Analysis Of Simple Sentences
1. ఒక వాక్యము అనగా కొన్ని పదముల సముదాయము అయి ఉండి, ఒక సంపూర్ణమైన అర్ధమును ఇచ్చునట్టిది అని మనము ఇంతకు ముందు చదివియున్నాము. ఇలా ఒక వాక్యమునకు భాష్యము చెప్పుకోవడములో మొదటి ఘట్టము వాక్యమును రెండుగా విభజించుట మొదటి భాగమును Subject అని అంటారు. రెండవ భాగమును Predicate అని అంటారు.
ఆ మొదటి భాగమును గురించి వివరముగా చెప్పునది predicate. దీనిలో verb, object మొదలగునవి ఉండును. ఇది మెదటి భాగమునకు భాష్యము అని మనము చెప్పుకొనవచ్చును.
No. | SUBJECT | PREDICATE |
1 | Dogs | bark. |
2 | The sun | gives light |
3 | The child | is dead. |
4 | The boys | made Rama captain |
5 | My father | gave me a watch |
6 | The flames | spread everywhere |
7 | The flames | spread in every direction |
8 | The hour to prepare lessons | has arrived |
Subject భాగములో ఒక పదము గాని, కొన్ని పదములు గాని ఉండవచ్చును. పై పట్టికలో నున్న ఒకటవ example లో dog అను ఒకే ఒక నామవాచక పదము subject గా ఉన్నది. అదే పట్టికలోని 8వ ఉదాహరణలో అయిదు పదములు ఉన్న subject ఉన్నది. ఈ అయిదు మాటలలో ప్రధానమైనది నామవాచకముగా నున్న ‘hour’ అను పదము.
వాక్యములో Predicate భాగములో కూడా ఒకే ఒక పదముగాని, కొన్ని పదములుగాని ఉండవచ్చును. పై పట్టిక లోని మొదటి వాక్యములోని predicate లో ఒకే ఒక verb పదము అయిన ‘bark’ ఉన్నది. అదే పట్టికలోని అయిదవ ఉదాహరణలో నాలుగు మాటల కలయిక అయిన predicate భాగము ఉన్నది. ఇందులో ప్రాముఖ్యమైన పదము verb అయిన gave
Read and Learn more Synthesis of Sentences
అభ్యాసము 1
ఈ క్రింది వాక్యములలో subject భాగమును,predicate భాగమును విడదీయండి:-
1. The cackling of geese saved Rome,
2. All matter is indestructible.
3. Stone walls do not a prison make.
4.No man can serve two masters.
5. A sick room should be well aired.
6. I shot an arrow in the air.
7. A barking sound the shepherd hears.
8. Up went the balloon.
9. The naked everyday he clad.
10. Into the street the piper stepped.
11. Sweet are the uses of adversity.
12. Dear, gentle, patient, noble Nell was dead.
2. Subject భాగములో చాలా పదములు ఉన్నప్పుడు, అందులో ఒక పదము మాత్రము ప్రాముఖ్యమును సంతరించుకున్నదై ఉంటుంది. ఇలా ప్రాధాన్యతను సంతరించుకున్న పదమును Subject-word లేక Simple- Subject అని అంటారు. ఈ క్రింది వాక్యములో Noun గానున్న ‘child’ అను పదము Subject-word .
The little child, tired of play. / is sleeping.
ఈ Subject-word సర్వసాధారణంగా Noun అయి ఉంటుంది.
ఇట్టి Subject-word గాని, ఆ పాత్ర ధరించిన group of words గాని నామవాచకపు పనిని చేయును.
He / tried his best.
The rich / are not always happy.
Talking overmuch / is a sign of vanity.
To err/is human.
To find fault is easy.
