Sentences: Simple, Compound And Complex : Definition & Types with Examples in Telugu

అధ్యాయము 4

Sentences: Simple, Compound And Complex

27. ఈ క్రింది వాక్యములను పరిశీలించండి :
1. His courage won him honour.
2. The moon was bright and we coold see our way.
3. Night came on and rain fell heavily and we all got very wet..
4. They rested when evening came.
5. As the boxers advanced into the ring, the people said they would not allow them to fight.
6. Anil called at 5.30 and I told him that you had gone out.

1వ వాక్యములో ఒకే ఒక Subject మరియు ఒకే ఒక Predicate ఉన్నవి. దీనిని Simple Sentence అని అంటారు.
నిర్వచనం (Def): ఒకే ఒక Subject మరియు ఒకే ఒక Predicate ఉన్న వాక్యమును Simple Sentence అని అంటారు. లేక ఒకే ఒక Finite Verb (మితమైన క్రియాభావము) ఉన్నట్టి వాక్యమును Simple Sentence అంటారు అని కూడా చెప్పవచ్చును.

Sentences Simple Compound And Complex Definition And Types with Examples in Telugu

2వ వాక్యములో రెండు భాగములు ఉన్నవి :
(a) The moon was bright.
(b) We could see our way.
పై వాక్యములోని రెండు భాగములు కూడా Co-ordinating Conjunction అయిన ‘and’ అను పదముతో కలుపబడి యున్నవి.
ప్రతి భాగము కూడా ఒక Subject (కర్త) ను స్వతహాగా ఉన్న ఒక Predicate కలిగియున్నది. కావున ఈ ప్రతి భాగమును కూడా ఒక వాక్యము అని అంటాము. ఇలా ఏర్పడిన చిన్న వాక్యము పెద్ద వాక్యములో ఒక భాగంగా కూడా ఉంటుంది. కావున ఈ చిన్న వాక్యన్ని Clause అని అంటాము.
ప్రతి Clause దాని వరకు అది ఒక చిన్న స్వతంత్ర భావమును సంపూర్ణముగా ఇస్తుంది. కావున అది ఆ పరిస్థితిలో స్వతంత్రముగా నిలబడుతుంది. అది అపుడు Complete sentence లాగా కనిపిస్తుంది. ఇట్టి Clause ను Principal clause (ప్రధాన clause) అని గాని, Main Clause అని గాని పిలుస్తాము.
పైన వివరింపబడిన రెండవ వాక్యము Principal Clauses తో కలిపి రూపొందించబడినది. కావున దానిని Compound Sentence అని అంటాము.

Read and Learn more Synthesis of Sentences

3వ వాక్యములో మూడు Clauses ఉన్నవి. (ఉప వాక్యములు) అవి ఒకే order లోను మరియు ఒకే హోదా (rank) లోను ఉన్నవి. అనగా 3వ వాక్యము మూడు Principal Clauses ను కలిగి యున్నది. (a) We all got very wet.
(b) Night came on.
(c) Rain fell heavily.

నిర్వచనం (Def): రెండు లేక అంతకంటే ఎక్కువ Main Clauses ను కలిగియున్నచో అట్టి వాక్యమును Compound sentence అని అంటాము.గమనిక (Note) ఒక వాక్యములో రెండు Main Clauses ఉన్నచో Double అనే పదమును ప్రయోగించెదము. రెండు కంటె ఎక్కువ Clauses ఉన్నచో, ‘Multiple’ (వివిధములైన) అనే పదమును ప్రయోగించెదము.

4వ వాక్యములో రెండేరెండు చిన్న భాగములు ఉన్నవి.(a) They rested.
(b) When evening came.
పై వాక్యములో మొదటి భాగము మరియు రెండవ భాగము కూడా చెరియొక Subject మరియు చెరియొక Predicate ను కలిగి ఉన్నవి. (They + rested మరియు When evening + came)
‘The rested” అను Clause సంపూర్ణ భావమును ఇవ్వడమే కాక, స్వతంత్రముగా నిలబడుతుంది. కావున దీనిని కూడా Principal Clause లేక Main Clause అని పిలువవచ్చును.
‘when evening carne’ ఇది కూడా ఒక Clause అయి ఉన్నది. కాని అది స్వతంత్రముగా నిలబడలేదు. కావున సంపూర్ణమైన భావమును ఇవ్వజాలదు. అది ‘They rested’ అనే Clause పైన తన మనుగడకు ఆధారపడి ఉంది. కావున దీనిని Sub-ordinate Clause అని అంటాము.
4వ వాక్యమును Complex Sentence అని అంటాము.

