి ఒక పదార్ధము యొక్క పరిమాణము (size, weight etc.) అనే భావమును తెలుపును.
I ate some rice.
He showed much patience.
He has little intelligence.
We have had enough exercise.
He has lost all his wealth.
You have no sense.
He did not eat any rice.
Take great care of your health.
He claimed his half share of the booty.
There has not been sufficient rain this year.
The whole sum was expended.
How much ? అనే ప్రశ్నకు పై వాక్యములలో మనకు సమాధానము దొరకుతుంది.
71. Adjectives of Number (or Numeral Adjectives)
ఇవి సంఖ్యను తెలియజేయును. తద్వారా ఒక వర్ణనను కూడా ఇచ్చును.
ఎంత మంది మనుష్యులు? ఎన్ని వస్తువులు? ఆ మనుష్యుల క్రమము మరియు వస్తువుల క్రమమును
కూడా అవి తెలియజేయును.
The hand has five fingers..
Few cats like cold water.
There are no pictures in this book.
I have taught you many things.
All men must die.
Here are some ripe mangoes.
Most boys like cricket.
There are several mistakes in your exercise.
Sunday is the first day of the week.
How many? అను ప్రశ్నకు సమాధానం చెప్పును.
72. Adjectives of Number (or Numeral Adjectives)
(a) Definite Numeral Adjectives ఇవి ఖచ్చితంగా సంఖ్య యింత అని చెప్పును.
One, two, three, etc.
First, second, third, etc.
These are called Cardinals.
These are called Ordinals.
(ఇందులో Cardinal అను subtitle “ఎన్ని?” అను ప్రశ్నకు సమాధానం చెప్పును. ఇంకొక subtitles | అయిన ordinal అను పదము వరుస క్రమమును గురించి చెప్పును. (serial)
esia)
(b) Indefinite Numeral Adjectives ఇవి ఖచ్చితంగా ఇంత సంఖ్య అని చెప్పవు. ఇలా :
All, no; many, few; some, any; certain, several, sundry.
(c) Distributive Numeral Adjectives.Adjectives
ఇచ్చట ఒక వరుస క్రమములో నున్న వానిని, ఒక్కొక్క దానిని వేరువేరుగా పేర్కొనడం జరుగుతుంది.
Each boy must take his turn.
(చెరియొక్క బాలుడు)
India expects every man to do his duty. (5)
Every word of it is false.
Either pen will do.
On either side is a narrow lane.
Neither accusation is true.
glow
73. ఒకొక్కసారి ఒకే Adjective పరిమాణం క్రింద (quantity), మరియు సంఖ్య (number) క్రింద
వచ్చును.
Adjectives of Quantity
I ate some rice.
He has lost all his wealth.
You have no sense.
He did not eat any rice.
I have enough sugar.
Adjectives of Number
Some boys are clever.
All men must die.
There are no pictures in this book.
Are there any mango-trees in this garden? There are not enough spoons.
74. Demonstrative Adjectives ఫలానా వ్యక్తి లేక వస్తువు అని తెలియజేయును.
This boy is stronger than Hari.
That boy is industrious.
These mangoes are sour.
Those rascals must be punished, yonder fort once belonged to Shivaji.
Don’t be in such a hurry.
I hate such things.
‘ Which ? (ఏది?)’ అను ప్రశ్నకు Demonstrative Adjectives సమాధానము చెప్పును.
(this, that 52 Singular nouns
చూపించును)
8 these, those e5 Plural nouns
75. ప్రశ్నలు అడుగ సందర్భములలో nouns తో పాటుగా ‘ What, which మరియు whose, when’ అను పదములను వాడినట్లయితే వాటిని Interrogative Adjectives అంటారు. (ప్రశ్నించు Adjectives)
What manner of man is he?
Which way shall we go?
Whose book is this?
What అను పదమును general భావముతో వాడతాము. ఒకరిని గురించిగాని, ఒక వస్తువును ఉద్దేశించిగాని వాడుతాము.)
Which అను పదమును ప్రత్యేకముగా
అభ్యాసము 6
ఈ క్రింది వాక్యములలో Adjectives ను గుర్తించండి.
అవి ఏ class కు చెందినవో కూడా పేర్కొనండి.
1. The ship sustained heavy damage.
2. I have called several times.
3. Every dog has his day.
4. A live ass is better than a dead lion.
5. Every man has his duties.
6. Say the same thing twice over.
7. Several persons were present at the time.
8. He is a man of few words.
9. Neither party is quite in the right.
10. What time is it?
11. Which pen do you prefer?
12. The way was long, the wind was cold, the minstrel was infirm and old
13. He comes here every day.
14. I have not seen him for several days.
15. There should not be much talk and little work.
16. Abdui won the second prize.
17. The child fell down from the great height.
18. He was absent last week.
19. He died a glorious death.
20. A small leak may sink a great ship.
21.Good wine needs no bush,
22. I like the little pedlar who has a crooked nose.
23. King Francis was a hearty King, and loved a royal sport.
24. In the furrowed land the toilsome and patient oxen stand.
25.My uncle fives in the next house.
26. Some dreams are l’rke reality.
27. A cross child is not liked..
28. It is an ill wind that blows nobody any good.
76. Emphasizing Adjectives. ఈ క్రింది వాక్యములలో own మరియు very అను పదములు Emphasizing Adjectives గా వాడబడినవి. Emphasize అనగా నొక్కివక్కాణించుట.
I saw it with my own eyes.
He was beaten at his own game.
Mind your own business.
He is his own master.
That is the very thing we want.
“When all else left my cause,
My very adversary took my part”.
77. Exclamatory Adjectives. What 325 Exclamatory Adjective (ఆశ్చర్యము గొలుపునది) వాడటం జరుగుతుంది.
What genius!
What folly!
What an idea!
What a blessing!
What a piece of work is man!
78. This మరియు that అను పదములను ఒక్కోసారి సంఖ్య (number) ను తెలియజేయడానికి
కూడా వాడటం జరుగుతుంది (రూలు 74 కూడా చూడండి)
This girl sings.
That boy plays.
These girls sing.
Those boys play.
This, these అను పదములను ఆ వస్తువులు speaker కు దగ్గరగా నున్నపుడు వాడెదరు. That, those అను పదములను దూరమున నున్న వస్తువుల గురించి వాడెదరు.
79. (a) చాలా Adjectives, nouns నుండి రూపాంతరం చెంది ఏర్పడును.
Noun | Adjective | Noun | Adjective |
Boy | boyish పిల్లతనము | Dirt | dirty మురికిగానున్న |
Fool | foolish బుద్దిలేన | Storm | stormy ముసురుగానున్న |
Care | careful జాగ్రత్తగలిగిన | Pardon | pardonable క్షమించదగిన |
Play | playful ఆటతనము | Laugh | laughable నవ్వులపాలైన |
Hope | hopeful ఆశగానున్న | Outrage | outrageous అభ్యంతరకరమైన |
Venture | venturesome చొరవగల | Courage | courageous ధైర్యముగల |
Trouble’ | troublesome | Glory | englorious గొప్ప |
Shame | shameless | Envy | envious అసూయతోగూడిన |
Sense | senseless అర్ధములేని | Man | manly మగసిరిగల |
Silk | silken సిల్కులా మృదువైన | King | kingly రాజులాంటి |
Gold | golden బంగారంలాంటి | Gift | gifted అదృష్టము గల |
(b) కొన్ని Adjectives, verbs నుండి రూపాంతరం చెందును.
Verb Adjective
Tire tireless అలుపు సొలుపులేని
Talk talkative మాటకారి
Cease ceaseless విరామము లేని
Move moveable కదలించగల
(c) కొన్ని Adjectives మాత్రము ఇతర Adjectives నుండి ఏర్పడును.
Adjective Adjective
Tragic tragical దారుణమైన
Black blackish
Whole wholesome సంపూర్ణమైన
White whitish
Three threefold మూడురకముల కూడికగల
Sick sickly
అభ్యాసము 8
ఈ క్రింద ఇవ్వబడిన Nouns నుండి Adjectives ను మార్చి వ్రాయండి.
Ease, pity, time, heaven, health, wealth, love, hill, need, green, room, cost, pain, doubt, wonder, peace, child, prince, mountain, ridicule, picture, labour, wood, pomp, artist, progress, slave, contempt, tempest, sense, quarrel, thought, hope, friend.
అభ్యాసము 9
ఈ క్రింది Adjectives ను (విశేషణములను) వాక్యములలో పొందుపరచండి.
His polite manners have endeared him to all.
Swimming is a healthy exercise.
A certain man fell among thieves.
Happy, sad, industrious, lazy, big, small, soft, harsh, hard, polite, rude, wise, foolish, rich, poor, young, new, old, long, short, quick, slow, strong, weak, handsome, ugly, clever, dull, kind, cruel, healthy, dutiful, distant, certain.
అభ్యాసము 10
ఈ క్రింద ఉన్న Nouns కు ఒక Suitable Adjective జత చెయ్యండి.
A long siege.
A decisive victory.
A populous city.
A devoted husband.
Storm, siege, sleep, victory, advice, blow, silence, hands, water, servant, flower, city, artisi, dealer, voice, husband, subject, child, king, dog.
అభ్యాసము 11
ఈ క్రింది నామవాచక పదములకు (Nouns) సాధ్యమైనన్ని Adjectives ను చూపించండి.
A clean street.
A deliberate lie, a black lie, a white lie.
Fortune, man, news, storm, health, novel, progress, room, incident
అభ్యాసము 12
ఈ క్రింది మాటలకు తగిన వ్యతిరేకార్ధమును ఇచ్చు Adjectives ను వ్రాయండి.
Courageous, many, wild, hot, lean, heavy, costly, barren, beautiful, patient, honest, civilized, careful, strong, experienced, slow, friendly, cruel, soft.
అధ్యాయము 10
Comarision of Adjectives
80. ఈ క్రింది వాక్యములను చదవండి :
1. Rama’s mango is sweet.
2. Hari’s mango is sweeter than Rama’s.
3. Govind’s mango is the sweetest of all.
మొదటి వాక్యములో, ‘sweet ‘ అను adjective రాముని యొక్క మామిడిపండు తియ్యగా నున్నది. అని మాత్రమే చెబుతుంది. కాని ఎంత తీపిగా ఉన్నది అనే విషయం చెప్పడంలేదు.
రెండవ వాక్యములో adjective అయిన sweeter అను పదము హరి యొక్క మామిడిపండును రాముని యొక్క మామిడిపండుతో పోల్చి చూచినట్లయితే హరి యొక్క మామిడిపండు ఇంకా తీపిగా ఉన్నది. అనే అర్ధం వస్తుంది.
-మూడవ వాక్యములోని sweetest అను adjectve గోవిందుని మామిడిపండులో పై రెండు మామిడిపండ్లలో కన్నా అత్యధికమైన తీపి ఉన్నది అనే అర్ధం తెలుపుతుంది.
ఈ విధంగా ఒక వస్తువునకు యింకొక వస్తువునకు తీపి గుణములో నున్న పోలికల వ్యత్యాసమునకు sweet sweeter, sweetest అను adjectives ను వాడడం జరిగింది. ఈ తేడాలనే Degrees of Comparison అని grammar చెబుతుంది.
Sweet adjective ను positive degree అని అంటాము.
Sweeter adjective ను comparative degree అని అంటాము. Sweetest అను adjective ను superlative degree అని అంటాము. Positive degree ని simple form అంటాము.
Comparative degree అంతకంటే ఎక్కువ స్థాయిని సూచిస్తుంది.
Superlative degree అన్నిటికంటే ఎక్కువ స్థాయిని సూచిస్తుంది.
This boy is stronger than that.
Which of these two pens is the better?
Apples are dearer than oranges.
గమనిక (Note) 1. ఒక వస్తువును ఇంకొక వస్తువుతో పోల్చడానికి ఇంకొక పద్ధతి కూడా ఉన్నది. ‘Rama is stronger than Balu’ అనే వాక్యమును ‘Balu is less strong than Rama’ అని కూడా చెప్పవచ్చును. ‘Hari is the laziest boy in the class’ అనే భావమును ‘Hari is the least industrious boy in the class’ (శ్రమపడలేని) అని కూడా చెప్పవచ్చును.
గమనిక (Note) 2. ఒక వ్యక్తియొక్క గాని, ఒక వస్తువు యొక్కగాని సామర్ధ్యమును గాని, నాణ్యతను గా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నదో చెప్పడానికి కూడా Superlative degree ని ఉపయోగించెదము. ఇచ్చట ఇంకొక వ్యక్తితో గాని, వస్తువుతో గాని పోల్చి చెప్పవలసిన అవుసరం ఉండదు.
This is most unfortunate.
It was a most eloquent speech.
Truly a most ingenious device ! ingenious = గొప్ప మేధాశక్తిగల
ఈ విధంగా చెప్పినపుడు దానిని Superlative of Eminence (విశిష్టత) అని గాని Absolute Superlative (పూర్తిస్థాయి ఆధిక్యత) అని గాని అంటారు.
Formation Of Comparative Ans Superlative
81. ఒకే ఒక syllable (శబ్దాక్షరము) గాని అంతకంటే ఎక్కువ syllables గాని ఉన్న Positive s పదములకు – er గాని – est గాని కలిపినట్లయితే comparative మరియు superlative పదములు వచ్చును.
Positive | Comparative | Superlative |
Sweet | s weeter | sweetest |
Smai! | smaller | smallest |
Tall | taller | tallest |
Bold | bolder | boldest |
Ciever | cleverer | cleverest |
Kind | kinder | kindest |
Young | younger | youngest |
Great | greater | greatest |
Positive పదము – e తో అంతమయినచో – గాని st గాని comparative మరియు superlative లకు వాడవలయును.
Brave | braver | bravest |
Fine | finer | finest |
White | whiter | whitest |
Large | larger | largest |
Able | abler | ablest |
Noble | nobler | noblest |
Wise | wiser | wisest |
Positive పదము y తో అంతమయిన సందర్భములో మరియు అది consonant ను ముందున కలిగినచో – y అక్షరము / అక్షరముగా మారును. తరువాత er మరియు est syllables ను comparative degree కొరకు మరియు superlative degree కొరకు కలపవలయును.
Happy | happier | happiest |
Easy | easier | easiest |
Heavy | heavier | heaviest |
Mem/ | merrier | merriest |
Wealthy | wealthier | wealthiest |
Positive పదము ఒకే ఒక syllable కలిగి యుండి, అది తదుపరి single consonant తో అంతమగునచో (ఇచ్చట ఆ single syllable కు ముందున పొట్టి (హ్రస్వ ధ్వని కలది) vowel ఉండవలయును) అప్పుడు consonant అక్షరము double అవుతుంది. తరువాత er మరియు జరుగుతుంది.
Red | redder, | reddest |
Big | bigger | biggest |
Hot | hotter | hottest |
Thin | thinner | thinnest |
Sad | sadder | saddest |
Fat | fatter | fattest |
82. Positive degree లో నున్న adjective పదమునకు రెండు గాని అంతకంటే ఎక్కువ గాని syllables (శబ్దాక్షరములు) ఉన్నట్లయితే అట్టి adjective పదములను comparative, superlative degree లలో చూపడానికి, more మరియు most అను పదములను వాడవలయును. (Ex. Beautiful అను పదములో బ్యూ + టి + ఫుల్ అను మూడు శబ్దాక్షరములు (sounds) ఉన్నవి.
Positive | Comparative | Superlative |
Beautiful | more beautiful | most beautiful |
Difficult | more difficult | most difficult |
Industrious | more industrious | most industrious |
Courageous | more courageous | most courageous |
” రెండు syllables కలిగియున్న adjectives
– ful తో end అయినను ( useful మాదిరి లేక
– less తో end అయినను ( hopeless మాదిరి లేక
– ing తో end అయినను (boring మాదిరి లేక
– ed తో end అయినను ( surprised మాదిరి) ఇంకను ఇతరములైన modern, recent, foolish, famous, certain మొదలైనవాని విషయములోను, more, most వాడతాము.
polite | simple | feeble | gentle | narrow |
cruel | common | handsome | pleasant | stupid |
She is politer/more polite than her sister.
He is the politest/most polite of them.
83. ఒకే వ్యక్తి విషయములోను, ఒకే వస్తువు విషయములోను రెండు గుణములను పోల్చి చూపవలసి వచ్చినపుడు – er అను comparative ను వాడరాదు. రాముని ధైర్యము బాలూ ధైర్యము కన్న మిన్న యైనది. అని చెప్పవలసి వచ్చినపుడు Rama is braver than Balu అంటాము. కాని రాముని ధైర్యము అతని పొదుపరితనముకంటె మిన్న యైనది అని చెప్పవలసి వచ్చినపుడు, Rama is more brave than prudent అని అంటాము.