3. ఈ సంయుక్త Subject పదములలో Subject-word ను వివరించే Adjective ను Noun యొక్క Enlargement అనిగాని(విపులీకరించునది – వివరించునది) లేక Attribute (ఒక భావమును ఆరోపించునది)
అని గాని అంటారు. ఈ విధంగా :
1. New brooms / sweep clean.
2. Barking dogs / seldom bite.
3. Hari’s father is an engineer.
4. My views / are quite different.
5. Firdousi, the poet, / wrote the Shah Namah.
6. A desire to excel is commendable.
7. A stitch in time / saves nine..
ఇచ్చట Adverb ఉండి తన పనిని తాను చేసుకొనిపోవునపుడు దానిని Adverb-equivalent అని అంటారు.
SUBJECT | PREDICATE | ||
No. | Subject-word | Attribute | sweep clean. |
brooms | New | seldom bite. | |
1 | dogs | Barking | is an engineer. |
2 | father | Hari’s | are quite different. |
3 | views | My | wrote the Shah Namah. |
4 | Firdousi | the poet | is commendable. |
5 | desire | (1) A | |
(2)to excel | |||
6 | stitch | (1) A | saves nine. |
(2)in time |
ఈ క్రింది ఉదాహరణలను గమనించండి :-
1వ ఉదాహరణలో Attribute (వర్ణన ఇచ్చిన పదము)
2వ ఉదాహరణలో Attribute పదము Participial Adjective అయి ఉన్నది. “Barking ఇచ్చోట verb పనిని చేయుచున్నది మరియు కుక్కను వర్ణించుచున్నది కూడాను. కావున ఇది participle మరియు adjective లక్షణములు కలిగియున్నది. కావున దీనిని Participial Adjective అని అంటాము.
3వ ఉదాహరణలో Attribute పదము నామవాచకము అయి ఉండి Possessive Case గాను లేక Genitive (Verbal Noun) గాను ఉన్నది. “Hari’s లేక వారి యొక్క ” అని అన్నపుడు హరి యొక్క ఆస్థిహక్కును వివరిస్తుంది కదా! కావున Possessive లక్షణము వచ్చినది కదా! కావున Possessive Case లక్షణమును ఆపాదించుకొన్నది.
4వ ఉదాహరణలో Attribute పదము Possessive Adjective గా నున్నది. “views అనగా అభిప్రాయములు” నావి అనే భావము ఇచ్చట ఉన్నది. కావున “My” అను పదమును Possessive Adjective అని అంటాము. “Possessive” అనగా ఆస్థిహక్కును తెలియజేయు భాషా విభాగము.
5వ ఉదాహరణలో Attribute పదమును పొందికగానున్న Noun (Noun in Apposition) అని అనబడును. “poet అనగా కవి” అను పదము ఫిర్దేశీని వివరిస్తుంది. కావున ఈ “poet” అను పదమును “Apposition” పదము అని అంటాము.
6వ ఉదాహరణలో Attribute పదము Gerundial Infinitive అయి ఉన్నది. అనగా Verb గా నుండి ఆ భావమును అనంతముగా పెంచుకుపోతూ ఉన్నట్టిది.
7వ ఉదాహరణలో Attribute పదములు ఒక group of words ను కలిగియుండి Adjective యొక్క పాత్రను పోషించుచున్నవి.
గమనిక (Note): పైన చూపబడిన ఉదాహరణలో a, am, the అనునవి attribute గా పనిచేయుచున్నవి. కాని కొన్ని సందర్భములలో వానిని Subject-word యొక్క భాగములు అని కూడా అంటారు.
అభ్యాసము 2
ఈ క్రింది వాక్యములలో complete Subject పదములను గుర్తించండి. తరువాత Attributes నుండి Subject-word ను వేరుచేయండి.
