The Sentense
1. మనము మాట్లాడుకొనునపుడు గాని, వ్రాయునపుడు గాని మాటలను వాడుతాము. సాధారణంగా ఈ మాటలను విడివిడిగా కాకుండా క్రింద పేర్కొన్న విధంగా సామూహికంగా వాడుతుంటాము.
Little Jack Horner sat in a corner.
ఈ విధంగా వాడిన పదముల సముదాయాన్ని వాక్యము అని అంటాము. ఇటువంటి పదముల సముదాయం పూర్తిగా అర్ధవంతం అయినట్లయితేనే దానిని వాక్యం అని అంటాము. |
వాక్యములలోని రకములు
2. వాక్యములు నాలుగు విధములు :
1. వివరించునవి లేక నొక్కివక్కాణించునవి :Humpty Dumpty sat on a wall.
2. ప్రశ్నలు అడుగునవి :Where do you live?
3. ఒక అజ్ఞనుగాని (command), విన్నపమును గాని (request) బ్రతిమాలుటను గాని (entreaty) తెలియజేయునవి
- Be quiet.
- Have mercy upon us.
4. బలమైన మానసిక భావాలను (sudden and intense feelings) తెలియజేయునవి :
- How cold the night is!
- What a shame 1
ఒక statement ను నొక్కి వక్కాణించే మాటల సముదాయాన్ని కాని ఇచ్చువానిని Declarative లేక Assertive వాక్యములు అని అంటాము.
ప్రశ్నను అడుగు వాక్యమును interrogative sentence అని అంటాము.
ఆజ్ఞను ఇచ్చు వాక్యమునుగాని విన్నపము చేయు వాక్యమునుగాని imperative (ఆవశ్యమైన) sentence అని అంటాము. ఆకస్మికముగా ఒక అభిప్రాయమును (strong feeling) బయటికి చెప్పు వాక్యమును Exclamatory sentence అని అంటాము.
Read and Learn more English Grammar Topics
అధ్యాయము 2
Subject And Predicate
3. మనము ఒక వాక్యాన్ని వ్రాయునపుడు గాని మాట్లాడునపుడు గాని
(1) ఒక వ్యక్తికి గాని ఒక వస్తువుకు గాని పేరు ఇవ్వడం జరుగుతుంది.
(2) ఆ వ్యక్తి గురించిగాని ఆ వస్తువు గురించి గాని ఏదో కొంత చెప్పడం జరుగుతుంది.
ఇంకో విధంగా చెప్పాలంటే, వాక్యములో పేర్కొనడానికి subject (కర్త) ఉండాలి. అదే విధంగా ఆ వ్యక్తిని గురించి గాని ఆ వస్తువును గురించి గాని ఏదో కొంత చెప్పే predicate వుండాలి. అంటే ప్రతి వాక్యంలో రెండు ప్రధాన భాగములు ఉంటాయి :-
(1) మనము మాట్లాడే వ్యక్తి గాని వస్తువుగాని ఉన్నట్టిది మొదటి భాగము. దీనిని subject అంటారు
(2) Subject ను గురించి చెప్పునది రెండవ భాగము. దీనిని predicate అంటారు.
4.సాధారణంగా వాక్యములోని subject భాగము వాక్యమునకు మొదట ఉంటుంది కాని కొన్ని సార్లు మాత్రం predicate తర్వాత subject వస్తుంది.
- Here comes the bus.
- Sweet are the uses of adversity.
5.Imperative sentences లో (అవశ్యము ఈ పని చేయవలయును అని చెప్పునవి) subject ను వదలి వేయడం జరుగుతుంది.
- Sit down.[Here the Subject You is understood]
- Thank him.[Here too the Subject You is understood]