5వ వాక్యములో మూడు Clauses ఉన్నవి.
(a) The people said. (Main Clause).
(b) As the boxers advanced into the ring. (Subordinate Adverb Clause.)
(c) They would not allow them to fight. (Subordinate Noun Clause.).
ఇటువంటి అయిదవ వాక్యమును కూడా Complex Sentence అని అంటాము.

నిర్వచనం (Def): Complex sentence లో ఒక Main Clause మరియు ఇంకొక Subordinate
Clause గాని లేక కొన్ని Subordinate Clauses గాని ఉండును.
(a) Anil called at 5.30 (Main Clause)
(b) I told him (Main Clause)
(c) That you had gone out (Subordinate Noun Clause)

28. ఈ క్రింది Compound వాక్యములను గమనించండి.
ఇచ్చట Co-ordinating Conjunctions తమ పనిలో సమామ హోదాలో ఉన్న Clauses ను కలుపుచున్నవి.
I shall do it now or I shall not do it at all.
He gave them no money nor did he help them in any way.
He threw the stone but it missed the dog.
He neither obtains success nor deserves it.
He is either mad or he has become a criminal.
I both thanked him and rewarded him.

అభ్యాసము 37
ఈ క్రింది వాక్యములలో ఏవి Compound వాక్యములు అయి ఉన్నవో, ఏవి Complex వాక్యములు అయివున్నవో తెలుపండి. Compound వాక్యముల విషయంలో వానిలోని Co-ordinating clauses విడదీసి, అచట ఉన్న conjunction ను పేర్కొనండి. Complex వాక్యము అయివున్నచో దానిని Clauses గా విడదీసి, అచ్చట Principal Clause ఏదో Subordinate Clause ఏదో పేర్కొనండి :-
1. The horse reared and the rider was thrown.
2. Walk quickly, else you will not overtake him.
3. The town in which I live is very large.
4. I called him, but he gave me no answer.
5. I went because I was invited.
6. Either he is drowned or some passing ship has saved him.
7. I returned home because I was tired.
8. He came oftener than we expected.
9. They always talk who never think.
10. A guest is unwelcome when he stays too long.
11. He blushes; therefore he is guilty.
12. He must have done his duty, for he is a conscientious
13. Whatever you do, do well. man.
14. He rushed into the field, and foremost fighting fell.
15. Where ignorance is bliss, ’tis folly to be wise.
16. Man proposes, but God disposes.
17. The heavens declare the glory of God,  and the He tried hard, but he did not succeed.
18. Listen carefully and take notes.
19. They serve God well who serve His creatures.
20.  firmament showeth His handiwork.
21.  firmament showeth His handiwork.
22. Quarrels would not last long if the fault were only on one side.
23. Man is guided by reason, and beast by instinct.
24. God made the country and man made the town.
25. There was one philosopher who chose to live in a tub.
26. He trudged on, though he was very tired.
27. I agree to your proposals, for I think them reasonable.
28. The Commons passed the bill, but the Lords threw it out.
29. Tell me the news as you have heard.
30. He that has most time has none to lose.
31. Your arguments are weighty; still they do not convince me.
32. Everything comes, if a man will only work and wait.
33. The same day went Jesus out of the house, and sat by the sea-side.
34. We must eat to live, but we should not live to eat.
35. Govern your passions or they will govern you.
36. They [rats] fought the dogs, and killed the cats.
And bit the babies in the cradles,
And ate the cheese out of the vats.
And licked the soup from the cook’s own ladles.
37. My heart leaps up when I behold a rainbow in the sky.

Leave a Comment