1. The boy, anxious to learn, worked hard.
2. A burnt child dreads the fire.
3. Birds of a feather flock together.
4. The attempt to scale the fort was an utter failure.
5. The days of our youth are the days of our glory.
6. Ill habits gather by unseen degrees.
7. The dog, seizing the man by the collar, dragged him out.
8. The streets of some of our cities are noted for their crookedness.
9. A house divided against itself cannot stand.
10. Deceived by his friends, he lost all hope.
11. The man carrying a hoe is a gardener.
12. One man’s meat is another man’s poison.
13. My days among the Dead are past.
14. With his white hair unbonneted, the stout old sheriff comes.
4. సాధారణంగా verb మరియు object ఉన్న భాగమును Predicate అంటారు. Predicate లో ఒక పదముగాని, మరికొన్ని పదములుగాని ఉండటాన్ని మనం ఇంతవరకు చదివియున్నాము. Predicate లో ఒకే పదము ఉన్నపుడు అది తప్పనిసరిగా క్రియాపదము (verb) అయి ఉంటుంది. Verb లేకుండా ఏమీ చెప్పలేము కదా!
Predicate లో కొన్ని పదములు ఉన్నపుడు, వానిలో అతి ముఖ్యమైన పదము verb పదము అయి ఉంటుంది. అట్టి పరిస్థితులలో దానిని Predicate word అంటాము.
5. Adjective పదముగాని, Adjective భావము గాని కలిగిన ఇంకొక పదముగాని Subject-word ని వర్ణిస్తుంది. ఇదే విధముగా Predicate లోనున్న verb పదము Adverb చేతగాని, Adverb భావము కలిగిన ఇంకొక పదము చేతగాని వర్ణింపబడుతుంది. దీనిని Extension లేక Adverbial Qualification అంటారు.
The flames spread everywhere.
He went home.
He rose to go.
The flames spread in every direction.
Spring advancing, the swallows appear.
SUBJECT | PREDICATE | |||
No. | Subject-word | Attribute | Verb | Adverbial |
Qualification | ||||
1 | flames | The | spread | everywhere. |
2 | He | went | home. | |
3 | He | rose | to go. | |
4 | flames | The | spread | in every direction. |
5 | swallows | The | appear | Spring advancing. |
ఈ క్రింది ఉదాహరణలను గమనించండి :-
1వ వాక్యములో Adverbial Qualification పదము Adverb అయి ఉన్నది. ఈ పదము “ఎక్కడెక్కడ” అనే భావాన్ని ఇచ్చుచున్నది.
2వ వాక్యములో Adverbial Qualification పదము Adverbial Accusative అయి ఉన్నది. (ఎక్కడికి వెళ్ళెను అను ప్రశ్నకు సమాధానం ఇచ్చుచున్నది)
3వ వాక్యములో Adverbial Qualification పదము Gerundial Infinitive అయి ఉన్నది. Gerundial Infinitive అనగా verb భావమును ఇచ్చుచున్న అనంతమైన భావము అని అర్ధము. “to go” అనగా వెళ్ళుటకు అని అర్ధం. ఎంత దూరం వెళ్తాడు అని ఇచ్చట ఇదమిద్దంగా చెప్పబడ లేదు ఎంత దూరం అయినా వెళ్ళవచ్చు అనే అనంతమైన భావము ఉన్నది గావున ఇది infinitive. Infinitive అనగా అనంతమైన భావమును ఇచ్చు పదము అని అర్ధం.
4వ వాక్యములో Adverbial Qualification పదము Adverb పనిని చేయుచున్న కొన్ని పదముల సమూహము. “In every direction” అను పదములు 3 మాటల సముదాయము – అన్నివైపులా మంటలు వ్యాపించినవి అని అర్ధం. ఇచ్చట ఈ Adverb భావము place అనగా దిక్కులను గురించి చెబుతున్నది.
5వ వాక్యములో Adverbial Qualification పదము Absolute Phrase అయి ఉన్నది. (సంపూర్ణ భావమును ఇచ్చునది)
అభ్యాసము 3
ఈ క్రింది వాక్యములలో Adverbial Qualification పదములను గుర్తించండి. ప్రతి పదము Adverb అవునా కాదా, Adverbial Accusative అవునా కాదా, లేక ఒక Gerundial Infinitive అవుతుందా, కొన్ని పదముల సమూహమై ఉండి Adverb యొక్క పనిని చేయుచున్నవా, లేక Absolute Phrase అయి ఉన్నదా అని వివరంగా చెప్పండి.