84. రెండు objects ను (కంటికి కనిపించునవి) ఒక దాని గుణముతో ఇంకొక దానిని పోల్చు సందర్భములో రెండు పోలికలలో రెండవ పోలికను వదలి వేయవలయును.
Iron is more useful than any other metal-correct. 5 Iron is more useful than any other metal is usefull” అని అనరాదు.
“Other” అనే పదాన్ని తప్పక వాడాలి.
Irregular Comparision
85. ఈ క్రింది పదములు irregular comparisons అయి ఉన్నవి. (అపసవ్యమైనవి అని అర్ధం) అవి వాడుకలో నున్నట్టివి – ఈ examples లో comparatives మరియు superlatives ఉండవు.
Positive | Comparative | Superlative |
Good, well | better | best |
Bad, evil, ill | worse | worst |
Little | less,lesser | least |
Much | more | most (quantity) |
Many | more | most (number) |
Late | later, latter | latest, last |
Old | older, elder | oldest, eldest |
Far | farther | farthest |
(Nigh) | (nigher) | nighest, next |
(Fore) | (former) | foremost, first |
(Fore) | further | furthest |
(In) | inner | inmost, innermost |
(Up) | upper | upmost, uppermost |
(Out) | outer, (utter) | utmost, uttermost |
గమనిక (Note: nigh, nigher, nighest, fore మరియు utter అను వానికి comparisons లేవు.
అభ్యాసము 13
ఈ క్రింది Adjectives ను పోల్చి చూడండి.
Black, excellent, iil, gloomy, mad, safe, bad, unjust, gay, able, dry, timid, ugly, true, severe, exact, agreeable, difficult, little, few, numerous, merry.
86. 85వ Rule లో కొన్ని Comparative కు, కొన్ని Superlative కు జంట రూపములు (double forms) ఉన్నవి. దీనిని వేరే విధంగా కూడా వాడతారు.
Later, latter; latest, last.
Later మరియు latest అను రెండు పదములు time ను సూచించును. Latter మరియు last అను
పదములు తను ఉన్న స్థానమును గురించి (position) తెలుపును. (యిచ్చట ‘later’ కు ‘latter’ కు రెండు వేర్వేరు అర్ధములు ఉన్నవి కదా)
Later అనగా ఆలశ్యముగా వచ్చినట్టి
Latter అనగా ఇంకొకరి తరువాత నున్నట్టి Latest అనగా తాజాగా ఉన్నట్టి
Last అనగా లైనులో చిట్టచివర నున్న
He is later than I expected.
I have not heard the latest news.
The latter chapters are lacking in interest. The last chapter is carelessly written. Ours is the last house in the street. Elder, older; eldest, oldest.
Elder మరియు eldest అను పదములను మనుష్యుల విషయంలో వాడతాము. జంతువులకు వాడరాదు. వస్తువులకు వాడరాదు. ఇప్పుడు ఈ పదములను ఒకే family లో నున్న వ్యక్తులకు మాత్రమే వాడుచున్నాము. Elder అను పదము తరువాత than అను పదమును వాడరాదు. Older మరియు oldest అను పదములను మనుష్యులకు, వస్తువులకు కూడా వాడెదము. Elder అను పదము ఇతని కంటే అతను ముందు పుట్టినవాడు అనే అర్ధాన్నిస్తుంది. Older మరియు Oldest అను పదములను వయస్సును సూచించుటకు మాత్రమే వాడతాము.
John is my elder brother.
Tom is my eldest son.
He is older than his sister.
Rama is the oldest boy in the eleven.
This is the oldest temple in Kolkata.
Farther, further. దూరము యొక్క తేడాలను తెలియజేయుటకే ఈ పదములను వాడతారు. Addition అను అర్ధము రావడానికి (ఇంకా చెప్పాలంటే) further అను పదమును వాడతాము. Further అనగా ఇంకా చెప్పవలసినది ఏమిటంటే అనే భావాన్ని ఇస్తుంది. Farther అను పదము ఇంగా ఎంత దూరాన ఉన్నది అనే భావాన్నిస్తుంది.
Kolkata is farther/further from the equator than Colombo.
After this he made no further remarks,
I must have a reply without further delay.
Nearest, next. Nearest అంటే దగ్గరగా నున్న అని అర్ధము. Next అంటే తరువాత ఉన్న అని అర్ధము.
Mumbai is the seaport nearest to Europe. Where is the nearest phone box? Karim’s shop is next the Post Office.
My uncle lives in the next house.
(a) ‘Later’ or ‘latter’
87. Modern English లో కొన్ని comparative పదములు వాటి comparative కట్టుబడులను పోగొట్టుకున్నవి. అవి ఇప్పుడు positives గానే వాడబడుచున్నవి. అవి యివి :-
Former, latter, elder, upper, inner, outer, utter.
Both the tiger and the leopard are cats; the former animal is much larger than the latter.
The inner meaning of this letter is not clear.
The soldiers ran to defend the outer wall.
My elder brother is an engineer.
This man is an utter fool.
88. Latin భాష నుండి english భాషలోనికి స్వీకరింపబడిన కొన్ని పదములకు comparatives మరియు superlatives ఉండవు. అవి అన్నియు – or తో అంతమగును. వానికి – er ఉండదు. అవి మొత్తం పన్నెండు. అందులో ఐదింటికి అసలు comparative భావమే పోయింది. ఆవి ఇప్పుడు positive degrees గానే
అమలులో నున్నవి. అవి యివి :-
Interior, exterior, ulterior, major, minor s
The exterior of the house is made of stone; the interior walls are of wood.
His age is a matter of minor importance.
I have no ulterior motive in offering you help.
ngmoo
మిగిలిన ఏడు పదములు వానివాని comparative degree స్వరూపములను నిలబెట్టుకొన్నవి. వానికి ‘than ‘ కాకుండా ‘to’ ను ఉపయోగించెదరు.
89. Comparative degree పదములకు వెనువెంటనే సాధారణంగా ‘than’ ఉంటుంది. కాని or తో అంతమగు Comparative Adjectives నకు వెనువెంటనే prepostion అయిన ‘to’ ఉంటుంది.
Inferior, superior, prior, anterior, posterior, senior, junior.
Hari is inferior to Ram in intelligence.
Rama’s intelligence is superior to Hari’s.
His marriage was prior to his father’s death.
He is junior to all his colleagues.
All his colleagues are senior to him.
90. ఒక విధమైన నాణ్యతను (quality) తెలియజేయునట్టి adjective పదములు వివిధములైన comparisons ను కలిగియుండవు.
Square, round, perfect, eternal, universal, unique.
ఖచ్చితంగా చెప్పాలంటే, square అంటే అది పూర్తి square (పూర్తి నలుచదరము) అని అర్ధం. ఇంకా చదరము, లేక అన్నిటికంటె ఎక్కువ చదరము అనే భావము రావడానికి వీలులేదు. Round, perfect పదములకు గూడా పై రూల్ వర్తిస్తుంది. కాని ఇచ్చట ఒక మినహాయింపు ఉన్నది.
ఉదాహరణకు, This is the most perfect specimen | have seen.
Interchange Of The Degrees Of Comparison
91. ఒక వాక్యము యొక్క అర్ధము మారకుండా Degree of Comparison ను మార్చవచ్చును. క్రింది వాక్యములలో ఈ విధానము చూపబడినది.
Superlative-Lead is the heaviest of all metals.
Comparative-Lead is heavier than all other metals.
Comparative-Mahabaleshwar is cooler than Panchgani
Positive-Panchgani is not so cool as Mahabaleshwar.
Positive-He is as wise as Solomon.
Comparative- Solomon was not wiser than he is.
Superlative- Shakuntala is the best drama in Sanskrit.
Comparative- Shakuntala is better than any other drama in Sanskrit.
Positive- No other drama in Sanskrit is so good as Shakuntala.
Superlative- Chennai is one of the biggest of Indian cities.
Comparative – Chennai is bigger than most other Indian cities.
Positive- Very few Indian cities are as big as Chennai.
Positive – Some poets are at least as great as Tennyson.
Comparative -Some poets are not less great than Tennyson.
-Tennyson is not the greatest of all poets.
Superlative- Tennyson is not greater than some other poets.
అధ్యాయము 11
Adjectives Used As Nouns
92. దృష్టికి అందని భావాన్ని (abstract quality ని) ఏకవచన నామవాచకముగా ఎలా చెప్పవలయునో ఇచ్చట చూపబడినది.
The future (= futurity) is unknown to us.
He is a lover of the beautiful (= beauty in general) Note – Beauty is abstract Noun. We cannot see beauty directly without an instrument. Ex. beautiful face, beautiful peek etc., are instruments 3. కొన్ని Adjectives సంపూర్ణముగా Nouns గా మారిపోతవి. ఇట్టి వానిని singular nouns గా మరియు plural nouns గా కూడా వాడెదరు.
(a) Those derived from Proper Nouns; as, Australians, Canadians, Italians,
(b) Some denoting persons (as age mortals, inferiors, superiors, nobles, criminals, savages, elders, minors.
Ko Ko); as, juniors, seniors,
(c) A few denoting things generally; as, secrets, totals, liquids, solids, valuables. [Some adjectives are used as Nouns only in the plural; as, valuables, eatables.]
(కొన్ని Nouns ను బహుసచన నామవాచకములు (plural nouns) గా మాత్రమే వాడెదరు.
valuables, eatables (85 wordwes)
4. మరికొన్ని ఉదాహరణలు:
In general, in future, in short, in secret, before long, at present, for good,
ఉదా:
at best, through thick and thin, for better or for worse; in black and white, right or wrong, from bad
to worse, the long and short.
in future I shall charge you for medical advice.
In short, we know nothing.
The negotiations were carried on in secret.
I shall see you before long.
Before long, he will be appointed to a higher post.
At present, he is in pecuniary difficulties.
I do not want any more at present.
He has left India for good.
We cant arrive before Saturday at best.
It must be said to his credit that he stood by his friend through thick and thin.
I must have your terms down in black and white.
Right or wrong, my country.
I am afraid the young man is going from bad to worse.
The long and short of it is that I distrust you.
Nouns Used As Adjectives
93. Nouns ను Adjectives గా మార్చడం English భాషలో సర్వసాధారణమైన విషయం.
I met a little cottage girl.
(Cottage girl అనగా ఒక పల్లెటూరి అమ్మాయి అని కూడా చెప్పవచ్చు. అప్పుడు cottage అనే noun, adjective అయినది.)
He is always playing computer games.
అధ్యాయము 12
Position Of Adjectives
94. Adjective పదము noun ను వర్ణించునపుడు, అట్టి Adjective ను noun కు ముందు తప్పనిసరిగా
ఉంచవలయును.
King Francis was a hearty king, and loved a royal sport.
Where are you going, my pretty maid, with your rosy cheeks and golden hair ?
O Captain I my Captain! our fearful trip is done.
ఈ క్రింది వాక్యములలోని భావాల తేడాను గమనించండి.
(a) a great nobleman’s son, and
(b) a nobleman’s great son.
95. పద్యభాగములో మాత్రము వర్ణించు Adjective ను noun తర్వాత వాడెదరు.
Children dear, was it yesterday?
We heard the sweet bells over the bay.
O man with sisters dear!
96. ఒక noun ను ఒకే Adjective కాక మరి కొన్ని Adjectives కలిసి మూకుమ్మడిగా వర్ణించునపుడు (వచన భాగంలో) ఆ Adjectives సముదాయమును వర్ణింపబడు noun తర్వాత ఉంచెదరు. దీనివలన ఆ వర్ణనను నొక్కి వక్కాణించు నట్లగును.
There dwelt a miller hale and bold.
The King, fearless and resolute, at once advanced.
Franklin had a great genius, original, sagacious, and inventive.
97. ఒక Adjective యొక్క భావాన్ని ఒక word ద్వారాగాని, ఒక phrase ద్వారాగాని సవివరంగా వివరించ వలసిన సందర్భములో, అట్టి adjective ను noun తరువాత వాడెదరు.
He was a man fertile in resource.
A Sikh, taller than any of his comrades, rushed forward.
98. సాధారణంగా కొన్ని phrases లో Adjective, noun తరువాత ఉంటుంది.
Heir apparent, time immemorial, lord paramount, viceroy elect, letters patent, knights temporal, notary public, body politic, God Almighty.
అధ్యాయము 13
The Correct Use Of Some Adjectives
99. Some, any – ఒక పరిమాణమును (quantity) గాని, లేక ఒక తీవ్రత (degree) నుగాని తెలుపునపుడు, some అను పదాన్ని affirmative sentence (అవును అని చెప్పునవి) లోనూ మరియు any అను పదాన్ని negative or interrogative sentence (కాదు అని చెప్పునవి లేదా ప్రశ్నించునవి) వాక్యములలో వాడెదరు.
I will buy some mangoes.
I will not buy any mangoes.
Have you bought any mangoes?
But any can be used after if in affirmative sentences.
An affirmative (అవును అని చెప్పునవి) Sentence లో “if” తరువాత “any” అను పదాన్ని వాడవచ్చును.
If you need any money I will help you.
“Some” ఒక వస్తువును సంతోషముగా యిచ్చునపుడు గాని, ఒక విన్నపము చేయునపుడు గాని మరియు అవతలివారు అంగీకరించు సందర్భములో గాని “some” అను పదమును వాడెదము.
Will you have some ice-cream? (Offer)
Could you lend me some money? (Request)
Did you buy some clothes? (= I expect you did.)
100. Each every ఈ రెంటి అర్ధం దాదాపు ఒకటిగానే ఉంటుంది. కాని every అను పదము బలమైనట్టిది. Each అను పదాన్ని, రెండు లేక అంతకంటే ఎక్కువ సంఖ్య ఉన్నపుడు ప్రయోగించవలయును. ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నపుడు “every” అను పదాన్ని ప్రయోగిస్తాము. Each అను పదము ఒక సమూహములోని ప్రతి వ్యక్తిని ఉద్దేశించి కూడా చెబుతుంది. Every అను పదము total group కు సంబంధించి ఉంటుంది. ఒక సమూహము యొక్క సంఖ్య limited గా ఉన్నపుడే each ని వాడాలి. సమూహము యొక్క సంఖ్య అసంఖ్యాకముగా నున్నపుడు every అను పదాన్ని వాడవలయును.
Every seat was taken.
Five boys were seated on each bench. Each one of these chairs is broken.
Leap year falls in every fourth year.
He came to see us every three days (i. e., once in every period of three days).
It rained every day during my holidays.
It was away ten days and it rained each day.
101. Little, a little, the little. ఇచ్చట ఈ మూడింటికి ఉన్న తేడాను జాగ్రత్తగా గమనించండి.
1. Little అనగా ఏమంత ఎక్కువ కాదు. కొంచెం మాత్రమే అని అర్ధం.
There is little hope of his recovery, i.e., he is not likely to recover.
He showed little concern for his nephew.
He has little influence with his old followers. He showed little mercy to the vanquished. He has little appreciation of good poetry.
2. A little ఏదో కొంత అని అర్ధం. Little అను పదము adjective. ఒక విధంగా ఎంతో కొంత
అసంతృప్తి భావాన్నిస్తుంది.
1.There is a little hope of his recovery, i.e., he may possibly recover.
2.A little tact would have saved the situation.
A little knowledge is a dangerous thing.
3. The little కొద్దిపాటి మోతాదు. అంత ఎక్కువ కాదు అని అర్ధము.
The little information he had was not quite reliable.
The little knowledge of carpentry that he possessed stood him in good stead.
[The sentence means-The knowledge of carpentry he possessed was not much; but even that little knowledge stood him in good stead.]
influence that he has, he uses to the best advantage.
knowledge of French that he has is likely to be very useful to him on the Continent.
102. Few, a few, the few
1. Few కొన్ని – ఏవో కొన్ని మాత్రం అనగా not many అని అర్ధం.
Few persons can keep a secret.
Few people are so hopeless as drunkards.
Few towns in India have public libraries.
Few works of reference are so valuable as the Encyclopaedia Britannica.
Few men are free from faults.
Few men reach the age of one hundred years.
Few Parsees write Gujarati correctly.
2. A few – ఇది positive అర్థాన్నిస్తుంది. అనగా ఎవరూ కాదు; ఏది కాదు అనే a negative భావాన్ని
DOAKOA.
A few words spoken in earnest will convince him.