అభ్యాసము 1
ఈ క్రింది వాక్యములలో Subject ను Predicate లను వేరు చేయండి
1. The crackling of geese saved Rome.
2. The boy stood on the burning deck.
3. Tubal Cain was a man of might.
4. Stone walls do not make a prison.
5. The singing of the birds delights us.
6. Miss Kitty was rude at the table one day.
7. He has a good memory.
8. Bad habits grow unconsciously.
9. The earth revolves around the Sun.
10. Nature is the best physician.
11. Edison invented the phonograph.
12. The sea hath many thousand grains of sand.
13. We cannot pump the ocean dry.
14. Borrowed garments never fit well.
15. The early bird catches the worm.
16. All matter is indestructible.
17. Islamabad is the capital of Pakistan.
18. We should profit from experience,
19. All roads lead to Rome.
20. A guilty conscience needs no excuse.
21. The beautiful rainbow soon faded away.
22. No man can serve two masters.
23. A sick room should be well-aired.
24. The dewdrops glitter in the sunshine.
25. I shot an arrow into the air.
26. A barking sound the shepherd hears.
27. On the top of the hill lives a hermit.
అధ్యాయము 3
The Phrase And The Clause
6. “In a corner” అను పదసముదాయమును పరిశీలించండి. దీనిని Phrases అని అంటారు. Phrase అనగా మూడు, నాలుగు పదములు ఉన్న పదబంధము అని అర్ధము. Phrases అర్థయుత మైనప్పటికి, అవి స్వతహాగా పూర్తి అర్ధాన్ని యివ్వవు. Italics ఉన్న యీ క్రింది పద సముదాయములను (జట్టులు) Phrases అని అంటారు.
- The sun rises in the east.
- Humpty Dumpty sat on a wall.
- There came a giant to my door.
- It was a sunset of great beauty.
- The tops of the mountains were covered with snow.
- show me how to do it.
7. talics ప్రింటులో నున్న ఈ క్రింది phrasesను పరిశీలించండి :
- He has a chain of gold.
- He has a chain which is made of gold.
పై రెండు వాక్యములలో మొదటి వాక్యములో నున్న “of gold” అను రెండు పదముల జంటను phrase అని అంటాము. రెండవ వాక్యములోని which is made of gold అను అయిదు మాటల సమూహమును Clause అని అంటాము.
ఈ క్రింది వాక్యములలో పై విధంగా group గా ఉన్న పదములను clauses అంటాము.
- People who pay their debts are trusted.
- We cannot start while it is raining.
- I think that you have made a mistake.
అధ్యాయము 41
Parts Of Speech
8. వాక్యములలోని పదములను వివిధములైన పేర్లతో విభజించడం జరిగింది. Grammer లో యీ విభజనను Parts of speech అని అంటాము. ఆ పదములకు గల వివిధమైన గుర్తింపులు అవి వాక్యములో చేయు పనులను బట్టి (duties) వచ్చినవి. ఈ గుర్తింపులు ఎనిమిది. అవి యివి :-
1)Noun (నామవాచకము)
2)Adjective (విశేషణము)
3)Pronoun (సర్వనామముnoun కు బదులుగా వచ్చునది)
4)Verb (క్రియ or action word)
5)Adverb (క్రియా విశేషణము అనగా verb నకు యింకొంత అర్ధమును కలుపునది.) 6) Preposition (విభక్త్యర్ధకమైన అవ్యయము. విభక్తులు అని కూడా అంటాము)
7)Conjunction (కలుపునది అనగా సముచ్ఛయము)
8)Interjection (సంతాపాద్యర్థకము అనగా సంతాపమును తెలియచేయునది) అయ్యో! అను భావము.
9)Noun. ఒక మనిషి యొక్క పేరును గాని, ఒక ప్రదేశము యొక్క పేరును గాని, ఒక వస్తువు యొక్క పేరును గాని తెలియజేయు పదమును నామవాచకము (Noun) అంటారు.
- Akbar was a great King.
- Kolkata is on the Hooghly.
- The rose smells sweet.
- The sun shines bright.
- His courage won him honour.
గమనిక (Note): వస్తువు అనగా
(1) మనము కంటితో చూచునది, వినునది, చేతితో తాకబడునది, వాసన చూడబడునది మొదలయినవి.
(2)మనం ఊహించగలిగినవి, తాకలేనివి మరియు చూడ వీలు కానట్టివి. వీనిని English లో abstract nouns అని అంటారు. మనస్సుతో ఊహించుకోవాలి.
10. Adjective: నామవాచకమునకున్న అర్ధమునకు మరికొంత అర్ధమును కలిపిన పదమును Adjective అని అంటారు.
- He is a brave boy.
- There are twenty boys in this class.