1. She spoke distinctly.
2. He spoke in a distinct voice.
3. The boy ran a mile.
4. The postman called again.
5. Help a lame dog over a stile.
6. Wait a minute.
7. He has come to stay.
8. I recognized your voice at once.
9. The book is printed in clear type.
10. The tide having turned, the ship set sail.
11. He sold his horse below its value.
12. He leaves two children behind him.
13. He gets his living by trade.
14. He made his money by trade.
15. The enemy disputed the ground inch by inch.
16. He saw a new world spread about him.
17. The village life suited him in all respects.
18. Him will I follow to the ends of the earth.
6. Predicate భాగములోని Verb పదము Intransitive అయి ఉన్నచో, అట్టి పదము ఒంటరిగా తనంతట తాను Predicate గా ఏర్పడును.
Dogs/bark. Black clouds / are gathering. The boys / have been reading.
గమనిక (Note: 1వ వాక్యములో Verb ఒకే పదముగా నుండి Predicate అగుచున్నది. 2 మరియు 3వ వాక్యములలో మాదిరిగా Verb సాధారణంగా రెండు లేక అంతకంటే ఎక్కువ పదములను కలిగియున్నది. 7. కొన్ని సందర్భములలో Predicate లో నున్న ఒంటరి Verb పదము Intransitive Verb అయి ఉండి (భావము ఉన్నచోటనే ఉండునది) భావమును అసంపూర్ణముగా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక Noun ను గాని, Adjective ను గాని, Pronoun ను గాని కలిపినచో భావము సంపూర్ణము అగును ఈ విధంగా :
The baby seems/happy.
The baby seems అని అన్నాము అనుకోండి. ఇచ్చట సంపూర్ణార్ధము రాదు. Intransitive Verb అయిన “seems” అను పదమునకు తోడు కావలయును. ఈ విధముగా తోడుగా వచ్చిన పదమును Complement అని అంటాము.
ఇలా Complement గా ప్రవేశించిన పదము Subject ను సంపూర్ణముగా వివరిస్తుంది. కావున దీనిని Subjective Complement’ అని అంటాము.
ఈ క్రింది వాక్యములను పరిశీలించండి :-
The sky grew dark.
Venus is a planet.
It is me.
The man seems worried.
Your book is there.
The house is to let.
The building is in a dilapidated condition.
SUBJECT | PREDICATE | |||
No. | Subject-word | Attribute | Verb | Complement |
1 | sky | The | grew | dark |
2 | Venus | is | a planet | |
3 | It | is | me | |
4 | man | The | seems | worried |
5 | book | Your | is | there |
6 | house | The | is | to let |
7 | building | The | is | in a dilapidated condition |
మనం పైన గమనించదగ్గ విషయములు
1వ ఉదాహరణలో Complement పదము Adjective అయి ఉన్నది. ఆకాశము నల్లగానున్నది అని వర్ణించుచున్నది.
2వ ఉదాహరణలో Complement పదము Noun గా వ్యవహరించుచున్నది. గ్రహమును planet అంటాము. భూమి కూడా ఒక గ్రహమే – కావున ఇచ్చట planet నామవాచకము.
3వ ఉదాహరణలో Complement పదము Pronoun అయి ఉన్నది. “me” అను పదము ఇచ్చట ‘నేను’ అను భావమును ఇచ్చుచున్నది కావున Pronoun .
4వ ఉదాహరణలో Complement పదము Participle గా ఉన్నది. worried అను పదము ఇచ్చట బాధపడుచున్నట్లుగా అనే భావాన్ని సంతరించుకొన్నది. కావున అది predicate లో ఒక భాగము.