A few Parsees write Gujarati correctly.
3. The few ఉన్నటువంటి కొద్ది మంది లేక కొన్ని వస్తువుల గురించి మాత్రం చెబుతుంది.
ఆయన చెప్పిన కొన్ని విషయాలైనా కూడా అవి నిర్మాణాత్మకంగా ఉన్నవి అనే అర్ధం వస్తుంది..
The few remarks that he made were very suggestive.
[The sentence means-The remarks that he made were not many; but all those remarks were very suggestive.]
The few friends he has are all very poor.
The few clothes they had were all tattered and torn.
అధ్యాయము 14
Articles
103. Aan the అను ఈ మూడు కూడా articles జాబితా కిందికి వచ్చును. వీనిని nouns ముందు వాడవలయును.
104. A, an అను ఈ రెండూ ఒక భాగము క్రిందికి వచ్చును. “The” అను article రెండవ భాగము క్రిందికి వచ్చును. కాని మూడు కూడా, ఒక వస్తువును గురించి గాని, ఒక భావమును గురించి గాని ఒక వ్యక్తిని గురించి గాని మాత్రమే చెప్పును. Articles కు బహు వచనము లేదు.
105. A మరియు An అను ఈ రెండు మాటలను indefinite articles అని అంటారు. అనగా ఇదమిద్ధమని ఒకే భావాన్నివ్వవు. ఇందరిలో గాని, ఇన్ని వస్తువులలో గాని, ఎవరో ఒకరు లేదా ఏదో ఒకటి అను అర్ధాన్ని మాత్రము ఇచ్చునవి అని అర్ధం.
A doctor; that is, any doctor.
106. The అను పదాన్ని Definite Article అంటారు. అనగా ఖచ్చితంగా ఫలానా అని చెప్పవలసిన చోట the అను పదాన్ని వాడతాము.
He saw the doctor; meaning some particular doctor.
He saw the doctor అని అన్నపుడు, “He” అను ఆ వ్యక్తి తనకు కావలసిన డాక్టరును చూచాడు లేక కలుసుకున్నాడు అని అర్ధం. He saw a doctor అన్నపుడు, హాస్పిటల్లో ఉన్న డాక్టర్లలో ఎవరో ఒక డాక్టరును చూచాడు అని అర్ధం మాత్రం వచ్చును. ఈ డాక్టరు పేరు, వివరాలు అతనికి ముందుగా తెలిసివుండవు.. లెక్కపెట్టుటకు వీలైన ఏకవచన nouns ముందు indefinite article ను ఉపయోగిస్తారు.
A book, an orange, a girl.
ఏకవచన, బహువచన రూపములలో నుండి లెక్కపెట్ట వీలయిన nouns ముందున్నూ, లెక్కపెట్ట వీలుగాని nouns ముందున్నూ, ‘The’ ని వాడుతారు.
The book, the books, the milk. ఇది general rule.
A OR AN
107. A, an. ఇవి a, e, io, u అను vowels లోని ఒక అక్షరముతో వాక్యము ప్రారంభమయినప్పుడు .”an” అను పదాన్ని వాడవలయును. ఇలా వాడడం వలన, పద ఉచ్ఛారణకు సౌకర్యముగా నుండును. పద ఉచ్ఛారణను బట్టి a లేక an ఉపయోగింపబడతాయి.
An ass, an enemy, an ink-stand, an orange, an umbrella, an hour, an honest man, an heir.
hour, honest, heir పదములలో h silent గా ఉంటుంది. అనగా h ని మనము ఉచ్చరించము. రెండవ అక్షరమయిన “౦” పైననే మనము ఉచ్ఛారణ భారాన్ని ఉంచుతాము. కావున “O” కు importance వచ్చినది. అందువలన “an” ను వాడవలయును.
108. Vowel ‘a’ and consonants. ఒక పదము, consonant sound తో ప్రారంభమయినపుడు Particle ‘a’ ను వాడెదము.
A boy, a reindeer, a woman, a yard, a horse, a hole,
also a university, a union, a European, a newe, a unicorn, a useful article.
పైన ఇవ్వబడిన union, university etc. పదములు ‘యూ’ (yu) అను హల్లు శబ్దముతో ఉచ్చరింపబడుచున్నవి. అందువలన, a అను article ను మాత్రమే ఉపయోగించాలి.
109. కొందరు native speakers ఉచ్ఛారణ భావము తక్కువగా ఉన్న తో మొదలయ్యే పదాల ముందు article ‘an’ ని ఉపయోగిస్తారు.
An hotel (More common: a hotel).
an historical novel (More common : a historical novel)
Use Of The Definite Article
110. Definite article అయిన “the” ఈ క్రింది విధములుగా ఉపయోగించబడును.
1. నిర్దిష్టముగా ఒక వ్యక్తిని గురించి గాని, ఖచ్చితంగా ఒక వస్తువును గురించిగాని మాట్లాడునపుడు “the” అను definite article ను ఉపయోగించాలి. మరియు ఒక వ్యక్తిని గురించిగాని, ఒక వస్తువును గురించిగాని, ఒక విషయమును గురించిగాని యింతకు ముందే చెప్పబడి ఉన్నపుడు కూడా “the” ని వాడతాము. “The” అనగా grammer లో ఫలాని అని అర్ధం వస్తుంది. ఈ అర్ధం ఖచ్చితంగా ఉంటుంది.
The book you want is out of print. (Which book ? The one you want.)
Let’s go to the park. (= the park in this town)
The girl cried, (the girl = the girl already talked about)
2. ఏకవచన నామవాచక పదము ఒక తరగతిని అనగా వర్గమును (class) గురించి చెప్పునపుడు The cow is a useful animal. (Or we may say, “Cows are useful animals.”]
The horse is a noble animal.
The cat loves comfort.
The rose is the sweetest of all flowers..
The banyan is a kind of fig tree.
(Do not say, “a kind of a fig tree”. This is a common error.]
సాధారణంగా man మరియు woman – అను పదముల ముందు “a” ని గాని “the” నిగాని వదిలివేయడం జరుగుతుంది.
Man is the only animal that uses fire.
Woman is man’s mate.
కాని modern English లో a man, a woman (or men and women) అని వాడుట వాడుకలో నున్నది.
A woman is more sensitive than a man.
3. ఒక ప్రదేశము యొక్క పేరు చెపుతూ, ఆ పేరు proper noun వర్గము క్రిందికి వచ్చునపుడు
(a) oceans and seas, e.g. the Pacific, the Black Seal
(b) rivers, e.g. the Ganga, the Nile
(c) canals, e.g. the Suez Canal
(d) deserts, e.g. the Sahara
(e) groups of islands, e.g. the West Indies
(f) mountain-ranges, e.g. (the Himalayas, the Alps
(g) a very few names of countries, which include words like republic and kingdom (e.g. the Irish Repub- lic, the United Kingdom) also: the Ukraine, the Netherlands (and its seat of government the Hague)
4. కొన్ని పుస్తకముల పేర్ల ముందు “the” ని వాడతాము.
The Vedas, the Puranas, the Iliad, the Ramayana..
కాని మరికొన్ని చోట్ల ఈ సిద్ధాంతము ఉపయోగపడదు.
Homer’s Iliad, Valmiki’s Ramayana.
5. ఒకే ఒక రూపము లేక స్థితిలో నున్నట్టివి (పంచ భూతములు లాంటివి)
The sun, the sky, the ocean, the sea, the earth.
గమనిక (Note) common noun ను abstract noun గా వాడినపుడు, “the” ని వాడుతాము.
At last the warrior (the warlike or martial spirit) in him was thoroughly aroused.
6. ఒక proper noun, ఒక adjective వలన గాని, adjective clause వలన గాని వర్ణింపబడినపుడు క్రింది వాక్యములో ‘caesar’ proper noun. దానిని adjective అయిన “great” అను పదము వర్ణించుచున్నది. కావున దాని ముందు “the” అను definite article ని వాడాము.
The great Caesar: the immortal Shakespeare.
The Mr. Roy whom you met last night is my uncle.
7. అతి ప్రాముఖ్యమును పొంది, అగ్రగణ్య స్థాయిలో నున్న వాని ముందు : –
The darkest cloud has a silver lining.
This is the best book of elementary chemistry.
8. ప్రత్యేకించి చెప్పబడు వాని (ordinals) ముందు “the” ని వాడతాము.
He was the first man to arrive,
The ninth chapter of the book is very interesting.
9. సంగీత వాద్యముల ముందు.
He can play the flute.
10. Noun యొక్క అర్ధాన్ని యిచ్చు adjectives ముందు. ఈ క్రింది వాక్యములో “poor” అను పదము adjective. కాని ఇచ్చట అది బీదవారు అనే అర్ధాన్ని ఇస్తుంది. బీదవాడు, బీదవారు అను పదాలు nouns. The poor are always with us.
11. అగ్రశ్రేణి (superlative) అర్ధాన్నిస్తూ ఉన్న మామూలు noun ముందు కూడా “the” ని వాడెదరు. The Verb is the word (= the chief word) in a sentence.
12. Comparative అర్ధాన్ని (పోల్చిచెప్పు అర్ధము) ఇస్తూ adverb లక్షణములు కలిగి ఉన్నపుడు, అట్టి పదము ముందు “the” ని వాడతాము.
The more the merrier.
(= by how much more, by so much the merrier)
The more they get, the more they want.
Use Of The Indefinite Article
111. ఈ క్రింది సందర్భములలో Indefinite Article ను ఒకటి అను సంఖ్యాభావముతో వాడాము.
1. Indefinite Article అనగా ఇదమిద్దమని చెప్పనట్టి Article.
Twelve inches make a foot. (ఇచ్చట ఫలానా అడుగుబద్ధ అని అర్ధం రాదు కదా !)
Not a word was said.
A word to the wise is sufficient.
A bird in the hand is worth two in the bush.
2. ఒకానొక అను అర్ధము వచ్చునట్లు దానిని వాడతాము.
A Kishore Kumar (= a certain person named Kishore Kumar) is suspected by the police.
One evening a beggar came to my door.
3. ఏదో ఒకటి అని టూకీగా చెప్పునపుడు : –
ఏదైనా కాని, ఎవరైనా కాని అని చెబుతూ ఆ భావము ఒక వర్గాన్ని గాని, ఒక తరగతిని గాని గుర్తు చేస్తూ చెప్పునపుడు indefinite articles అయిన ‘a’ ని గాని ‘an’ ని గాని ఉపయోగించెదము.
A pupil should obey his teacher. అనగా విద్యార్థిలోకమునకు చెందినవాడు అని కదా అర్ధం!
A cow is a useful animal.
Proper on common noun గా ఉపయోగించిన సందర్భములో కూడా, ఈ విధంగా
ఉపయోగించెదము.
A Daniel come to judgement ! (A Daniel = a very wise man)
Omission Of The Article
112. Article ను ఈ క్రింది సందర్భములలో మినహాయించడం జరుగుతుంది :
1. పదార్ధముల పేర్ల ముందు, abstract nouns ముందు (దృష్టికి అందనివి) articles ను వదలి
వేయడం జరుగుతుంది.
Sugar is bad for your teeth.
Wisdom is the gift of heaven.
Virtue is its own reward.
Gold is a preciou’s metal.
Honesty is the best policy.
గమనిక (Note) : Unaccountable nouns ను ప్రత్యేకముగా పేర్కోను సందర్భములో “the” ని వాడెదరు. అట్టి సందర్భములో అవి ఒక adjective వలనగాని, adjective phrase వలనగాని, adjective clause వలన గాని వర్ణింపబడి ఉండవలయును.
Would you pass me the sugar? (= the sugar on the table)
The wisdom of Solomon is great.
can’t forget the kindness with which he treated me.
2. లెక్కించ వీలయిన plural nouns ను సర్వ సాధారణ పరిస్థితులలో (general sense) ఉపయోగించి నపుడు – the ని వాడరు.
Children like chocolates.
Computers are used in many offices.
గమనిక (Note) : కాని పై సందర్భములో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో మాట్లాడినపుడు మాత్రమే
“the” ని వాడెదము.
Where are the children? (= our children) The children అన్నపుడు మన ఇంటి పిల్లలు అని గాని మన క్లాసు పిల్లలు అని గాని ఇచ్చట ప్రత్యేక అర్ధం వస్తుంది గావున “the” ని వాడాలి.
3. మనుష్యులు, దేశములు, పట్టణములు, పర్వతములు, సరస్సులు, కొండల పేర్ల ముందు articles ను వాడరు.
4. ఉదయకాలపు అల్పాహారము (breakfast), మధ్యాహ్న భోజనము (lunch), రాత్రి భోజనము (dinner) మొదలగు మాటల ముందు సాధారణముగా articles వాడము.
What time do you have lunch?
Dinner is ready.
గమనిక (Note) : భోజనమునకు ముందు adjective ఉంటే ‘a’ ని వాడాలి. దానిని ప్రత్యేకముగా పేర్కొంటే, ‘the’ ని వాడాలి.
I had a late lunch today.
The dinner we had at the Tourist Hotel was very nice.
5. భాషల ముందు, article ను ఉపయోగించరాదు.
We are studying English.
They speak Punjabi at home.
6. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ, చర్చి, పడక, హాస్పిటలు, జైలు అనుపదాల ముందు article ను వాడము.
I learnt French at school.
We go to church on Sundays.
He stays in bed till nine every morning.
My uncle is still in hospital.
గమనిక (Note: ఈ క్రింది ప్రదేశములను buildings ను, ఇతర objects ను ప్రత్యేకించి పేర్కొన్నపుడు “the” అను article ను వాడతాము.
The school is very near my home. The bed is broken.
I met him at the church.
I went to the hospital to see my uncle.
7. రక్త సంబంధీకులయిన father, mother, aunt, uncle అను పదముల ముందు article ను వాడము. మా cook మా nurse అను భావముతో cook, nurse పదములను వాడినపుడు కూడా article వాడము.
Father has returned.
Aunt wants you to see her.
Cook has given notice.
8. సంఘంలో ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక హోదా తెలియజేయు nouns ముందు కూడా articles || వాడరాదు. ఆ హోదా ఆ వ్యక్తికి జీవితాంతం ఉండేదిగా ఉండవలసిన పనిలేదు.
He was elected chairman of the Board.
Mr. Banerji became Principal of the College in 1995.
9. Transitve verb (ఎడమ నుండి కుడికి ప్రయాణము చేయునది) దాని వెనువెంటనే దానికి object ఉన్న పక్షములో article ను వాడడం జరుగుదు.
to catch fire, to take breath, to give battle, to cast anchor, to send word, to bring word, to give ear, to lay siege, to sei sail, to lose heart, to set foot, So leave home, to strike root, to take
offence.
10. Object తో కూడిన prepositional phrases ముందు article ను వాడరాదు.
at home, in hand, in debt, by day, by night, at daybreak, at sunrise, at noon, at sunset, at night, at anchor, at sight, on demand, at interest, on earth, by land, by water, by river, by train, by steamer, by name, on horseback, on foot, on deck, in jest, at dinner, at ease, under ground, above ground.
Repetition Of The Article
113. నేను ఈ క్రింది వాక్యమును చెప్పినపుడు
I have a black and white dog.
కొంత తెలుపు కొంత నలుపుగా నున్న కుక్క అని అర్ధం వస్తుంది.
కాని నేను ఈ క్రింది విధంగా చెప్పినపుడు
I have a black and a white dog,
నా దగ్గర ఒక తెల్ల కుక్క మరియు ఒక నల్ల కుక్క ఉన్నవి అని అర్ధం. అనగా రెండు సార్లు “a” అను article వచ్చిన ఎడల రెండు కుక్కలు అనే బహు వచన భావము వచ్చును. 03
రెండు గాని అంతకంటె ఎక్కువగాని adjectives ఒక noun ను వర్ణించినపుడు, article ను మొదటి adjective కు ముందున వాడతాము. కాని ఈ adjective పదములు different nouns ను వర్ణించినపుడు ప్రత్యేకంగా చెరియొక article ను చెరియొక adjective ముందు ఉంచవలయును.
Ex. A black and a white (dog).