11. Pronoun: నామవాచకమునకు బదులుగా వాడు పదమును Pronoun (సర్వనామము) అని అంటారు.
John is absent, because he is ill.
The books are where you left them.
12. Verb: ఒక పనిని గాని విషయమును గాని తెలియజేయు పదమును Verb అంటారు. Verb లో action (క్రియ) ఉంటుంది.
The girl wrote a letter to her cousin.
Kolkata is a big city.
Iron and copper are useful metals.
13.Adverb (క్రియా విశేషణము).:Verb కు గాని, Adjective కు గాని, లేక యింకొక Adverb కు గాని మరికొంత భావమును కలుపు పదమును Adverb అని అంటారు. (add + verb = adverb)
He worked the sum quickly.
This flower is very beautiful.
She pronounced the word quite correctly.
14. Preposition. (విభక్తి ప్రత్యయము). Noun గాని pronoun గాని మరియొక పదముతో సంబంధము కలిగి యుండును. యీ సంబంధమును తెలియజేయు పదమును Preposition అంటారు.
There is a cow in the garden.
The girl is fond of music.
A fair little girl sat under a tree.
15. Conjunction (సముచ్చయము). రెండు పదములను గాని, రెండు వాక్యములను గాని కలుపు పదమును Conjunction అని అంటారు.
Rama and Hari are cousins.
Two and two make four.
I ran fast, but missed the train.
16. Interjection (ఆశ్చర్యార్ధకము). అకస్మాత్తుగా మనలో ఉద్భవించు భావావేశమును (intense feeling) తెలియజేయు పదమును Interjection అని అంటారు.
Hurrah! We have won the game.
Alas she is dead.
17. A, an, the, this, that, these, those, every, each, some, any, my, his, one, two అను పదములను Determiners అని అంటారు. కొన్ని Modern Grammars లో determiners ను కూడా part of speech గా గుర్తిస్తున్నారు. యివి వాని తరువాత follow అయ్యే నామవాచక భావమును కొంత తగ్గించును. ఈ గ్రామరు పుస్తకములో a, an మరియు the తప్ప మిగిలిన పై determiners ను adjective గా పరిగణించడం జరిగింది.
18. ఆయా పదములు అవి వాక్యములో చేయు పనిని బట్టి అవి ఏ part of speech కి చెందినవో గుర్తించవచ్చు. కావున ఏ పదము ఏ part of speech కి చెందినదో వాక్యమును చూడకుండా చెప్పడం కష్టము.
They arrived soon after. (Adverb)
They arrived after us. (Preposition)
They arrived after we had left. (Conjunction)
పైన ఇచ్చిన మూడు ఉదాహరణలను గమనించండి. ఒకే పదాన్ని వేరు వేరు వాక్యాల్లో వేరు వేరు parts of speech గా ఉపయోగించడం జరిగింది.
|అభ్యాసము 2
ఈ క్రింది వాక్యములలో Italics ప్రింటులోనున్న పదములు ఏ భాషా విభాగమునకు చెందినవో రాయుచూ, అందుకు గల కారణములను కూడా పేర్కొనండి :
1. Still waters run deep.
2. He still lives in that house.
3.After the storm comes the calm.
4.The after effects of the drug are bad.
5.The up train is late.
6.It weighs about a pound.
7.He told us all about the battle.
8. He was only a yard off me.
9. Suddenly one of the wheels came off.
10.Mohammadans fast in the month of Ramzan.
11.He kept the fast for a week
12.He is on the committee..
13. Let us move on.
14.Sit down and rest a while.
15. I will watch while you sleep.
అధ్యాయము 5
The Noun :Kinds Of Nouns
19. ఒక వ్యక్తి యొక్క పేరును గాని, ఒక ప్రదేశము యొక్క పేరును గాని, ఒక వస్తువు యొక్క పేరును గాని తెలియజేయు పదమును నామవాచకము (Noun) అందురు.
గమనిక (Note: మన ఆలోచనలోనికి వచ్చు భావము కూడా భావపూరితమైన “thing” అవుతుంది. (Abstract Noun). వీనిని మానసికంగా మాత్రమే ఊహించుకోవాలి.
20. ఈ క్రింది వాక్యములను గమనించండి:
Asoka was a wise king.