5వ ఉదాహరణలో Complement పదము Adverb గా నున్నది. “there” అను పదము ‘అచ్చట’ ఉన్నది అనే భావాన్ని ఇచ్చుచున్నది. ‘అచ్చట’ adverb అవుతుంది దూరమును వివరిస్తుంది గావున.
6వ ఉదాహరణలో Complement పదము Infinite గా నున్నది. ఇచ్చట complement పదము “to let” అయిఉన్నది. “to let” అనగా విడుదల చేయుటకు అని అర్థం. ఇచ్చట Infinitive అనగా అనంతమైన భావం ఉన్నది. ఎప్పటికి లేక ఎంత ధరకు అద్దెకు ఇవ్వడం అని ఖచ్చితంగా చెప్పలేదుగాబట్టి.
7వ ఉదాహరణలో Complement పదము కొన్ని పదముల కలయికగా నుండి Adjective గా పనిచేయుచున్నది. ఇచ్చట శిథిలావస్థలోనున్న భవనము అనే భావం ఉన్నది. ఇది వర్ణన కావున Adjective అగుచున్నది. Dilapidated అనగా శిధిలావస్థలోనున్న అని అర్ధం.
గమనిక (Note: ఒక Adjective ను ఉపయోగించి Predicate ను పూర్తి చేసిన సందర్భములో అట్టి Adjective ను Predicative adjective అని అంటారు.
ఒక నామవాచక పదమును ఉపయోగించి Predicate ను పూర్తిచేసిన సందర్భములో అట్టి నామవాచక పదమును Predicative Noun అని అంటారు.
అభ్యాసము 4
ఈ క్రింది వాక్యములలోని Complement పదములను గుర్తించండి. తరువాత ఆ Complement ప్రతీది Noun అవుతుందా లేక Adjective అవుతుందా, లేక Pronoun అవుతుందా వివరించండి.
1. John became a soldier.
2. Roses smell sweet.
3. The child appears pleased.
4. The workman seems tired.
5. The earth is round.
6. He looks happy.
7. Sugar tastes sweet.
8. The old woman is dead.
9. The weather was cold.
10. He became unconscious.
11. The old gentleman is of a gentle disposition.
12. The child is there.
13. The children look healthy.
14. To-day she seems sad.
15. The cup is full to the brim.
16. His grammar is shocking.
17. He is a good type of the modem athlete.
18. Ugly rumours are about.
19. Gentle Evangeline was the pride of the village.
20. This morning he seemed in good spirits.
21. Giving to the poor is lending to the Lord
22. The matter appears of considerable importance.
23. Every man is the architect of his own fortune.
8. కొన్ని సందర్భములలో Predicate లోని Verb transitive అయి ఉంటుంది. Transitive verb అనగా మరియొక పదమును తనకు object (కర్మగా) తీసుకొనునది అని అర్ధము. అప్పుడే ఆ verb పదము సంపూర్ణ అర్ధము నిచ్చును. ఇట్టి verb పదము ఎడమనుండి కుడివైపునకు ప్రయాణిస్తుంది. ఉదాహరణకు ‘Cats catch’ అని అన్నపుడు మనకు పూర్తి భావము రాదు. పిల్లులు వేనిని పట్టుకొనును అనే సందేహం నీకు వస్తుంది. ఇచ్చట verb పదమైన ‘catch’ కు ఒక object (క్రియా పదము) కావలయును. ఈ పదము ఎలుక కావచ్చు లేదా ఇంకొక వస్తువు కావచ్చును. Object పదమును కలిపినపుడే Pretticate తన సంపూర్ణ రూపమును చూపిస్తుంది.
ఈ క్రింది వాక్యములలో నున్న Pretticates ను పరిశీలించండి:-
Birds build nests.
I know him.
All good children pity the poor.
The Gurkhas love fighting.
The foolish crow tried to sing.
Our soldiers tried to scale the cliff.