114. పోల్చి చూడండి –
1. The Secretary and Treasurer is absent.
2. The Secretary and the Treasurer are absent.
మొదటి వాక్యములో Secretary ఉద్యోగమును, Treasurer ఉద్యోగమును ఒకే వ్యక్తి చేపట్టియున్నాడు అనే అర్థం వచ్చును. రెండవ వాక్యములో రెండు articles ను వాడినాము గావున, రెండు ఉద్యోగాలను చేరియొకరు చేపట్టి యున్నారు అనే అర్థం వచ్చుచున్నది. రెండు గాని అంతకు మించిగాని నామవాచకములను ఒకే వ్యక్తి గురించి వాడిన సందర్భములో లేక ఒకే వస్తువును గురించి వాడినపుడు గాని, article మొదటి noun ముందు మాత్రమే వాడెదము రెండు లేక అంతకంటే ఎక్కువ nouns ను వాడి అవి అదే విధంగా different persons ను గాని different things ను గాని సంబోధించినపుడు, ప్రతి noun కు ఒక్కో article ను వాడాలి. Article ను ఈ సందర్భములో వాడినపుడల్లా, సంఖ్య (plural sense) పెరుగుతుంది.
ఈ క్రింది వాక్యములను పరిశీలించండి :-
Sir Surendranath was a great orator and statesman. (ఒకే వ్యక్తి)
There are on the committee among others a great economist and a great lawyer. (ag వ్యక్తులు)
115. మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చును.
The third and the fourth chapter.
[Or] The third and fourth chapters.
116. ఒక పోలిక చేసి చూపెట్టునపుడు, రెండు nouns ఒకే వ్యక్తిని గాని, ఒక వస్తువును గాని పరిగణలోనికి తీసుకున్నపుడు మొదటి noun కు ముందు భాగంలోనే article ను వాడెదము.
He is a better mechanic than clerk.
He is a better poet than novelist.
He is a belter thinker than debater.
He would make a better engineer than lawyer.
కాని ఆ పోలిక different pronouns కు గాని, different things కు గాని వర్తింప జేయవలసి వచ్చినపుడు article ను తప్పనిసరిగా ప్రతి noun కు ప్రత్యేకముగా వాడవలయును.
He is a better mechanic than a clerk (would make).
He would make a better statesman than a philosopher (would make).
అధ్యాయము 15
Personal Pronouns
117. మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు :-
Hari is absent, because Hari is ill.
పై వాక్యములో Hari అనే పదాన్ని repeat చేశాము. అలా కాకుండా Hari అనే noun ను మరల చెప్పకుండా ఈ క్రింది విధంగా రాయడం ఉత్తమం.
Hari is absent, because he is ill.
పై వాక్యములో మాదిరిగా, Hari అనే పదానికి బదులుగా he అనే పదాన్ని (అతను లేక వాడు) వాడినపుడు దానిని Pronoun అంటాము. Pro-noun అనగా noun కు బదులుగా అనగా సహాయకారిగా వాడిన పదము అని అర్ధం.
118. ఈ క్రింది వాక్యములను చదవండి –
I am young.
You are young.
He (she, if) is young.
We are young.
They are young.
I we you, he she, it), they అను పదములను Personal Pronouns అంటాము. ఎందుకనగా వాడు, వారు, ఆమె, అను వ్యక్తిగతమైన పదములకు సంకేతములు.
అవి నేను, మేము, నీవు, మీరు
(a) the person speaking.
(b) the person spoken to, and
(c) the person spoken of.
I we అను పదములు మాట్లాడే వ్యక్తిని, లేక మాట్లాడే వ్యక్తులను గురించి గాని చెప్పును గావున, వానిని first person pronouns అని అంటాము. మాట ఎవరి నుండి ముందుగా వస్తుందో, అట్టి వ్యక్తి first person అగును. “you” అనగా, ఎవరితో మనము ఎదుట ఉండి మాట్లాడుదమో అట్టి వారిని గురించి చెప్పును గావున, యిట్టి పదమును second person అంటాము. “You” అను పదాన్ని singular గాను, plural గాను వాడెదము. తెలుగులో you అనగా నీవు, మీరు అని అర్ధం.
He, she, it, they అను పదములను third person pronouns అని అంటాము. ఎందుకంటే అవి లేక వారు మనకు దూరమున ఉన్నట్టి వస్తువులు లేక వ్యక్తులు గావున “It” అను పదమును demonstrative pronoun అని కూడా అంటాము. Demonstration అనగా ప్రదర్శన ద్వారా తెలియజేయుట లేక వేలెత్తి చూపించి చెప్పుట అని అర్ధం. ‘lt’ అని అన్నపుడు వేలెత్తిచూపి చెప్పవలయును గదా!
Forms Of The Personal Pronous
119. Personal Pronouns వివిధ రకములు. shouls of
FIRST PERSON (Masculine of Feminine)
Singular | Plural | |
Nominative | I | we |
Possessive | my, mine | our, ours |
Accusative | me (నన్ను) | us (మమ్ములను లేక మాకు) |
Possessive లో తనకున్న ఆస్తి హక్కు అనే భావం వస్తుంది.
Accusative లో వ్యక్తి కర్మను అనుభవించే స్థితిలో ఉండును.
SECOND PERSON (Masculine or Feminine)
SINGULAR/PLURAL
Nominative | you(నీవు) |
Possessive | your, yours |
Accusative | you(నిన్ను) |
THIRD PERSON
Singular | Plural | |||
Masculine | Feminine | Neuter | All Genders | |
Nominative | he | she | it(అది) | they |
Possessive | his | her, hers | its | their,theirs |
Accusative | him | her | it(దానిని) | them |
“I” అనగా అది అనిగాని, దానిని అనిగాని రెండు అర్ధములు వచ్చును.
గమనిక (Note) 1 Personal Pronouns యొక్క Possessive భావాన్ని (ఈ ఆస్థి నాది అని చెప్పు.. భావము) Possessive adjectives అని కూడా అంటారు. ఎందుకంటే ఆ పదములకు adjective లక్షణములు (వర్ణన చేయు లక్షణములు) వచ్చినవి గావున
This is my book.
Those are your books.
That is her book.
ఈ Possessive adjectives నే Pronominal Adjectives అని కూడా అంటారు. ఎందుకంటే అవి Pronouns ఆధారముగా పుట్టిన పదములు కావున
గమనిక (Note: 2 His అను పదమును Adjective గాను Pronoun గాను కూడా వాడవచ్చును.
This is his book.
This book is his.
Possessive Adjective) ఇది వాని యొక్క పుస్తకము
Possessive Pronoun) ఈ పుస్తకము వానిది.
ఈ క్రింది వాక్యములలో italics లో నున్న పదములు Possessive Pronouns
This book is mine.
Those books are yours.
That book is hers.
That idea of yours is excellent.
120. Third Person pronoun కు మూడు Genders ఉన్నవి :
(లింగ భేదములు)
Masculine
Feminine
Neuter
he
she it
121. It – Pronoun అయిన “it” ను ఈ క్రింది విధంగా ఉపయోగిస్తాము.
1. ప్రాణం లేని వస్తువుల విషయంలో ఈ విధంగా :-
Here is your book; take it away.
2. జంతువుల విషయంలో, అవి మగవా ఆడవా అని ఖచ్చితంగా చెప్పవలసి వచ్చినపుడు తప్ప :-
He loves his dog and cannot do without it.
The horse fell and broke its leg.
3. పాపల విషయంలో అది మగ పాపనా లేక ఆడ పాపనా అని చెప్పవలసి వచ్చినపుడు తప్ప general
గా ఈ విధంగా రాస్తాము :-
When I saw the child it was crying.
That baby has torn its clothes.
4. ఒక వివరణ ఇచ్చు statement ముందున ఉన్నపుడు :-
He is telling what is not true; as he knows it.
He deserved his punishment; as he knew it.
5. “to be” అను ధాతువునకు ముందు “It” temporary subject గా ఉండవచ్చును. కాని original గా subject అయినట్టి word గాని భావముగాని “to be” కి వెనక ఉంటుంది.
It is easy to find fault. (To find fault is easy.]
It is doubtful whether he will come.
It is certain that you are wrong.
6. It అను Pronoun తరువాత వచ్చే Pronoun కు గాని Noun కు గాని ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. It ను వాడినందున నొక్కివక్కాణించినట్లు అర్ధం వస్తుంది. ఇచ్చట మొదటి వాక్యములో “f” అను pronoun “you” అను pronoun కు ఎంతో బలాన్ని ఇచ్చింది.
It was you who began the quarrel.
It was I who first protested.
It was at Versailles that the treaty was made.
It is a silly fish that is caught twice with the same bait.
It is an ill wind that blows nobody good.
7. Impersonal verb 350 50
It rains.
It snows.”
indefinite nominative m
It thunders.
ఇచ్చట “it” ఫలానా అని గుర్తింపు చేసి చెప్పనటు వంటి pronoun. అది వాన కావచ్చు. మేఘం కావచ్చు, వాతావరణం కావచ్చు. ఇచ్చట “it” ని impersonal pronoun అంటాము. అంటే ఫలానా అని గుర్తింపు లేని pronoun. ఇటు వంటి సందర్భాలలో “it” ని వాడతాము. (It is bad – It is good etc.) అలానే ‘rains
పదము కూడా గుర్తింపులేని verb.
8. వాతావరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు మరియు time ని గురించి మాట్లాడునపుడు lt ని వాడతాము.
It is fine.
It is winter.
It is ten o’clock.
122. Noun కు బదులు Personal Pronoun (he, she, they etc.) ను వాడినపుడు, అవి noun
వలెనే number, gender మరియు person లో ( 1st person, 2nd person, 3rd person రూపాలలో) కలయిక కలిగి ఉండాలి. ఈ విధంగా –
Rama is a kind boy. He has lent his bicycle to Govind.
Sita helps her mother in household work. She also does her lesson.
Those beggars are idle. They refuse to work tor their living.
123. Collective Noun కు బదులుగా Pronoun పదాన్ని వాడినపుడు, అట్టి Pronoun ఏకవచనముగా ఉంటుంది. Collective Noun ను అపుడు ఒకటిగానే భావించాలి.
The army had to suffer terrible privations in its march.
The fleet will reach its destination in a week.
The crew mutinied and murdered its officers.
After a few minutes the jury gave its verdict.
ఆ collection వివిధ వ్యక్తుల లేక వివిధ categories యొక్క సమ్మేళనముగా ఉండి, ప్రతి వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వవలసి వచ్చినపుడు, pronoun కూడా plural number లో ఉండవలయును.
The jury were divided in their opinions.
The committee decided the matter without leaving their seats.
124. రెండు అంతకంటే ఎక్కువ Singular Nouns కు “and” అను conjunction తో కలిసినపుడు,
pronoun బహువచనము ఉండవలయును.
Rama and Hari work hard. They are praised by their teacher.
Both Sita and Savitri are tired; they have gone home.
కాని and తో జతచేయబడిన singular nouns ఒకే వ్యక్తికి సంబంధింపబడి యున్నపుడు, pronoun ఈ క్రింది విధముగా singular రూపంలో ఉంటుంది.
The Secretary and Treasurer is negligent of his duty.
125. రెండు Singular Nouns (ఏకవచన నామవాచక పదములు) and అను conjunction తో కలుపబడి, అట్టి కలయిక ముందు each గాని every గాని ఉన్నపుడు Pronoun (సర్వనామము) ఏకవచనములో ఉంటుంది.
Every soldier and every sailor was in his place.
126. రెండుగాని అంతకంటే ఎక్కువ Singular Nouns or, either … or లేక neither … nor అను
ఏ ఒక పదములతోనైనా కలుపబడినపుడు, Pronoun ఏకవచనముగా ఉంటుంది.
Rama or Hari must lend his hand.
Either Sita or Amina forgot to take her parasol. Neither Abdul nor Karim has done his lesson.
127. ఒక బహు వచన నామవాచకము (Plural Noun) మరియొక ఏకవచన నామవాచకము (Singular Nouns “or” చేత గాని “nor” చేత గాని కలుపబడినపుడు, సర్వనామము (pronoun) బహువచనముగా
ఉంటుంది.
Either the manager or his assistants failed in their duty.
128. ఒక noun గాని, pronoun గాని different pronouns లోఉంటే second person కు బదులుగా first person, third person కు బదులుగా second person ను వాడతాము. ఈ క్రింద చూపిన విధంగా, you అను పదము second person. “” అను పదము first person. కాని second person కు బదులుగా first person plural అయిన “ our ” అనే పదాన్ని వాడాము.
You and I have done our duty.
You and Hari have idled away your time.
పై examples లో You and 1 Our, You and Hari – Your
129. మంచి నడవడిక (Good manners) ను దృష్టిలో పెట్టుకుంటే, sentences ఈ క్రింది విధంగా ఉండాలి. మనం యింకొకరితో మాట్లాడినపుడు, అవతలి వ్యక్తిని ముందుగా సంబోధించి మనలను మనము తరువాత చెప్పుకోవాలి. మూడవ వ్యక్తిని గురించి మాడ్లాడునపుడు కూడా మనలను గురించి మనము తరువాత సంబోధించుకోవాలి. మీరు, నేను అనాలి. నేను, మీరు అనరాదు. అలానే అతను నేను అనాలి.
“You and I’ not’l and you’.
“You and he’ not ‘he and you’,
“Hari and !’ not ‘I and Hari’.
‘He and I’ not ‘l and he”.
You and I must work together.
hopatoo
You and he must mend your ways. Hari and are old school friends. He and I can never pull on together.
130. I, he, she, we, they అను పదములను accusative case పదాలుగా (కర్మలుగా లేక objects గా) వాడినపుడు (me, him, her, us, them లుగా) అది correct అవుతుంది. me కి బదులుగా 1ని, himకు బదులుగా he ని, her కు బదులుగా she ని, US కు బదులుగా we ని, them కు బదులుగా they ని వాడరాదు. అచ్చట accusative case లో నున్న రెండు pronouns and చేతగాని or చేతగాని కలుపబడియున్నప్పుడు).
Correct గా రాయబడిన ఈ క్రింది వాక్యాలను చూడండి.
The presents are for you and me (Not, )
My uncle asked my brother and me to dinner. (Not, we)
131. ఈ క్రింది వాక్యములో but అను పదము preposition అవుతుంది.
Nobody will help you but me. (not: /)
అభ్యాసము 25
ఈ క్రింద ఇవ్వబడిన వాక్యములలోని pronoun ను పేర్కొని, అవి దేనిని సూచించుతున్నాయో రాయుము.
1. Alice was not a bit hurt, and she jumped up on to her feet in a moment.
2. There were doors all round the hall, but they were all locked.
3. Alice opened the door and found thai it led into a small passage.
4. “I wish I hadn’t cried so much,” said Alice.
5. “You are not attending”, said the Mouse to Alice severely. “What are you thinking of ?”
6. “Come back!” the Caterpillar called after her. Alice turned and came back again.
7. Hari brought his book and laid it on the table.
8. Karim has lost his dog and cannot find it.
9. Suresh is at the head of his class, for he studies hard.
10. Rama, you are a lazy boy.
11. The camel is a beast of burden. It is used to carry goods across the desert.
12. The female lion is called a lioness. She has no mane.
13. The horse fell down and broke its leg.
14. Birds build their nests in irees.
15. If the thief is caught, he will be punished.
16. Train up a child in the way he should go.
17. And Nathan said to David, Thou art the man.
అభ్యాసము 26
ఈ క్రింద ఇవ్వబడిన వాక్యములలోని nouns బదులుగా Pronouns రాయుము.
Rama had taken his watch out of his pocket, and was looking at the watch uneasily, shaking the
1. watch every now and then, and holding the watch to his ear.
2 The boys went into the garden, where the boys saw a snake.
3. Very soon the Rabbit noticed Alice as Alice went hunting about, and called out to Alice in an angry tone.
సరియైన Pronouns పేర్కొనుము.
అభ్యాసము 27
1. We scored as many goals as, (They, them)
2. Rama and were present. (1, me)
3. Can you sing as wei! as ? (They, them)
4. Let you and Iry what we can do. (1. me)
5. Wait for Hari and (1. me) OMORS OITAHOME
6. You know that as well as (1, me) Bobby
7. It was that gave you the alarm. (1, me)
8. Between you and I do not believe him. (1, me))
9. We are not so poor as (They, them)
10. Rama is as old as (1. me)
11. He is known to my brother and (1. me)
12. He is as good as (1, am)
13. Nobody but was present. (He, him)
14. He and were great friends. (1, me)
15. Whom can I trust, if not? (He, him)
16. Let who can answer this question. (He, him)
17.There isn’t much difference between you and None so blind as
18. that will not see. (They, them) to dictate to us. (They, them)
19. It isn’t for such as. (He, him)
అధ్యాయము 16
Reflexive And Emphatic Pronouns
132. self అను పదమును
(1) my, your, him, her, itek,
(2) selves అను పదమునకు our, your them అను పదములకు కలిపినపుడు మనకు వచ్చు ఆ సంయుక్త పదములను Compound Personal Pronouns అని అంటాము. వీనిలో నున్న భావము వెనుకకు మరలి subject ను ప్రభావితం చేసినపుడు అట్టి వానిని Reflexive pronouns అని అంటాము. అనగా verb లోని driving action అలానే ముందుకు పోకుండా వెనుకకు తిరిగి subject పైన పడుతుంది. (అర్ధములో మనముఖము మనకు కనిపించినట్లు)
I hurt myself.