ఒక ప్రత్యేకమైన గుర్తింపుగల రాజును మనము Asoka అని పిలిచాము. కాని యింకొక పదమైన ‘King’ అను పదముతో యితర రాజులను గురించి కూడా పేర్కొనవచ్చును. ఇచ్చట Asoka అను పదము Proper noun అవుతుంది. King అను పదము అందరు రాజులకు చెందుతుంది కావున common noun అవుతుంది. ఎందుకంటే king అను ఆ పదముతో ఎవరినయినా పిలవవచ్చును కాబట్టి.
అదే విధంగా : –
Sita is a Proper Noun, while girl is a Common Noun.
Hari is a Proper Noun, while boy is a Common Noun.
Kolkata is a Proper Noun, while city is a Common Noun.
India is a Proper Noun, while country is a Common Noun.
‘Girl’ అను పదము common noun. ఎందుకంటే ఆ మాటతో ఏ అమ్మాయిని అయినా పిలువవచ్చును. కాని యిచ్చట
‘Sita’ అను పేరుతో ఒకే ఒక గుర్తింపుగల అమ్మాయిని పిలుస్తాము. అంటే ‘Sita’ అను పదము proper noun.
Proper అనగా తనకు చెందిన అనే అర్ధం వస్తుంది కదా !
Definition. ( నిర్వచనము) – ఒకే రకానికి చెందిన వ్యక్తులనుగాని, వస్తువులనుగాని ఒకే పేరుతో పిలిచినట్లయితే, ఆ పదమును Common Noun అంటారు. ఒకే పేరుతో అందరిని పిలవడానికి వీలయినప్పుడు అట్టి పదము Common Noun జాబితా లోనికి వస్తుంది.
Definition. ( నిర్వచనము). ఒకే ఒక వ్యక్తికిగాని ప్రదేశానికిగాని చెందిన పేరును proper noun అని అంటాము. Proper అనగా ఒకే వ్యక్తి యొక్క గాని ప్రదేశము యొక్క గాని గుర్తింపునకు (గ్రామరులో స్వంతము అని అర్ధము.
Note. 1. Proper noun కు మొదటి అక్షరము capital letter ఉపయోగించాలి.
Note. 2. Pronouns ను కొన్నిసార్లు common nouns గా కూడా గుర్తిస్తున్నారు.
1. He was the Lukman (= the wisest man) of his age.
2. Kalidas is often called the Shakespeare (= the greatest dramatist) of India.
Collective nouns మరియు abstract nouns, common nouns లో భాగమే.
21. మనుష్యుల గుంపునుగాని, కొన్ని వస్తువుల సముదాయమునుగాని ఏకంగా ఒక్క పదంలో తెలియజేయు పదాలను Collective Nouns అంటారు.
Crowd, mob, team, flock, herd, army, fleet, jury, family, nation, parliament, committee.
A fleet= a collection of ships or vessels.
An army= a collection of soldiers.
A crowd= a collection of people.
The police dispersed the crowd.
The French army was defeated at Waterloo.
The jury found the prisoner guilty.
A herd of cattle is passing.
22. ఒక లక్షణమును గురించి గాని, ఒక చర్యను (action) గురించి గాని, ఒక పరిస్థితిని (State or condition) గురించి గాని చెప్పు పదమును Abstract nouns అని అంటారు. ఇవి భావరూపములు.
Quality – Goodness, kindness, whiteness, darkness, hardness, brightness, honesty, wis- dom, bravery. (మంచి తనము, జాలి, తెలుపు, చీకటి, గట్టితనము, కాంతి, నిజాయితీ, జ్ఞానము, ధైర్యము)
Action.- Laughter, theft, movement, judgement, hatred. (నవ్వు, దొంగతనము, కదలిక, తీర్పు, ద్వేషము) Laughter లో నవ్వు భావరూపం. Laughing అను verb లో నవ్వు కార్యరూపము.