SUBJECT | PREDICATE | |||
no | Subject-word | Attribute | Verb | Object |
1 | Birds | build | nests | |
2 | I | know | him | |
3 | children | (1)All | pity | the poor |
(2)good | ||||
4 | Gurkhas | The | love | fighting |
5 | crow | (1) The | tried | to sing |
(2)foolish | ||||
6 | soldiers | Our | tried | to scale the cliff |
ఇప్పుడు మనము పరిశీలించదగిన విషయములు :-
1వ వాక్యములో Object గా నున్నట్టిది Noun.
2వ వాక్యములో Object గా నున్నట్టిది Pronoun.
3వ వాక్యములో Object గా నున్న పదము స్వతహాగా Adjective అయి ఉండి Noun m పనిచేయుచున్నది. To scale the cliff – చాలా ఎత్తుగానున్న కొండచరియను ఎక్కుట.
4వ వాక్యములో Object గా నున్న పదము Gerund. Gerund అనగా రూపములో Verb గా నుండి Noun పనిని చేయునట్టిది. దీనిని Verbal Noun లేక Gerund అని అంటాము.
5వ వాక్యములో Object పదము Infinitive గా నున్నది. (Infinitive అనగా అనంతమైన భావమును ఇచ్చునది). పోవుట అనునది Verb పోవుటకు అగా “to go” అను భావమును చూపినపుడు, “ఎంత దూరము పోవుటకు?” అనే ప్రశ్న వస్తుంది. ఇచ్చట ఎంత దూరమైనా కావచ్చు. ఇంత దూరము అని ఖచ్చితంగా చెప్పబడలేదు. ఇట్టి భావాన్ని అనంతమైన బావం అని అంటాము. కాబట్టి English Grammar లో ఇట్టి భావాన్ని Infinitive అని అంటారు.
6వ వాక్యములో Object కొన్ని పదముల కలయిక అయి ఉన్నది. కొండ ఎక్కడం ఇంకా జరుగుచున్నది. అని ఇచ్చట భావము.
9. Subject word కు వలెనే Object word కు కూడా attributes (ఆరోపించు భావమును గలిగినవి) ఉండును. ఈ attribute పదమునకు Adjective లక్షణములు ఉండును.
He shot a big panther.
PREDICATE | |||
SUBJECT | Verb | Object. | Attribute |
He | shot | panther | (1) a— |
(2) big |
ఇచ్చట attribute (adjective భావము కలిగిన) పదములు రెండు. ఒకటి a; రెండు big. ఒకటి అనగా ఎన్ని అనే వివరణను ఇచ్చును. పెద్దది అనగా size ను గురించి చెప్పును. ఈ రెండు కూడా adjective భావములు.
అభ్యాసము 5
ఈ క్రింద ఇవ్వబడిన వాక్యములలోని complete object కనుగొని, Object-word ను దాని attribute నుండి విడదీయుము.
1. The world knows nothing of its greatest men.
2. We should learn to govern ourselves.
3. Her arms across her breast she laid.
4. The architect drew a plan for the house.
5. Serpents cast their skin once a year.
6. God tempers the wind to the shorn lamb
7. By their fruits ye shall know them.
8. Rock the baby to sleep.
9. He enjoys his master’s confidence.
10. I recognized your voice at once.
11. Cut your coat according to your cloth.
12. The Eskimos make houses of snow and ice.
13. I had no answer to my letter.
14. The curlew tolls the knell of parting day.
15. Fear no more the heat of the sun.
16. Evil communications corrupt good manners.
10. కొన్ని సందర్భములలో Predicate లో ఉన్న Verb transitive verb అయి ఉండి రెండు objectives ను తీసుకొనును. అందులో ఒకటి Direct Object, రెండవది Indirect Object గా ఉండును.