You will hurt yourself.
He hurt himself.
She hurt herself.
The horse hurt itself.
We hurt ourselves.
You will hurt yourselves.
They hurt themselves.
I hurt myself అనగా నాకు ఒక చిన్న గాయం అయ్యింది అని అర్ధం. అనగా నా పొరపాటు నాకే తగిలింది అని భావం. ఇచట అతని పొరపాటు అతనికే తగిలింది. This is reflexive action.
ఇచ్చట గమనించదగిన విషయం : Reflexive Pronouns లోని భావము verb కు Object (కర్మ) గా మారి, Subject లో నున్న అదే వ్యక్తిని గురించి గాని, వస్తువు (thing) ను గురించి గాని పేర్కొంటుంది.
133. కొన్ని సార్లు పాతకాలం నాటి English లో simple pronoun ని Reflexive Pronoun (ప్రతి
బింబించు Pronoun) గా వాడారు.
Now I lay me down to sleep.
134. “Self” అనే పదము కొన్నిసార్లు Noun (నామవాచకము) గా వాడబడుతుంది.
To thine own self be true.
He cares for nothing but self.
He thinks much of self.
Emphatic Pronouns
135. ఈ క్రింది వాక్యములను చదవండి :- (నొక్కి వక్కాణించు భావములను చూడండి)
I will do it myself.
I myself saw him do it.
We will see to it ourselves.
You yourself can best explain.
He himself said so.
She herself says so.
It was told so by the teacher himself.
We saw the Prime Minister himself.
The town itself is not very large.
They themselves admitted their guilt.
నొక్కివక్కాణించుటకు పై వాక్యములలో Compound Personal Pronouns ను వాడారు. వానిని Emphatic Pronouns అని కూడా అంటారు.
అధ్యాయము 17
Demonstrative, Indefinite And Distributive Pronouns
136. ఈ క్రింది వాక్యములను గమనించండి :-
This is a present from my uncle.
These are merely excuses, ТИРЕОИ Both cars are good; but this is better than that.
Mumbai mangoes are better than those of Bangalore.
Make haste, that’s a good boy. (Here that = one who makes haste.]
There is no period in ancient Indian history so glorious as that of the Guptas.
(Do not write,”as the Guptas” – అవతలివారి గొప్పతనాన్ని గుప్తుల గొప్పతనంతోనే పోల్చాలి…
My views are quite in accordance with those of the University Commission.
I may have offended, but such was not my intention.
He was the representative of the King, and as such (= the representative of the King) they honoured him. The stranger is welcomed as such.
That is the Red Fort.
ఇచ్చట italics లో నున్న Pronouns అవి ప్రభావితం చేయుచున్న objects ను (కర్మ పదములను) చూపించుచున్నవి. కావున వీనిని Demonstrative Pronouns అంటారు. (వేలెత్తి చూపునవి)
137. This, that, etc. ఈ పదములను nouns తో ఉపయోగించినపుడు అవి (Demonstrative) Adjectives గా మారును.
This book is mine.
That pen is yours.
These books are mine.
Those pens are yours.
What was that noise ?
This horse is better than that horse.
All such people ought to be avoided.
138. This అను పదాన్ని మనం దగ్గరలోనే ఉన్న వస్తువును గురించి వాడతాము. మనిషి యొక్క అలోచనకు సమీపములో నున్న భావానికి గూడా This అను పదాన్ని వాడతాము. That అను పదాన్ని అక్కడ అనగా అల్లంత దూరములో నున్న పదానికి మరియు చాలా దూరములో నున్న పదానికి, ఇంకను కనిపించని దూరములో నున్న వస్తువునకు, భావానికి కూడా వాడతాము.
This is better than that.
139. That అను పదమునకు plural (బహువచనము) those. ఈ that, those అను రెండు పదములను ముందు భాగంలో నున్న nouns మరల repeat చేయకుండా ఉండడానికి వాడతాము.
The climate of Belgaum is like that of Pune.
The streets of this city are worse than those of Ahmedabad. Our soldiers were better drilled than those of enemies.
The rivers of America are larger than those of Europe.
140. రెండు పదములు వరుస క్రమములో నున్నపుడు, వాని తరువాత that ను వాడినపుడు ఆ that అను pronoun వరుస క్రమములోనున్న రెండింటిలో మొదటి పదమును, this అను pronoun, రెండవ
మాటను వ్యాఖ్యానించును.
Virtue and vice offer themselves for your choice; this (i.e., vice) leads to misery, that (i.e., virtue) to happiness.
Alcohol and tobacco are both injurious; this perhaps, less than that.
Indefinite Pronouns
141. ఈ క్రింది వాక్యములను గమనించండి.
One hardly knows what to do.
One does not like to say so. but it is only too true.
One cannot be too careful of one’s (not, his) good name.
One must not boast of one’s own success.
One must use one’s best efforts if one wishes to succeed.
One must not praise one’s self.
None of his poems are well known.
None but fools have ever believed it,
[None is a shortened form of not one, yet it is commonly used with plural verbs].
They (= people in general) say he has lost heavily.
They say that one of the local banks has stopped payment. [They say it is said by some persons.]
All were drowned.
Some are born great.
Some say he is a sharper.
Somebody has stolen my watch.
Nobody was there to rescue the child.
Few escaped unhurt.
Many of them were Gurkhas.
We did not see any of them again.
One or other of us will be there.
Do good to others.
Did you ask anybody to come?
What is everybody’s business is nobody’s business.
His words are in everyone’s mouth.
ఈ పైన ఉదహరించిన pronouns (సర్వనామములు) అన్నీకూడా సర్వసాధారణ పరిస్థితిలో వ్యక్తులను గురించిగాని, వస్తువులను గురించిగాని మాట్లాడుచున్నవి. కాని అదే వ్యక్తుల గురించిగాని, అదే వస్తువులు గురించి ప్రత్యేకంగా పేర్కొనవు. కావున వీనిని అవ్యక్తముగానున్న సర్వనామములు (Indefinite Pronouns) అని అంటారు.
142. ఈ క్రింది పదములు కూడా Adjective అర్థాన్ని యిస్తవి :
I will take you there one day.
Any fool can do that.
He is a man of few words.
Some milk was spilt.
143. Anybody, everybody, everyone, anyone, each మొదలగు పదములను refer చేయునపుడు (సూచించునపుడు) pronouns అయినట్టి he or she అను పదములను సందర్భమును బట్టి వాడతారు. ఈ
విధంగా I shall be glad to help everyone of my boys in his studies.
ఇటువంటి సందర్భంలో plural pronoun ను వాడటం సాధారణమే (they / them / their)
Anybody can do it if they try.
Each of them had their share.
Distributive Pronous
144. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి :
Each of the boys gets a prize.
Each took it in turn.
Either of these roads leads to the railway station.
Either of you can go.
Neither of the accusations is true.
Each either, neither అను పదములను Distributive Pronouns అని అంటాము. ఎందుకంటే అవి ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని గాని, ఒక్కో వస్తువును గాని మాత్రమే పరిగణిస్తవి. అందువలన వానిని పంపిణీ Pronouns (Distributive Pronouns) అని అంటాము. ఇందువలన అవి ఎల్లవేళలా singular pronouns గానే ఉంటాయి. అట్టి వానిని singular verbs అనుసరించును.
గమనిక (Note) : Each అనగా ఒక గుంపులో ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును గాని, ఒక్కొక్కరిని గాని తీసుకున్నట్లు అర్ధం.
Either అనగా ఈ వస్తువునుగాని, ఆ వస్తువును గాని, ఈ వ్యక్తిని గాని, ఆ వ్యక్తిని గాని గమనించినట్లు అర్ధం.
Neither అను పదము either అను పదమునకు opposite. ఈ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి కాదు, ఈ వస్తువు కాదు, ఆ వస్తువు కాదు అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి.
ఈ విధంగా either మరియు neither అను పదములను ఇద్దరు మనుష్యుల గురించి గాని, రెండు వస్తువుల గురించి గాని మాట్లాడునపుడే వాడెదము.
ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల గురించి గాని, రెండు కంటే ఎక్కువ వస్తువుల గురించి గాని మాట్లాడునపుడు any, no one, none అను పదములను వాడవలసి ఉంటుంది.
145. Each అను పదమును ప్రయోగించుటలో 3 మార్గాలు ఉన్నవి. చూడండి.
1. Each of the men received a reward.
Each of these horses cost five thousand rupees.
I bought each of these mangoes for three rupees.
2. These men received each a reward.
These horses cost each five thousand rupees.
3. These horses cost five thousand rupees each.
I bought these mangoes for three rupees each.
Each అను పదము సంఖ్యను గురించి పలికినపుడు పై మూడు examples లో మూడవ దానికి వర్తిస్తుంది.
The men received a reward each తప్పు.
The men received five hundred rupees each రైటు.
146. ఈ క్రింది వాక్యములలో each, either and neither అను పదములు adjectives గా వాడబడినవి. వీని వెనువెంటనే single nouns ఉంటాయి.
Each boy took his turn. Neither accusation is true. At either end was a marble statue. (Here either = each or both.)
147. ఈ క్రింది వాక్యములను చదవండి :-
1. The two men hate each other.
2. They cheated one another. లించినపుడు, పై వాక్యములు పరిశీలించినపుడు, ఈ విధంగా ఉంటుంది:
1. The two men hate, each hates the other.
2. They cheated, one cheated another.
Each 58 one as subjects. objects other 30 girt or help ed ade another. 5 each other
మరియు one another వాడుకలో అవి compound pronouns గా మారినవి.
preposition చేత విడదీయబడతాయి. Compound pronouns ను Reciprocal pronouns అని అంటారు. ఈ విధంగా ఇవి చాలా అరుదుగా
The brothers quarrelled with each other.
They all gave evidence against one another. (ఒకరితో ఇంకొకరు అనే compound భావం వచ్చింది.
గమనిక (Note) : Each other అను పదమును ఇద్దరు వ్యక్తుల గురించి గాని, రెండు వస్తువుల గురించి గాని మాట్లాడునపుడు ఉపయోగించెదము. One another ఇప్పుడు అంతగా వాడుకలో లేదు.
అధ్యాయము 18
Relative Pronouns
148. ఈ క్రింది జంట వాక్యములను చదవండి :
1. I met Hari. Hari had just returned.
2. I have found the pen. I lost the pen.
3. Here is the book. You lent me the book.
ఈ పై వాక్యములను ఇచ్చట కలుపు చున్నాము.
1. I met Hari who had just returned.
2. I have found the pen which I lost.
3. Here is the book that you lent me.
ఇప్పుడు who, which and that అను మూడు పదములు ఒక్కొక్కటి ఏమి చేయుచున్నవో చూడండి. who అను పదము Hari అను noun యొక్క పాత్ర ధరించి pronoun గా మారింది.
who అను పదము రెండు statements ను కలిపి conjunction గా మారింది.
who అను పదము రెండు పాత్రలు ధరించి pronoun గా మరియు conjunction గా మారింది. అయినప్పటికి పై వాక్యములలో who అను పదము ప్రధానముగా Relative pronoun. ఎందుకంటే అది మనలను వెనుకకు తీసుకెళ్ళి subject తో కలుపుతుంది. Who అను పదమునకు, subject కు ఉన్న చుట్టరికాన్ని గురించి చెబుతూంది. ఇందువలన ఈ వాక్యములలో who అను పదాన్ని conjunctive pronoun అని కూడా అంటాము. రెండవ మూడవ వాక్యములలో నున్న which, that అను పదములు కూడా relative pronouns.
What is the Antecedent of which in the second sentence? What is the Antecedent of that in the third sentence?
Relative Pronouns – రూపాలు
149. Relative Pronoun అయిన who అను పదము Accusative case (object గా మారినపుడు) గాని లేక genitive గా మారినపుడు గాని రూపములు మారును
Singular and Plural
: who : whose
Nominative
Genitive
Accusative
: whom/who
తనకు తానుగానున్నపుడు who అని అంటాము.
తన ఆస్తి హక్కును తెలియజేయుటకు whose అంటాము. object భావాన్ని యివ్వవలసి వచ్చినపుడు whom/who అని
అంటాము.
who అను పదాన్ని వాడుక భాషలో object గా గూడా వాడుచున్నారు.
పై వాక్యములలో singular form కు మరియు plural form కున్నూ, masculine కు, feminine కూ Relative pronoun ఒకే రూపంలో ఉంటుంది.
This is the boy (or girl) who works hard.
This is the boy (or girl) whose exercise is done well.
This is the boy (or girl) whom / who all praise.
These are the boys (or girls) who work hard.
These are the boys (or girls) whose exercises are done well.
These are the boys (or girls) whom / who all praise.
ఇచ్చట గమనించ వలసిన విషయం. Relative pronoun “who” యొక్క forms (రూపములు) singular కు plural కు మరియు masculine కు feminine కు(పుంలింగ స్త్రీలింగములకు) ఒకే విధంగా అనగా ‘who’ గానే ఉండును.
150. Nominative కున్నూ, Accusative కున్నూ ఒకే విధమైన relative pronoun (which) సరిపోవడాన్ని ఈ క్రింద చూపబడినది.
This is the house which belongs to my uncle.
The house which my uncle built cost him Rs. 3,50,000.
Which అను relative pronoun కు Genetive case (possessive) లేదు. కావున అవసరాన్ని బట్టి
whose అనే పదాన్ని వాడెదము. ఇచ్చట ‘of which’ అనే భావం స్ఫురిస్తుంది.
A triangle whose three sides are equal is called an equilateral triangle.
151. Relative pronoun అయిన “that” అను పదమునకు singular number మరియు plural మరియు nominative, accusative number రూపములలోను, ఒకే format (రూపము) ఉంటుంది. లోనూ ఒకే విధంగా అనగా “that” గానే ఉంటుంది. దానికి genitive case ప్రత్యేకంగా లేదు. Grammar
text లో “cases” అనే అధ్యాయం చదవండి.
He that is content is rich.
They that touch pitch will be defiled.
Take anything that you like.
152. Relative pronoun అయిన “what” ను singular గానే వాడతాము. మరియు nominative and accusative లలో కూడా ఒకే విధంగా ఉండడం జరుగుతుంది.
What has happened is not clear.
I say what I mean.
He failed in what he attempted.
Use Of The Relative Pronouns
153. General rule ఏమంటే, ‘who’ అను పదాన్ని మనుష్యుల కొరకే వాడతాము. Singular మరియు plural లలో కూడా ‘who’ ను అదే విధంగా వాడతాము.
The man who is honest is trusted. Blessed is he who has found his work. He prayeth best who loveth best.
Who replaces whom in informal English. He who hesitates is lost.
They never fail who die in a great cause.
They are staves who dare not be.
In the right with two or three,
కొన్ని సందర్భాలలో ‘who’ అను pronoun ను జంతువులకు కూడా వాడతాము. (పులి, సింహము మొదలగు వానికి)
‘Whose’ అను possessive pronoun (ఆస్తి హక్కు తెలియజేయు pronoun). మనుష్యులకు, జంతువులకు, వస్తువులకు ఒకే విధంగా వాడెదము.
The sun, whose rays give life to the earth, is regarded by some people as a god.
This is the question whose solution has baffled philosophers of all ages.
[More properly, This is the question the solution of which has baffled philosophers of all ages’.]
154. Which అను పదమును ప్రాణము లేని వస్తువులకు, జంతువులకు ఉపయోగిస్తాము. ఈ
సందర్భములో అది singular మరియు plural nouns గా కూడా ఉపయోగపడుతుంది.
The moment which is lost is lost for ever.
The books which help you most are those which make you think most.
The horse which I recently bought is an Arab.
Which ఇంతకు పూర్వము మనుష్యులను సూచించుటకు వాడేవారు.
Our Father, which art in heaven.
వాక్యములను గురించి మాట్లాడునపుడు కూడా Which అను పదములను వాడతాము.
The man was said to be drunk, which was not the case.
He said he saw me there, which was a lie.
He is here, which is fortunate.