State.- Childhood, boyhood, youth, slavery, sleep, sickness, death, poverty. (పసితనము, బాల్యము, యవ్వనము, బానిసత్వము, నిద్ర, జబ్బు, మరణము, బీదతనము)
Arts (కళల పేర్లు), Sciences (శాస్త్రముల పేర్లు), (grammer, music, chemistry మొదలగు పదములు) కూడా Abstract nouns (వ్యాకరణము, సంగీతము, రసాయనశాస్త్రము)
కంటికి కనిపించనివి, చేతికి చిక్కనివి, కేవలం మనస్సుతో మాత్రమే అవగాహన చేసుకోగలిగిన వన్నియు Abstract nouns. Abstract nouns ను అర్ధం చేసుకోవడానికి యింకొక ఆధారము కావలయును. “మరణము” అను పదము (death) Abstract Noun కాని మరణము అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి యింకొక వస్తువయిన శవము కావలయును. మరణమును గాని, నవ్వును గాని ఇతర abstract nouns ను గాని ఒక చోటి నుండి ఇంకొక చోటికి మార్చజాలము. అలానే పర్వతము, సముద్రము, గాలి మొదలగు పంచభూతములను కూడా ఇంకొక చోటికి మార్చజాలము. ఒక విద్యార్ధి యొక్క తెలివిని కంటితో చూడగలమా? ఒక చోటినుండి ఇంకొక చోటికి మార్చగలమా? Marks
sheet ను బట్టి మాత్రమే తెలుసుకుంటాం.
23. Abstract Nouns ఈ క్రింది విధముగా form అవుతాయి.
1. Adjectives నుండి
Kindness from kind; honesty from honest.
(kindness – దయ (Abstract Noun. He has kindness అతనికి దయ ఉన్నది.
(kind) దయగల (Adjective) He is a kindman. అతను దయగల వాడు.
ఎటువంటివాడు అనేదాని జవాబు. He అనే pronoun ను వర్ణిస్తుంది.
2. Verbs నుండి Obedience from obey, growth from grow.
3. Common nouns Childhood from child;
slavery from slave.
slave 3 (common noun)
skavery (abstract noun) బానిసత్వము.
ఇచ్చట slavery అను పదము ఒకరి పరిస్థితిని తెలియచేస్తుంది కదా!
24. Nouns కు ఇంకొక వర్గీకరణ (classification) కూడా ఉన్నది. అవి countable nouns (లెక్కించదగినవి) మరియు unaccountable nouns (లెక్కించవీలు కానివి)
Countable Nouns: book, pen, apple, boy, sister, doctor, horse.
Uncountable nouns: milk, oil, sugar, gold, honesty
Countable Nouns కు ఏకవచన – బహువచన రూపములు ఉన్నవి. కాని Uncountable nouns కు ఏకవచన – బహువచన రూపములు లేవు. ఇన్ని లీటర్ల పాలు అంటాముగాని, ఇన్ని చుక్కల పాలు అనము.
అభ్యాసము 3
ఈ క్రింది వాక్యములలో nouns ను గుర్తించి వాటి వర్గీకరణను (classification) పేర్కొనుము.
1. The crowd was very big..
2. Always speak the truth.
3. We all love honesty.
4. Our class consists of twenty pupils.
5. The elephant has great strength.
6. Solomon was famous for his wisdom.
7. Cleanliness is next to godliness.
8. We saw a fleet of ships in the harbour.
9. The class is studying grammar.
10. The Godavari overflows its banks every year.
11. A committee of five was appointed.
12. Jawaharlal Nehru was the first Prime Minister of India.
13. The soldiers were rewarded for their bravery.
14. Without health there is no happiness.
15. He gave me a bunch of grapes.
16. I recognized your voice at once.
17. Our team is better than theirs.
18. Never tell a lie.
19. Wisdom is better than strength.
20. He sets a high value on his time.
21. I believe in his innocence.
22. This room is thirty feet in length.
23. I often think of the happy days of childhood.
24. The streets of some of our cities are noted for their crookedness.
25. What is your verdict, gentlemen of the jury?
అభ్యాసము 4
ఈ క్రింది వానికి collective noun పదములు రాయండి.
(1) Cattle
(2) Soldiers
(3) Sailors
Adjectives గా బాలురకు ఉన్న ఈ క్రింది లక్షణములను abstract nouns గా మార్చి వ్రాయుము.
(1) Lazy
(2) Cruel
(3) Brave
(4) Foolish
అభ్యాసము 5
క్రింద ఇవ్వబడిన adjectives ను abstract nouns గా మార్చి వ్రాయుము.