మనము ‘Rama gave a penknife’ అని అన్నాము అనుకోండి. ఇచ్చట gave అను verb నకు ‘penknife’ అను పదము object గా నున్నది. మరికొంత భావమును కలుపు ఉద్దేశ్యంతో ‘Rama gave me a penknife’ అని అన్నాము అనుకోండి. ఇచ్చట ‘me’ అను పదము verb నకు Direct Object ‘pen knife’ అను పదము verb నకు Indirect Object
ఇప్పుడు ఈ క్రింది వాక్యములలో Predicate ను క్షుణ్ణంగా పరిశీలించండి. ఇచ్చట predicate లో direct object మరియు indirect object రెండూ ఉన్నవి.
I promised him a present.
He teaches us Geometry. Father bought Mini a doll.
SUBJECT | PREDICATE | ||
Verb | Indirect Object | Direct Object | |
I | promised | him | a present |
He | teaches | us | Geometry |
Father | bought | Mini | a doll |
11. కొన్ని Transitive Verbs కు ఉన్న Object పదములకు తోడుగా, ఒక Complement ను కూడా కలిగియుండును. ఇక్కడ Complement అనగా ఇంకా కొంచెం భావమును కలుపు పదము అని అర్ధం. The boys made Rama captain.
ఇచ్చట Transitive Verb (ఎడమ నుండి కుడికి భావమును తీసుకొని వెళ్ళునది) అయిన made అను పదమునకు Rama అనబడే Noun పదము Object గా నున్నది. ఇచ్చట ‘captain’ అను పదము Complement పాత్రను పోషిస్తూ ఉన్నది. రాముడు ఎవరయినదీ వివరిస్తుంది కదా! ఈ additional వివరణ ‘captain’ అను పదములో నున్నది. The boy made a snow-ball ఈ వాక్యమును కూడా పరిశీలించండి. ఇచ్చట భావము సంపూర్ణముగా ఉంటుంది. కాని ‘The boys made Rama’ అని అన్నామనుకోండి – భావము ఘోరముగా చెడిపోతుంది. బాలురు ఇచ్చట రాముని తయారుచెయ్యలేదు రాముని captain గా మాత్రమే చేశారు. ఇచ్చట verb అయిన ‘made’ అను పదములో కూడా అసంపూర్ణత ఉన్నది. కావున దీనిని Incomplete Prediction అని అంటాము. దానికి captain అను Complement అవసరమై ఉన్నది. దానిని కలిపినపుడు భావము సంపూర్ణముగా వస్తుంది. బాలురు రాముని యొక్క captain హోదాను మాత్రమే రూపొందించగలరు. ఇచ్చట Complement అయినట్టి captain అను పదము Object పదమైన Rama ను సంపూర్ణముగా వివరిస్తుంది. అట్టి Complement ను Objective Complement అంటారు. ఇప్పుడు ఈ క్రింది వాక్యములలోని Predicates ను పరీక్షించండి.
The jury found him guilty.
His parents named him Hari.
He kept us waiting.
Nothing will make him repent.
His words filled them with terror.
NO. | SUBJECT | PREDICATE | |||
Subject word | Attribute | Verb | Object | Complement | |
1 | jury | The | found | him | guilty |
2 | parents | His | named | him | Hari |
3 | He | kept | us | waiting | |
4 | Nothing | will make | him | repent | |
5 | words | His | filled | them | with terror |
అభ్యాసము 6
ఈ క్రింది వాక్యములలో Subject నుండి Predicate ను వేరుపరచండి. తరువాత Predicate లోనున్న వివిధ భాగములను చూపండి.
1. Abdul called his cousin a fool.
2. Exercise has made his muscles strong.
3. This will make you happy.
4. The Nawab appointed his own brother Vizier.
5. The Court appointed him guardian of the orphan child.
6. Time makes the worst enemies friends.
7. Sickness made the child irritable.
8. They elected him secretary of the club.
9. Do you take me for a fool?
10. We saw the storm approaching.
11. I consider the man trustworthy.
12. They kept us in suspense.
13. The jury found him guilty of murder.
14. A thunderstorm often turns milk sour.
12. ఈ క్రింది Predicate లోని వివిధ రూపములను పరిశీలించెదము.