గమనిక (Note) : Relative pronouns అయిన who మరియు which అను ఈ రెండు పదములను ఈ క్రింది విధముగా కూడా వాడతాము:
(a) who అను పదమునకు గాని, which అను పదమునకు గాని వెనక ఉన్న clause లోని భావాన్ని తగ్గించిగాని, విపులీకరించిగాని, రెండవ clause లో చెప్పవలసివచ్చినపుడు.
The man who had cheated me was yesterday arrested by the police.
The book which you see on the table cost me ninety rupees.
(a) Non- defining clauses ను (వివరించి చెప్పని clauses) వాడినపుడు వానిని main clause
నుండి comma ( ) తో separate చేస్తాము.
The teacher sent for the boy, who (= and he) came at once.
I gave him a rupee, which (= and it) was ail I had with me.
గమనిక (Note: Main clause నుండి, సరిగా వివరించని clauses ను (non-defining clauses) comma separate చేస్తారు.
My brother who is a doctor has gone to America.
My brother, who is a doctor, has gone to America.
మొదటి వాక్యములో speaker కు చాలా మంది సోదరులు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో “who is a doctor” అను clause, ఆ brothers లో ఒక్కరు డాక్టరు అను అర్ధాన్ని ఇచ్చుచున్నది.
కాని రెండవ వాక్యములో, speaker కు ఒకేఒక సోదరుడు ఉన్నట్లు అర్ధం వచ్చుచున్నది.
155. “That” అను pronoun ను వ్యక్తులను గురించి గాని, వస్తువులను గురించిగాని మాట్లాడునపుడు వాడెదము. (rule 151 చూడండి). “That” కు genitive case లేదు. దానికి ముందు preposition ను ఉంచి దానిని వాడరాదు.
This is the boy that I told you of.
I know the house that he lives in.
Uneasy lies the head that wears a crown.
I have lost the watch that you gave me.
Thrice is he armed that hath his quarrel just.
A city that is set on a hill cannot be hid. He that is not with me is against me. Happy is the man that findeth wisdom.
He that is slow to anger is better than the mighty. The crowd that gathered cheered him to the echo. Who that has met him can escape his influence? All that I said had no effect on him.
He was the most eloquent speaker that I ever heard.
“That” ను defining clauses లో మాత్రమే వాడతాము. (వివరించేవి)
156. “That” అను పదమును Adverbial accustative గా (కర్మ రూపములో నున్న క్రియా విశేషణము) వాడవచ్చును. అప్పుడది on which, in which, at which అనే అర్థాన్నిస్తుంది.
I remember the day that he came.
On the day that thou eatest thereof thou shall surely die.
157. Relative pronoun గా నున్న that అను పదమును కొన్ని సందర్భములలో who లేక which అను పదములకు substitute గా (ప్రత్యామ్నాయముగా) వాడరాదు. ఎందుకంటే దానికి ఉన్న భావాన్ని తగ్గించి చెప్పే స్వభావం (restrictive force) ఉన్నది.
My father that is a schoolmaster is fifty years old. ఇలా చెప్పాలి. —
My father, who is a schoolmaster, is fifty years old.
తప్పు.
ఒకవేళ నాకు ఒకరికన్న ఎక్కువ మంది sisters ఉంటే ఇలా చెప్పాలి.
My sister that has been adopted by my uncle is ill.
158. కాని, ఈ క్రింది సందర్భములలో who or which అను Relative pronouns కు బదులుగా that
అను పదమును వాడతాము.
1. Superlative degrees లో నున్న adjectives తరువాత
He was the most eloquent speaker that I ever heard.
The wisest man that ever lived made mistakes.
This is the best that we can do.
2. all, same, any, none, nothing, (the) only e á égé
All is not gold that glitters.
He is the same man that he has been.
It is only donkeys that bray.
It was not for nothing that he studied philosophy.
Man is the only animal that can talk.
3. Interrogative pronouns
who, what
Who that saw her did not pity her ?
Who am I that I should object?
What is it that troubles you so much?
What is there that I do not know?
4. ఒక వ్యక్తి మరియు ఒక జంతువు లేక వస్తువు జతగా కలిపి subject గా వచ్చునపుడు, వాటి తర్వాత
The boy and his dog that had trespassed on the club premises were turned out.
159. What అను పదమును వస్తువుల గురించి మాట్లాడినపుడు మాత్రమే వాడతాము. దానికి ముందు యింకో పదము లేకుండా గూడా దానిని వాడవచ్చును. అప్పుడు దానికి that which అనే అర్ధం వస్తుంది. What (= that which) cannot be cured must be endured.
I say what (= that which) I mean.
I mean what I say.
What is done cannot be undone.
What man has done man can do.
What is one man’s meat is another man’s poison.
Give careful heed to what I say.
What I have written, I have written.
He found what he was looking for.
160. ప్రాచీన కాలపు ఇంగ్లిష్లో ఈ క్రింద చూపబడిన వాక్యములలో “as” ను relative pronoun m
such తర్వాత వాడిరి.
Tears such as angels weep burst forth.
These mangoes are not such as I bought yesterday.
He is such a man as I honour..
We have never had such a time as the present.
His answer was such as I expected him to give.
“As” అను పదమును
“Same” అను పదము తరువాత కూడా “as” ను relative pronounగా వాడవచ్చును.
My trouble is the same as yours [is].
This is not the same as that [is].
[But] I played with the same bat that you did.
“The same as” అను పదజాలమునకు “of the same kind” అనగా “అదే విధమైన” అనే అర్ధం వస్తుంది.
“The same that” అనగా “one and the same”.
“As” అను పదమునకు వెనువెంటనే adjective ఉన్నట్లయితే అట్టి “As” relative pronoun అవుతుంది.
I collected as many specimens as I could find.
గమనిక (Note): మొదటి example లో “as” ను adverb గా వాడినాము.
161. ప్రాచీనకాలపు ఇంగ్లిష్ లో negative అర్థాన్ని యిచ్చే పదము తరువాత ఉపయోగించిన but అను పదమును relative pronoun గా గుర్తించిరి. HOSTHA STICKA
There is none but will agree with me. (but will agree = who will not agree).
There is no Hindu but knows the story of the Ramayana. (That is, there is no Hindu who does not know, etc.)
There is no man but wishes to live.
There is no rose but has some thorn, (but = which…no)
There is scarcely a child but likes candy.
There is no man but knows these things, (but who does not.’)
But అను పదము పై వాక్యములలో who… not మరియు which… not అను అర్ధాన్నివ్వడం గమనించండి. OMISSION OF THE RELATIVE PRONOUN
162. Relative pronoun అయినట్టి పదము accusative case గా పనిచేయునప్పుడు దానిని సాధారణంగా వాక్యములో వాడరు.
Few and short were the prayers we said.
A contented mind is the greatest blessing a man can enjoy in the world.
I am monarch of all I survey.
Men must reap the things they sow.
“That” అను పదమును సర్వసాధారణంగా వ్యక్తులకు వాడతాము. కాని మనము ‘the meeting which attended yesterday,’ అని అంటాము. The meeting that I attended yesterday!’ అని అనాలి. ఇప్పుడు సర్వసాధారణంగా the meeting I attended yesterday అని వాడుకగా అంటాము. ఈ last sentence లో accusative relative అయిన “that” ను పదిలి వేశాము. ఇది మాట్లాడుకొనునప్పుడు బాగుంటుంది గాని, వ్రాతలో ఇచ్చట “that” వదలివేయుట అంత బాగుండదు.
163. ఈ క్రింది poetic lines లో nominative case రూపములో నున్న relative pronoun ను వదలివేయడం జరిగింది. చూడండి.
“This distance lends enchantment to the view.”
“I have a brother ^ is condemned to die.”
గమనిక (Note): ఈ విధంగా nominative case లో నున్న Relative Pronoun ను వదలివెయ్యడం. వాడుక భాషలో సాధారణమైంది.
విధంగా
There’s somebody at the door wants to see you.
Omission Of The Antecedent
164. ప్రాచీన ఇంగ్లిష్ Relative Pronoun ముందున్న పదాన్ని కొన్ని సందర్భాలలో వదలి వేశారు. ఈ
Who works not shall not eat. = (He) who works not shall not eat.
Whom the gods love, die young. = (Those) whom the gods love die young.
Who steals my purse, steafs trash.
Who laughs last laughs best.
Who has lost all hope has also lost all fear.
Be good, sweet maid, and let who will be clever.
Agreement Of The Relative PRONOUN AND ITS ANTECEDENT
165. Relative Pronoun, Noun Pronoun & mood కు ముందున్నట్టిది) అట్టి ముందున్న పదము, ఈ Relative Pronoun ఒకే number మరియు ఒకే Relative person (3m first person, second person, third person) eo do.రూపము మరియు “person” భావము verb ద్వారా తెలియును.
The boy who was lazy was punished.
The boys who were lazy were punished.
1, who am your king, will lead you.
I am the person that is to blame.
We who seek your protection, are strangers here.
O thou that leadest Israel !
You who are mighty, should be merciful.
You who seek wisdom, should be humble.
He that is not with me is against me.
He that is down, needs fear no fall.
He that eats till he is sick must fast till he is well. They who live in glass houses should not throw stones. They who seek only for faults see nothing else. The flowers which grow in our gardens are not for sale.
This is the only one of his poems that is worth reading.
[= Of his poems this is the only one that is worth reading.]
Relative Pronoun యొక్క case (nominative case etc.) దానికి verb కు ఉన్న సంబంధాన్ని బట్టి
నిర్ణయం అవుతుంది.
Rama is the boy who did it.
Rama is the boy whom I want.
Rama is the boy whose pencil I have.
Rama is the boy to whom I spoke.
He whom we worship, by whose gift we live, is the Lord.
Position Of The Relative Pronoun
166. ఇచ్చట కొన్ని సందేహాలు తలెత్తవచ్చు. ఈ సందేహాలు తలెత్తకుండా ఉండాలంటే, ఈ Relative
Pronoun పదాన్ని దానికి ముందున్న పదమునకు వీలైనంత దగ్గరగా వాడాలి. IMO
The boy who won the first prize in English is the son of my friend, Mr. Joshi. ఈ రెండు పదాలను దూరంగా ఉంచితే కొత్త అర్ధాలు తలెత్తవచ్చు. చూడండి. The boy is the son of my friend Mr. Joshi who won the first prize.
Compound Relative Pronouns
167. whoever, whichever what Ever, so, or soever కలిపినపుడు వచ్చే Pronouns, Compound Relative Pronouns అని అంటారు.
Relative Pronoun ముందు ఏ word కూడా ఉండదు.
whoever, whoso, whosoever, whichever, whatever, whatsoever.
Whosoever (= any and every person who) exalteth himself shall be abased.
Whoso diggeth a pit shall fall therein.
Whatsoever thy hand findeth to do, do it with thy might.
168. కాని ఇప్పుడు whoever, whichever, and whatever అను పదములను మామూలుగా
వాడేస్తున్నాము.
Whoever (i.e., any person who) comes is welcome.
Take whichever (i.e., any which) you like.
I will take with me whomsoever you choose.
Whatever (ie, anything which) he does, he does well.
అధ్యాయము 19
Interrogative Pronouns
169. ఈ క్రింది వాక్యములను గమనించండి :
Who is there? Who are you?
About whom are you talking?/ Who are you talking about?
Whom do you want? / Who do you want?
Whose is this book?
Which is the house?
Which do you prefer, tea or coffee?
What is the matter?
What do you want?
What will all the neighbours say?
Italics print లో నున్న pronouns ఇచ్చట relative pronouns లాగా కనిపించుచున్నవి. కాని అవి యిచ్చే వ్యాకరణ భావములో తేడా ఉంది. ఇచ్చట వానిని ప్రశ్నించే pronoun గా వాడాము. కావున అవి pronouns ou (Interrogative pronouns).
170. ఈ క్రింది వాక్యములలో ప్రశ్నించే సర్వనామములను (Interrogative pronouns) indirect questions వేయుటకు ఉపయోగించుచున్నారు.
I asked who was speaking.
I do not know who is there.
Tell me what you have done.
Ask what he wants.
Say which you would like best.
171. మరల ఈ క్రింది వాక్యములను గమనించండి :-
Who gave you that knife? (Nominative)
Whose is this book? (Possessive)
Whom did you see?/Who did you see? (Accusative)
To whom were you speaking?! Who were you speaking to? (Accusative)
What is that? (Nominative)
What do you want? (Accusative)
Which is he? (Nominative)
Which do you prefer? (Accusative)
Nominative: who
Possessive: whose
Accusative: whom/who
Modern English సంభాషణలో, కర్మ రూపంలో (object) whom అను పదము కంటె who అను పదాన్ని ఎక్కువగా వాడుచున్నారు. What మరియు which అను పదములకు విభక్తి ప్రత్యయములలో వివిధ రూపాలు లేవు. అవి అదే విధముగా వాడబడును.
Interrogative Pronouns
172. Who అను పదమును వ్యక్తులకే వాడతాము.
Who spoke ? (We expect the answer to be the name of a person.)
Who goes there? Who made the to, score?
Who is knocking at the door? Who says so?
Whose is this umbrella? Whom did you see?
173. కాని which అను పదమును వ్యక్తులకు, వస్తువులకు గూడా వాడెదము. Which is your friend? Which are your books?
Which of the boys saw him?
Which of you has done this?
Which of these books is yours?
Which of the pictures do you like best?
Which of you by taking thought can add one cubit unto his statrue?
Which will you take?
174. What అను పదమును వస్తువులకు మాత్రమే వాడెదము.
What have you found? (We expect the answer to be the name of a thing.)
What do you want? What did you say?
What was it all about?
What is sweeter than honey?
What are those marks on your coat?
175. “What are you ?”, “What is he ?”, “What is this man?”, “What” అను pronoun వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు. ఆ వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని, వృత్తిని గురించి indirect గా అడుగుచున్నది.
What are you? I am a doctor.
What is he?_He is an engineer.
కాని, “Who is he ?” అన్నపుడు ఆయన పేరును చెబుతాము. ఎందుకంటే యిచ్చట వ్యక్తిని గురించి Sh sapaga V SVITISMARTMI ONA SVITISMART
Who is he? (What is his name and family ?)-He is Mr. K.P. Roy.
176. ఈ క్రింది వాక్యములలో, which and what అను పదములను interrogative adjectives గా (ప్రశ్నించే విశేషణములు) వాడుచున్నాము :-
Which book are your reading?
Which way shall we go?
What books have you read ?
What pranks are you playing?
What manner of man is this, that even the wind and the sea obey him?
177. ఈ క్రింది వాక్యములలో italics లో ఉన్న పదములు compound interrogative pronouns’ (సంయుక్తముగా నున్న మరియు ప్రశ్నించే సర్వనామములు).
Whoever told you so?
Whatever are you doing?
(Note): Whoever, whichever, whatevere
1. wishes to see you?
2. do you wish to see?
3. did she say was the winner?
4._did he invite ?
5._shall give this to ?
6_do men sav that 1 am ?
7.do you believe did this?
అధ్యాయము 20
The Verb
Transitive And Intransitive Verbs
179. Verb (క్రియా పదము) మనుష్యుల గురించి, జంతువుల గురించి, వస్తువుల గురించి మాట్లాడుతుంది. లాటిన్లో “Verbum” అను పదము నుండి verb పుట్టింది. Verb అనగా వాక్యములో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నట్టిది అని అర్ధం.
Verb మనకు ఈ క్రింది విషయాలను చెబుతుంది –
1. మనిషి ఏమి చేస్తున్నాడు? ఫలానా వస్తువు ఏమి చేస్తుంది?
Hari laughs.
The clock strikes.
2. ఒక వ్యక్తికి గాని, ఒక వస్తువునకు గాని ఏమి జరిగింది?
Hari is scolded. The window is broken.
3. ఆ వ్యక్తి ఏమిటి? ఆ వస్తువు ఏమిటి?
The cat is dead.
Glass is brittle.
I feel sorry.
నిర్వచనము :- ఒక వ్యక్తిని గురించి గాని, ఒక వస్తువును గురించి గాని వారు లేక అవి చేయు పనులను గురించి చెప్పునట్టి దానిని మనము క్రియ (verb) అని అంటాము.
180. తరుచుగా Verb ఒక్క పదం కన్నా ఎక్కువ పదములను కలిగి ఉంటుంది.
The girls were singing.
I have learnt my lesson.
The watch has been found.
181. ఈ క్రింది వాక్యములను చదవండి : –
1. The boy kicks the football.
2. The boy laughs loudly.
మొదటి వాక్యములో బాలుడు చేసిన పని football పైన పడింది. అనగా action బాలుని యొక్క football వరకు ప్రయాణించింది అని అర్ధం. ఇట్టి క్రియా పదమును transitive verb చలన క్రియ) అని అంటాము.
రెండవ వాక్యములో, నవ్వుట అను అర్ధము. బాలుని వద్దనే నిలిచి పోయింది. నవ్వుకు అచ్చట ముందుకు సాగే పనిలేదు. ఉన్న చోటనే ఉన్నది. ఇట్టి క్రియా పదాన్ని intransitive అని అంటాము. అనగా నిశ్చలంగా ఉన్న చోటనే ఉన్న క్రియా పదము అని అర్ధము.
నిర్వచనం :- కర్త నుండి కర్మకు action వెళ్ళునటు వంటి క్రియను transitive verb అంటారు. నిర్వచనం :- కర్త నుండి కర్మకు action వెళ్లనటు వంటి క్రియను intransitive verb అంటారు. అది action ను అక్కడికక్కడే ఉంచి వివరిస్తుంది. Intransitive verb లో చలనము ఉండదు.
He ran a long distance.
The baby sleeps.
There is a flaw in this diamond.
helping verb కాలమును గురించి చెప్పుచున్నది.
(Action)
(State)
(Being) అనగా సహాయం చేసే క్రియ. యిచ్చట is అను
గమనిక (Note: Intransitive verbs కు ముందూ వెనకా గూడా విభక్తి ప్రత్యయములలో (cases) మార్పు ఉండదు.
182. చాలా వరకు transitive verbs ఒకే ఒక (single objects ను తీసుకుంటవి. కాని give, ask, offer, promise, tell మొదలగు పదములు రెండు objects ను వాని తదుపరి తీసుకుంటవి. ఈ విధంగా His father gave him (Indirect) a watch (Direct).
He told me (Indirect) a secret (Direct).
183. Verb కు transitive form మరియు Intransitive form రెండూ ఉంటవి.
used Transitively | Used Intransitively |
1. The ants fought the wasps. | Some ants fight very fiercely. |
2. The shot san/c the ship. | The ship sank rapidly. |
3. Ring the bell, Rama. | The bell rang loudly. |
4. The driver stopped the train. | The train stopped suddenly.” |
5. He spoke the truth. | He spoke haughtily. |
6. The horse kicked the man. | This horse never kicks. |
7. I feel a severe pain in my head. | How do you feel ? |
గమనిక (Note: come, go, fall, die, sleep, lie అను పదములు transitive verb గా పనిచెయ్యవు. 184. “The man killed himself’ అను వాక్యములో Subject మరియు object రెండూ కూడా ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి. ఇచ్చట verb (క్రియ) ప్రతిబింబించే పని చేస్తుంది. కొన్ని చోట్ల, verb పదము 1 reflexive action (ప్రతిబింబించు కార్యమును చేపట్టినపుడు) object గా నున్న పదమును అచ్చట రాయడం జరగదు. ఎందుకంటే అచట subject మరియు object రెండూ కూడా ఒకే వ్యక్తిని సూచించును గావున object ను మనం subject లోనే ఊహించుకోవాలి.
ఈ క్రింది వాక్యములలో ఆ భావం చూపబడింది.
The bubble burst [itself).
The guests made [themselves] merry.
Please keep [yourselves) quiet.
With these words he turned [himself] to the door.
The Japanese feed [themselves] chiefly on rice.
పై వాక్యములలోని భావము Intransitive (ముందుకు కదలనట్టిది) గానే ఉండిపోయింది. Reflexive భావము చూపబడలేదు.
185. కొన్ని సందర్భములలో క్రియా పదములను reflexive verbs గా వాడుచూ మరియు transitive
గా కూడా వాడతాము. ఈ విధంగా :-
Do not forget his name.
I forget his name.
Acquit yourself as man.
The magistrate acquitted him of the charge against him.
I enjoy myself sitting alone.
He enjoys good health.
He interested himself in his friend’s welfare.
His talk does not interest me.
అభ్యాసము 36
ఈ క్రింద ఇవ్వబడిన వాక్యములలో Transitive మరియు Intransitive ను గుర్తించుము. Transitive
అయినచో ఆ verb యొక్క objective ను పేర్కొనుము.
1. The sun shines brightly.
2. The boy cut his hand with a knife.
3. The clock stopped this morning.
4. The policeman blew his whistle.
5. The sun rises in the east.
6. An old beggar stood by the gate.
7. The clock ticks all day long.
8. I looked down from my window.
9. Put away your books.
10. The moon rose early.
11. The cat sleeps on the rug.
12. Cocks crow in the morning.
13. Your book lies on the table.
14. The fire burns dimly.
15. Time changes all things.
16. We eat three times a day.
17. Tell the truth.
18. The birds sing in the green trees.
19. The little bird hopped about and sang.
20. My new watch does not keep good time.
21. The beggar sat down by the side of the road.
22. I could not spare the time.
23. He took shelter under a tree.
24. The boy easily lifted the heavy weight.
25. Balu wrote a letter to his uncle.
26. A tiny bird lived under the caves.
27. I know a funny little man.
28. Birds fly in the air.
29. A fight rain fell last night.
30. I shall bring my camera with me.
31. You speak too loudly.
32. The dog ran after me.
అభ్యాసము 37
ఏవైనా ఐదు transitive verbs మరియు ఐదు intransitive verbs ఉపయోగించి పది వాక్యములు వ్రాయుము.
Intransitive Verbs Used As Trasitives
186. Intransitive verb ను (తన భావమును ముందుకు అనగా object వైపు పోనీయనట్టిది) causative verb గా వాడినపుడు (ఒక కార్యక్రమమునకు కారణమైనట్టిది), అట్టి verb, Transitive verb గా మారుతుంది.
Intransitive
1. The horse walks.
2. The girl ran down the street.
3. Birds fly.
Transitive
1. He walks the horse.
2. The girl ran a needle into her finger
(ran a needle = caused a needle to run)
3. The boys fly their kites (i.e., cause their kites to fly)
187. మనం సాధారణంగా వాడునట్టి కొన్ని verb పదములు వాని spellings మార్చుట ద్వారా, అవి Transitive verbs గా గాని Intransitive verb గా గాని మార్పు చెందును.
Intransitive
Transitive
1. Many trees fall in the monsoon. 2. Lie still.
1. Woodmen fell trees. (Fell
cause to fall)
2. Lay the basket there. (Lay
cause to lie)
3. Raise your hands. (Raise
cause to rise)
3. Rise early with the lark.
4. Sit there.
4. Set the lamp on the table. (Set = cause to sit)
188. కొన్ని Intransitive Verbs కు Preposition ను కలపడం ద్వారా అవి Transitive verb యొక్క ప్రభావమును పొందును. Intransitive verb యొక్క భావము కదలిక లేకుండా ఉన్నచోటనే ఉండును. Preposition అనగా విభక్త్యర్ధకమైన అవ్యయము అని అర్ధం. అది subject కు దానికి సంబంధించిన ఇతర పదమునకు మధ్యనున్న సంబంధాన్ని తెలియచేయును.
All his friends laughed at (= derided) him!
He will soon run through (= consume) his forture.
Please look into (= investigate) the matter carefully.00 We talked about (= discussed) the affair several times.:
I wish for ( desire) nothing more.
The Police Inspector asked for ( demanded) his name.
కొన్ని సందర్భములలో verb కు ముందు preposition ను ఈ క్రింద చూపిన విధంగా ఉంచెదము :-
Shivaji over came the enemy.
He bravely with stood the attack.
The river over flows its banks.
189. ఒకోసారి intransitive Verbs వాని అర్ధమునకు సరిపడే Object ను తమ తర్వాత తమ పక్కన చేర్చుకుంటాయి. వానిని Cognate Object లేదా Cognate Accusative అని అంటారు. Cognate అను పదము చుట్టము అనే భావాన్ని ఇస్తుంది.
I have fought a good fight.
He laughed a hearty laugh.
I dreamt a strange dream.
He sleeps the sleep of the just.
Let me die the death of the righteous.
She sighed a deep sigh.
She sang a sweet song. He ran a race.
Aurangzeb lived the life of an ascetic.
Cognate Object గా ఉపయోగింపబడిన noun (నామవాచకము) Accusative Case గా ఉంటుంది.He ran a great risk (= he ran a course of great risk).
The children shouted applause (= the children shouted a shout of applause).
190. Time, place, distance, weight, value లను సూచించు verb లను, adjective లను లేక adverb ను అజమాయిషీ చేయుటకు, (modify) noun ను adverb గా వాడినపుడు, అట్టి noun ను adverbial object లేక adverbial accusative అని అంటారు. అప్పుడు ఆ noun adverbial accusative గా నున్నది అని అర్థం.
He held the post ten years.
I can’t wait a moment longer.
He went home.
He swam a mile.
He weighs seven stone.
The watch cost nine hundred rupees.
191. కొన్ని Transitive Verbs ను కొన్ని సందర్భములలో Intransitive Verbs గా వాడటం జరుగుతుంది. Transitive Verb సాధారణంగా భావాన్ని ఎడమ నుండి కుడికి object వైపు తీసుకెళ్తుంది.
Transitive
1. He broke the glass. 2. He burnt his fingers. 3. Stop him from going.. 4. Open all the windows..
అధ్యాయము 21
Intransitive
1. The glass broke.
2. He burnt with shame.
3. We shall stop here a few days.
4. The show opens at six o’clock.
Verbs Of Incomplete Predication
192. ఈ క్రింది వాక్యములను చదవండి :
1. The baby sleeps.
2. The baby seems happy.
ఈ రెండు వాక్యములలో క్రియా పదములు (verbs) Intransitive Verbs. (భావమును ముందుకు పోనివ్వనివి) The baby sleeps’ అనే వాక్యము సంపూర్ణభావంతో ఉన్నది. “The baby seems to sleep” అను వాక్యములో సంపూర్ణభావము రాదు. నిద్రపోవుచున్నట్లుగా నున్నది అనే వాక్యములో నిద్రపోవుచున్నది. అనే భావం రాదు. Intransitive Verb భావాన్ని ఇచ్చే seems అను పదమునకు తోడుగా ఇంకో పదము happy లాంటిది ఉంటేనే మనకు పూర్తి భావం వస్తుంది. ఇటువంటి పదమును Complement of the Verb అని అంటాము. దీనినే Completion of the Predicate అని కూడా అంటాము.
193. Incomplete భావాన్ని సూచించే క్రియా పదములు (Verbs) being, becoming, seeming, appearing అనునవి. వానికి అనుబంధంగా అనగా తోడుగా noun ఉంటుంది. అలాగే అట్టి noun ను Predicative Noun అంటాము లేక అచ్చట Adjective ఉంటే Predicative Adjective అని కూడా అంటాము. ఇచ్చటి Complement ను (తోడుగానున్నట్టి దానిని) Subjective Complement అని కూడా అంటాము.
1. Tabby is a cat.
2. The earth is round.
3. John became a soldier.
4. Mr. Mehta became mayor.
5. The man seems tired.
6. You look happy.
7. The sky grew dark.
8. Roses smell sweet.
9. Sugar tastes sweet.
10. She appears pleased.
11. This house is to let.
గమనిక (Note) : ఒక పదము Subjective Complement గా ఉన్నప్పుడు (1,3,4) అది Subject ఉన్న Case లోనే ఉంటుంది. అనగా Nominative Case.
194. కొన్ని Transitive Verbs (క్రియాపదము యొక్క భావాన్ని ముందుకు నడిపించేవి), వానికి సహజంగా ఉండే Object కు తోడుగా ఇంకో పదము (Complement) ను భావము పూర్తి కావడానికి తీసుకుంటాయి.
1. The boys made Rama captain.
2. His parents named him Harl.
3. This made him vain.
4. The jury found him guilty.
5. Rama called his cousin a liar.
6. Exercise has made his muscles strong.
7. I consider the man trustworthy.
8. God called the light day.
9. We thought him a rascal.
10. They chose him their leader.
పై వాక్యములలో Complement (captain etc.) object పదాన్ని (Rama etc.) పూర్తిగా వివరిస్తుంది. ఇచ్చట ఈ Complement word ను Objective Complement అని అంటాము.
గమనిక (Note): పైన చూపించిన నామవాచక Objective Complement పదములు Objective Case లో ఉండి (కర్మరూపకములు) Object పదముతో కర్మపదముతో) agreement కలిగి ఉన్నాయి (1,2,5,8,9).
అభ్యాసము 38
క్రింద ఇవ్వబడిన వాక్యములలో verbs Transitive లేక intransitive గా ఉన్నవా తెలుపుచూ transitive verb యొక్క object ను మరియు verb of incomplete predication యొక్క complementను పేర్కొనుము.
1. The hungry lion roars.
2. The report proved false.
3. The boy stood on the burning deck.
4. The child had fallen sick.
5. The ass continued braying.
6. The wind is cold.
7. The results are out.
8. He tried again and again..
9. We see with our eyes,
10. The child fell asleep.
11. The weather is hot.
12. They are Europeans.
13. The rumour seems true.
14. Owls hide in the daytime.
15. Bad boys hide their faults.
16. The poor woman went mad.
17. We waited patiently at the station..
18. He told a lie.
19. They elected him president.
20. I found her weeping.
21. He struck the man dead.
22. The crow flew down and stole the cheese.
23. The sky looks threatening.
24. They made him general.
25. He waited an hour.
26. New brooms sweep clean.
అధ్యాయము 22
Active And Passive Voice
195. క్రింది వానిని పోల్చి చూడండి.
1. Rama helps Hari.
2. Hari is helped by Rama.
పై రెండు వాక్యములు ఒకే అర్థాన్ని ఇచ్చుచున్నవి. కాని మొదటి వాక్యములో Verb ఉన్న పరిస్థితిలో subject గానున్న రాముడు ఏదో ఒక పనిని చేపట్టినాడు అనే అర్ధం స్ఫురించుచున్నది.
Rama (the person denoted by the subject) does something.
దీనిని బట్టి “helps” అన్న పదం Active Voice లో నున్నదని తెలుస్తుంది.
రెండవ వాక్యములో, subject చేత పేర్కొనబడిన person కు ఏదో సంభవించింది అని అర్ధం స్ఫురించు చున్నది.
Something is done to Hari (the person-denoted by the Subject.)
ఇక్కడ “is helped” అన్న verb passive voice లో నున్నది.
Def. (నిర్వచనం) : Verb పదము Active Voice లోనున్నపుడు Subject గానున్న పదము action చేస్తుంది. ఇలా Subject నేరుగా తన పనిని తాను చేయుటవలన అచటి verb ను Active Voice verb అని అంటాము (చురుకుగా పనిచేయునట్టిది అని అర్ధము).
Def. (నిర్వచనం) : – Subject చేత పేర్కొనబడిన person కు గాని, thing కు గాని, Subject చేత ఏదో సంభవించినదని చెప్పబడినపుడు అచ్చటి verb passive voice లో నున్నది అని భావము. Subject చేత పేర్కొనబడిన వ్యక్తిగాని, వస్తువుగాని తనంతటతాను ఏ పనిని చేయనప్పటికీ, తనపై బయటి ప్రభావము పడినపుడు కూడా అచ్చటి verb, passive voice లో నున్నది అని అంటాము.
Active voice నుంచి Passive voice కు మారిన వాక్యములలోని మార్పులను గమనించండి.
Passive Voice | Active Voice |
1.Sita loves Savitri. | 1. Savitri is loved by Sita. |
2.The mason is building the wall. | 2. The wall is being built by the mason. |
3 The peon opened the gate. | 3. The gate was opened by the peon. |
4 Some boys were helping the wounded man. | 4. The wounded man was being helped by some boys. |
5 He will finish the work in a fortnight. | 5. The work will be finished by him in a fortnight. |
6. Who did this? | 6. By whom was this done? |
7. Why did your brother write such a letter? | 7. Why was such a letter written by your brother? |
పై వాక్యములలో Active Voice వాక్యములోని Object పదము, Passive Voice లో Subject గా మారినది.
(మొదటి వాక్యములో “loves” అను verb కు object కానున్న savithri అను పదము రెండవ వాక్యములో “is loved” నకు subject గా మారినది)
ఈ సందర్భములో Passive Voice లో Transitive Verbs ను మాత్రమే వాడతారు. ఎందుకంటే Intransitive Verb కు Object పదము ఉండదు.
196. Auxiliary verb (helping verb) so “be” sentence తగిన tense formation ఇచ్చి, దాని వెనువెంటనే past participle పదమును జతకలిపినట్లయితే, passive voice sentence వస్తుంది.