1. Verb intransitive అయినపుడు అట్టి Predicate నకు verb మాత్రమే ఉంటుంది.
2. Verb 35 Intransitive o Predicate Incomplete
verb మరియు Complement గూడా ఉండును.
Predicate
3. Verb పదము Transitive అయినపుడు Predicate కు Verb మరియు Object గూడా ఉండును. 4. Verb Transitive అయి ఉండి దానికి రెండు objects (కర్మ పదములు) ఉన్నచో, Predicate లోని Verb నకు తోడు ఆ రెండు objects కూడా ఉండును. ఇచ్చట ఒకటి Indirect object అయి ఉండి, రెండవది Direct object అయి ఉండును.
5. Verb Transitive Incomplete Predication Predicate & Verb Object, ఇంకా Complement కూడా ఉండును.
NO. | SUBJECT | PREDICATE | |||
Subject | Attribute | Verb | Object | Complement | |
word | |||||
1 | Abdul | quite pale with fright | rushed | ||
2 | Determination | to do one’s duty | is | laudable | |
3 | children | (1) the farmer’s | sat | ||
(2) rosy | |||||
4 | they | brought | the warrior dead | ||
5 | friends | His | elected | him | secretary of |
the ciub | |||||
6 | circumstance | This | makes | the matter | very serious |
7 | uncle | My | has been | (1) maths | |
teaching | (Direct) | ||||
(2) me | |||||
(Indirect) | |||||
8 | Jaffar | (1) the Barmecide | was | dead | |
(2) the good Vizier | |||||
(3) the poor man’s hope | |||||
(4) the friend without a peer | |||||
9 | you | are | Who |
13. ఈ క్రింది వాక్యములకు ముందు page లో ఇచ్చిన వివరణను జాగ్రత్తగా పరిశీలించండి:
Abdul, quite pale with fright, rushed into the room.
Determination to do one’s duty is laudable. Around the fire, one wintry night,
The farmer’s rosy children sat.
Home they brought the warrior dead.
His friends elected him secretary of the club.
This circumstance certainly makes the matter very serious.
My uncle has been teaching me mathematics.
Jaffar, the Barmecide, the good Vizier,
The poor man’s hope, the friend without a peer,
Jaffar was dead, slain by a doom unjust.
Who are you?
అభ్యాసము 7
ఈ క్రింది వాక్యములకు సరియైన వివరణ ఇవ్వండి.
1. A nod from a lord is breakfast for a fool.
2. A good paymaster never wants workmen.
3. Home they brought her warrior dead.
4. Sickness made the child irritable.
5. Gentle Evangeline was the pride of the village.
6. It is easy to find fault.
7. It is a miserable thing to live in suspense.
8. Wounds made by words are hard to heal.
9. Down went the Royal George.
10. Into the valley of death rode the six hundred.
11. Time makes the worst enemies friends.
12. Great is your reward in Heaven.
13. In him India lost a true patriot.
14. The proof of the pudding is in the eating.
15. It is easy to be wise after the event.
16. A man he was to all the country dear.
17. He showed a constant solicitude for his son’s welfare.
18. A man’s first care should be to avoid the reproaches of his own heart.
19. All work and no play makes Jack a dull boy.
20. Caesar, having conquered his enemies, returned to Rome.
21. A great fortune in the hands of a fool is a great misfortune.
22. To drive a car requires care and skill.
23. The postman looked very tired at the end of the day.
24. Experience has taught us many lessons.
గమనిక (Note: 6వ ఉదాహరణలో “It” అను పదము తాత్కాలిక subject (కర్త) అయి ఉన్నది. ఇచ్చట నిజమైన subject “to find fault” అయి ఉన్నది. కాబట్టి “1t” ను subject ను చూపించే column (పట్టి)లో brackets వేసి చూపాలి. 7వ మరియు 15వ ఉదాహరణలలో కూడా “It” తాత్కాలిక subject అయి ఉన్నది.