Tense (or Modal + base) | Active Voice | Passive Voice |
Simple present | take | am taken |
takes | is taken | |
are taken | ||
Present continuous | am taking | am being taken |
is taking | is being taken | |
are taking | are being taken | |
Present perfect | has taken | has been taken |
have taken | have been taken | |
Simple past | took | was taken |
Past continuous | was taking | was being taken |
were taking | were being taken | |
Past perfect | had taken | had been taken |
Simple future | will take | will be taken |
shall take | shall be taken | |
can/may/ | can take | can be taken |
must, etc. + base | must take | must be taken |
197. ఏ సందర్భములో Active voice వాక్యమును ప్రయోగించాలో, ఏ సందర్భములో Passive voice వాక్యమును ప్రయోగించాలో అనే భావన విద్యార్థికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కేవలం grammar rulesం లేదు. సందర్భము యొక్క అవగాహన పూర్తిగా ఉండాలి. సందర్భాన్నిబట్టి ఏ
voice ను వాడాలో తెలిసి ఉండాలి.
కార్యచరణనకు సంబంధించిన కర్త అనువానికి ప్రాముఖ్యమును ఇవ్వవలసిన సందర్భములో Active voice ను ఉపయోగించాలి. ఆ కార్యాచరణవలన (action profile) బాధపడిన వ్యక్తికి గాని, వస్తువునకుగాని ప్రాముఖ్యమును చూపదలచినపుడు Passive voice ను ఉపయోగించెదము.
My pen has been stolen. (Somebody has stolen my pen.)
I was asked my name. (They asked me my name.)
English is spoken all over the world. (People speak English all over the world.)
I have been invited to the party. (Someone has invited me to the party.)
We will execute all orders promptly. (All orders will be executed promptly.)
పై వాక్యములలో by + noun తో కూడిన జంట పదమును వాడకపోవడం గమనించండి. అంతకు ముందున్న examples లో agent కు ప్రాముఖ్యమివ్వవలసి వచ్చినపుడు by phrase ను వాడడం గూడా గమనించండి.
అభ్యాసము 39
క్రింద ఇవ్వబడిన వాక్యములలోని verbs ను కనుగొని అది Active లేక Passive లో నున్నదా అని 30255500.
1. The cat killed the mouse.
2. We compelled the enemy to surrender.
3. The boy was bitten by a dog.
4. The thief was caught.
5. The boy made a kite.
6. The ship was burned.
7. The young man made a disturbance
at the meeting.
8. The captive was bound to a tree.
9. The bird was killed by a cruel boy.
10. The sudden noise frightened the horse. 11. He is loved by all.
12. The exhibition was opened by the Governor.
13. I see a dark cloud.
14. His command was promptly obeyed.
15. Some of the cargo had been damaged by the sea water.
16. Nothing will be gained by hurry.
17. The dog chased the sheep.
18. This letter was posted last night.
19. The field is ploughed.
20. The dog was teased by the boy.
21. The cat drank all the milk.
22. A stone struck me on the head.
23. The old gentleman takes snuff.
24. The money was lost.
25. The letter has just been posted.
అభ్యాసము 40
HIGH SCHOOL ENGLISH GRAMMAR
ఈ క్రింది వాక్యములను Active Voice నుండి Passive Voice గా మార్చుము.
(7,12,25, 29, 31, 32,33,34 మరియు 35 వాక్యములలో agent ను విస్మరించవలెను)
1. The cat killed the mouse.
2. The man cut down the tree.
3. His teacher praised him.
4. Columbus discovered America.
5.20% The boy teased the dog.
6. The syce feeds the horse every day.
7. The police arrested him.
8. Rama was making a kite.
9. The boy caught the ball.
10. My father will write a letter.
11. I will conquer him.
12. He kept me waiting.
13. The hunter shot the lion.
14. Hari opened the door.
15. A policeman caught the thief.
16. Sohrab threw the ball.
17. He scored twenty runs.
18. Your behaviour vexes me.
19. Manners reveal character.
20. He made a very remarkable discovery.
21. Little strokes fell great oaks.
22. Dhondu will bring the pony.
23. Everyone loves him.
24. My cousin has drawn this picture.
25. We expect good news.
26. The farmer gathers the harvest.
27. His own brother swindled him.
28. The recitation pleased the inspector.
29. Somebody has put out the light.
30. The enemy have defeated our army.
31. They sell radios here.
32. I have sold my bicycle.
33. People will soon forget it.
34. They opened the theatre only last month
35. We prohibit smoking.
198. Active Voice లోనున్న verb ఒక direct object ను మరియొక్క indirect object ను కలిగియుండి, Passive voice గా ఆ వాక్యమును మార్చినపుడు ఒక object, subject గా మారి, రెండవ object అలానే ఉంచబడుతుంది.
Active
The guard refused him admittance.
Mr. Krishnaji teaches us grammar.
The manager will give you a ticket.
Who taught you French?
He handed her a chair.
Passive
Admittance was refused to him by the guard.
He was refused admittance by the guard.
Grammar is taught to us by Mr. Krishnaji.
We are taught grammar by Mr. Krishnaji.
A ticket will be given to you by the manager, You will be given a ticket by the manager.
By whom was French taught to you? / Who were you taught French by?
By whom were you taught French?
A chair was handed to her.
She was handed a chair.
Indirect object ఒకరికి ఏమి జరిగిందీ చెబుతుంది. Direct object నేరుగా తన పని తాను చేసుకుపోతుంది.
పై examples లో మాదిరిగా, indirect voice వాక్యము ఒక వ్యక్తితో ప్రారంభం అవుతుంది.
199. Subject గా నున్న agent ఒక వస్తువును వాడినపుడు “with” అను పదమును వాడెదము. The dog was hit with a stick. (Active Voice: Somebody hit the dog with a stick.)
The dog was hit by a boy. (Active Voice: A boy hit the dog.)
200 కొన్ని Transitive verb పదములు (action ను ముందుకు నడిపించేవి) Active voice లో ఉండికూడా Passive voice భావాన్ని ఇస్తాయి.
These mangoes taste sour (i.e., are sour when they are tasted).
The rose smells sweet (i.e., is sweet when it is smelt).
The cakes eat short and crisp (i.e., are short and crisp when they are eaten).
At least the play reads well (i.e., affects the reader well when it is read).
అభ్యాసము 41
ఈ క్రింది వాక్యములను Passive Voice sentences గా రాయండి.
1. We saw you and him.
2. They asked me my name.
3. We refused them admission.
4. I bought the baby a doll.
5. They found him guilty of murder.
6. thunderstorm often turns milk sour.
7. You cannot pump the ocean dry.
8. They saw the storm approaching.
9. He keeps me waiting.
10. They painted the house red.
11. He told me to leave the room.
12. He promised me a present.
13. I shail order the carriage.
14. The boy is climbing the cliff.
15. One may accomplish many things by a little effort.
16. I am watching you very carefully.
అభ్యాసము 42
Verb పదములు Active Voice లోనుండునట్లుగా ఈ క్రింది వాక్యములను తిరిగి రాయండి.
1. He was praised by his father.
2. The first railway was built by George Stephenson.
3. The horse was frightened by the noise.
4. Not a word was spoken by Latif.
5. The teacher was pleased with the boy’s work.
6. He was taken to the hospital by his friends.
7. The town was destroyed by an earthquake.
8. The road was lined with people.
9. The President was welcomed by the people.
10. Shakuntala was written by Kalidas.
11. The building was damaged by the fire.
12. I was struck by his singular appearance.
13. Those cars were built by robots,
14. The streets were thronged with spectators.
15. The trees were blown down by the wind.
16. We shall be blamed by everyone.
17. The child was knocked down by a car.
18. Alice was not much surprised at this.
19. He will be greatly surprised if he is chosen.
అభ్యాసము 43
ఏవైనా మూడు వాక్యములను Active Voice వాక్యములుగా రూపుదిద్ది మరల అనే వాక్యములను Passive Voice వాక్యములుగా రాయండి.
201. ఇచ్చట Active voice మరియు Passive Voice పదములు ఒకదాని రూపమును ఇంకొకటి. సంతరించుకొను సందర్భములు చూపబడినవి.
Active. | —All his friends laughed at him. |
Passive. | —He was laughed at by all his friends. |
Active. | —They made him king. |
Passive. | —He was made king. |
Active. | —They use video for teaching (he students. |
Passive. | —Video is used for teaching the students. |
Active. | —One should keep one’s promises. |
Passive. | —Promises should be kept. |
Active. | —When will you return the book? |
Passive. | — When will the book be returned? |
Active. | — Someone has picked my pocket. |
Passive. | — My pockei has been picked. |
Active. | — Circumstances wili oblige me to go. |
Passive. | — I shall be obliged to go. |
అభ్యాసము 44
క్రింద ఇవ్వబడిన వాక్యములలోని Voice భావములను ఒకదాని నుండి యింకొక దానికి మార్చండి:
1. We elected Balu captain.
2. I saw him opening the box.
3. We must listen to his words.
4: Shall I ever forget those happy days?
5. By whom was this jug broken?
6. His subordinates accused him of various offences.
7. One cannot gather grapes from thistles.
8. The telegraph wires have been cut.
9. Alas! We shall hear his voice no more.
10. The 1998 Asian Games were held in Bangkok, Thailand.
11. Without effort nothing can be gained.
13. All desire wealth and some acquire it.
12. Do not insult the weak.
14. Why should I be suspected by you ?
15. The information is kept on our computer.
16. The legend tells us how the castle received its name.
17. My watch was lost.
18. Why did he defraud you of your earnings ?
19. The public will learn with astonishment that war is imminent.
20. He made his wife do the work.
21. The master appointed him monitor.
22. The doctor despaired of his recovery.
23. He was refused admittance.
24. They laughed at his warnings and objected to all his proposals.
25. The people regarded him as an impostor and called him a villain.
అధ్యాయము 23
Mood
202. జరిగిన విషయాన్ని ఒక statement ద్వారా తెలియజేయటకు గాని, ఒక ప్రశ్న అడుగుటకు గాని
Verb ను సులభంగా వాడవచ్చును.
I write to my brother every week.
Who wrote that letter?
కాని Verb పదమును ఆజ్ఞయివ్వడంకు కూడా వాడవచ్చును.
Write neatly.
Verb ను ఒక అవగాహనను తెలియజేయడానికి కూడా వాడవచ్చును.
If I were you, I would not do it
ఈ విధమైన మానసిక ప్రవృత్తులను Verb పదము తెలియజేసినపుడు, ఆ భావములను Mood అని అంటాము.
Def. (నిర్వచనం) : – మనస్సు ఒక action ను గురించి ఏవిధంగా ప్రకోపింపబడుతుందో దానిని Mood అంటారు.
203. ఇంగ్లిష్ భాషలో మూడు రకములైన Moods ఉన్నవి :
1. Indicative (సూచన చేయుట)
2. Imperative (ఒక ఆజ్ఞను గాని, ఒక సంబోధననుగాని, ఒక విన్నపమును గాని ఇచ్చుట)
3. Subjunctive.
Mood ని Charles Philip Brown గారు సంశయార్ధక ప్రయోగ పదము అని వివరించి యున్నారు. శంకరనారాయణగారు ఛేదార్థిక ప్రయోగము అన్నారు.
Indicative Mood
204. Indicative Mood అనగా :
1. ఉన్న విషయాన్ని యధాతధంగా అనగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం.
Rarna goes to school daily.
We are taught Arithmetic.
He writes legibly.
Napoleon died at St. Helena.
The child is alive.
2. ప్రశ్న అడుగు సందర్భములో :
Have you found your book?
Are you well?
పై వాక్యములలో italics లోని verb, “Indicative Mood” లో నున్నది.
205. ఒక supposition ను (ఇలా కావచ్చు, అలా కావచ్చు అనే అభిప్రాయం) యదార్ధ విషయము అని తెలియజేయడానికి కూడా Indicative Mood ను వాడతారు. Supposition అనగా ఇచ్చట మనస్సులో ఊహాజనితమై ఉన్నట్టిది అని కూడా చెప్పుకొనవచ్చును.
If (= assuming as a fact that) / am to be a beggar, it shall never make me a rascal.
If it rains, I shall stay at home. (Assuming as a fact that it will rain, etc.]
If my friend wants it, I shall give it to him. (Assuming as a fact that my friend wants it, etc.]
If he is the ring-leader, he deserves to be punished.
[Assuming as a fact that he is the ring-leader, etc.]
ఒక యదార్థ విషయం గురించి statement ఇవ్వడానికి, ఒక ప్రశ్న అడగడానికి, ఒక ఊహను తెలియపర్చడానికి Indicative Mood వాడతారు.
Imperative Mood
206. Imperative Mood ను ఈ క్రింది మూడు సందర్భాలలో వాడతారు.
(1) ఆజ్ఞ రూపంలో :-
Wait there.
Come here.
Open your book at page 7.
(2) ఒక మంచి పనికి ఉద్బోధించునపుడు :-
Be steady.
Take care of your health.
Try to do better.
(3) విన్నవించునపుడు మరియు ప్రార్ధించునపుడు
Have mercy upon us.
Give us this day our daily bread.
పై వాక్యములలో italics లో నున్న Verb Imperative Mood లో నున్నది.
ఒక Verb ఆజ్ఞను ఇచ్చునప్పుడు గాని, ఉద్బోధన చేయునపుడుగాని అనగా ఒక మంచి పనికి ఉత్సాహము కలిగించునపుడుగాని, విన్నపము చేయునపుడు గాని, ప్రార్ధన పూర్వకముగా request చేయునపుడుగాని అట్టి Verb పదమును Imperative mood లోనున్నదని చెప్పుదురు.
గమనిక (Note 1): ఆజ్ఞ ఇచ్చు మనిషి మాట్లాడే మనిషి గావున, Imperative mood రెండవ వ్యక్తికే (Second Person) వర్తిస్తుంది. ఈ Imperative mood verb నకు “Let” అను పదము add చేయుట ద్వారా, దాని భావము First person, Third Person లకు వర్తిస్తుంది.
Let me go.
Let us go.
Let him go.
Let them go.
(Note 2): Imperative mood & verb “you” subject exo you ómon 3603. “Go” is better than “you go”.
Subjective Mood
207. ఈ క్రిందివి Subjunctive యొక్క రూపాలు
Present Subjunctive | Past Subjunctive | ||
the verb ‘be’ | oiher verbs | the verb ‘be’ | other verbs |
1 be | 1 speak | 1 were | 1 spoke |
We be | We speak | We were | We spoke |
You be | You speak | You were | You spoke |
He be | He speak | He were | He spoke |
They be | They speak | They were | They spoke |
208. Modern English & present tense
సందర్భాలలో కనిపిస్తుంది : –
(1) సాంప్రదాయంగా వచ్చుచున్న కొన్ని పదాలలో, ఒక కోరికనుగాని, ఒక ఆశనుగాని తెలియచేయుటకు
God bless you!
God save the King!
Heaven help us !
(2) శాస్త్రీయమైన English లోని noun clause కోరిక (desire), అభిరుచి (intention) తీర్మానము (resolution) లను తెలియజేయవలసి వచ్చినపుడు –
I move that Mr. Gupta be appointed Chairman.
It is suggested that a ring road be built to relieve the congestion.
We recommended that the subscription be increased to ten rupees.
209. Past tense లోనున్న Subjunctive ఈ క్రింది సందర్భములలో వాడబడుతుంది.
(1) “wish” అను verb ను వాడిన తరువాత, అచట ఉన్న పరిస్థితి నిజము కాక మరియు ఉన్న యదార్ధ స్థితికి విరుద్ధముగానున్నపుడు –
I wish I knew his name. (= I’m sorry I don’t know his name.)
I wish were a millionaire. (“ప్రస్తుతం కోటీశ్వరుడను కాను. కానీ అయితే అభ్యంతరం లేదు అనే అర్ధం వస్తుంది.”)
She wishes the car belonged to you.
(2) “If” తరువాత అసంబద్ధముగానున్న ప్రస్తుత పరిస్థితిని తెలియజేయుటకు
If I were you I should not do that (but I am not you, and never can be).
If we started now we would be in time (but we cannot start now).
(3) “as if ” మరియు “as though” తరువాత అసంబద్ధముగానున్న పరిస్థితిని తెలియజేయుటకు
He orders me about as if I were his wife (but I am not).
He walks as though he were drunk (but he is not).
(4) “it is time + subject” or as wer engo saugo It is time we started.
(5) “would rather + subject”
I would rather you went by air {- I should prefer you to go by air)
They would rather you paid them by cheque.