అధ్యాయము 17
Agreement Of The Verb With The Subject
109. Number విషయములోను (singular plural) మరియు person (first person second person – third person) విషయములోను verb కు subjectsు (కర్త) మధ్య అనుబంధం ఉండవలయును. చాలా సందర్భములలో “Error of Proximity” వలన మనము verb నకు దాని పక్కనే ఉన్న noun తో సంఖ్య విషయంలో పొరపాటు జోడీ కలిపి తప్పుచేస్తాము.
అనగా అసలు కర్త sentence ప్రారంభంలో గాని, కొంత దూరంలోగాని ఉన్నప్పుడు ఈ పొరపాటు జరుగుతుంది. మధ్యలోనున్న verb అసలు subject ఎచ్చటనున్నదో చూసుకోకుండా పొరపాటు పడుతుంది.
అనగా కొన్ని సందర్భములలో verb sentence ప్రధములలో ఉన్న ప్రధాన subject తో కాకుండా దాని ప్రక్కనే ఉన్న ఇంకొక noun తో number మరియు person విషయంలో అనుబంధం ఏర్పరుచుకుంటుంది.
ఇటువంటి పొరపాట్లను చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రింద చూపిన examples లోలాగా verb పదము ఈ ప్రమాదమును దాటవలసి ఉంటుంది.
The quality of the mangos was not good. The introduction of tea and coffee and such other beverages has not been without some effect. His knowledge of Indian vernaculars is far beyond the common. The state of his affairs was such as to cause anxiety to his creditors.
If it were possible to get near when one of the volcanic eruptions takes place, we should see a grand sight. The results of the recognition of this fact are seen in the gradual improvement of the diet of the poor.
Subject అను భావము mangoes కు వర్తించదు. The quality అను పదము subject అవుతుంది. కావున was అను singular verb ను వాడాము. అలానే అన్ని examples చూసుకోవాలి.
Read and Learn More Correct usage of grammar
110. And అను conjunction తో కలుపబడి రెండు గాని అంతకంటే ఎక్కువగాని nouns మరియు pronouns ఉన్నట్లయితే ఆ విషయములో అట్టి phrase బహువచనం అవుతుంది. వానికి ఉపయోగించదగినది. plural verb.
Gold and silver are precious metals.
Fire and water do not agree.
Knowledge and wisdom have of times no connection.
Are your father and mother at home?
In him were centred their love and their ambition.
He and I were playing.com
కాని అట్టి noun కూడా భావవితరణలో ఒకే భావమును మనస్సుకు స్ఫురింపజేస్తే అచ్చట verb singular గా ఉండవలయును. ఇంకను ఒకే వ్యక్తిని ఆ గుణములు చూపినచో లేక ఒకే వస్తువును ఆ గుణములు సూచించినా కూడా verb singular అవుతుంది.
ఇచ్చట గుణములన్నియు ఒకే వ్యక్తి సంబంధించినవి గావున మరియు అట్టి ఒకే వ్యక్తి singular కావున, subject గా నున్న ఆ వ్యక్తి singular అగును.
Time and tide waits for no man.
The horse and carriage is at the door.
Bread and butter is his only food.
Honour and glory is his reward.
The rise and fall of the tide is due to lunar influence.
My friend and benefactor has come.
The novelist and poet is dead.
111. With, as well as మొదలగు పదములు singular subject కు అంటిపెట్టుకుని ఉన్నచో ఆ పదములు మొత్తము singular అగును. ఈ words ను parenthetical words అంటాము.
అనగా bracket లో పెట్టిన ఒక సమూహము అని కూడా భావించవచ్చును. సమూహము అను పదము singular ఇచ్చట verb singular గా ఉండవలెను.
The house, with its contents, was insured.
The Mayor, with his councillors, is to be present.
The ship, with its crew, was lost.
Silver, as well as cotton, has fallen in price.
Sanskrit, as well as Arabic, was taught there.
Justice, as well as mercy, allows it.
The guidance, as well as the love of a mother, was wanting.
112. రెండు లేక ఎక్కువగాను నున్న subject పద సమూహముల విషయంలో పదములకు or గాని nor గాని ఉన్నట్లయితే ఆ subject ఏకవచనము అవుతుంది. Verb కూడా ఏకవచనము అయి ఉండ వలయును.
No nook or corner was left unexplored. Our happiness or our sorrow is largely due to our own actions. Either the cat or the dog has been here.
Neither food nor water was to be found there. Neither praise nor blame seems to affect him.
కాని పైన చూపిన జంట పదములు subject లో ఒక పదము plural అయితే ఆ subject పదము plural అవుతుంది. Verb కూడా plural లో ఉంటుంది. ఆ జంట పదములలోని plural ను plural form లోనున్న verb కు దగ్గరగా ఉంచాలి.
Neither the Chairman nor the directors are present.
113. ఒక subject పదముల సమూహము మధ్యలో or నుగాని nor నుగాని కలిగి ఉంది అని అనుకుంటాము. Subject పదములలో ఒకటి ఒక person ఇంకొకటి వేరే person అని కూడా అనుకుందాము. అటువంటి పరిస్థితిలో దగ్గర ఉన్న person కు (first, second or third persons) అనుకూలమయిన verb ను అచ్చట వాడవలయును.
Either he or I am mistaken. Neither you nor he is to blame. Either you or he is mistaken. Neither my friend nor I am to blame.
కాని ఈ ప్రమాదములను అధిగమించి వాక్యమును రూపొందించుట మంచిది :-
He is mistaken, or else I am.
He is not to blame, nor are you.
You are mistaken, or else he is.
My friend is not to blame, nor am I.
114. Either neither, each, everyone, many అను పదములకు తోడుగా వాని వెంట singular verb మాత్రమే ఉండి తీరవలయును.
He asked me whether either of the applicants was suitable. Neither of the two men was very strong. (ఇద్దరిలో ఏ ఒక్కరూ కాదు అని అర్ధం ఉన్నది కదా !)
Each of these substances is found in India. Everyone of the prisons is full.
Everyone olthe boys loves to ride. Many a man has done so. Many a man does not know his own good deeds. Many a man has succumbed to this temptation.
115. రెండు nouns ఉన్నవి అని అనుకుందాము. ఆ రెండు nouns కూడా each లేదా every అను పదములచేత వేర్వేరుగా గుర్తింపబడినవి అని కూడా అనుకుందాము.
మరియు ఇట్టి రెండు nouns కూడా and చేత కలుపబడినవి. అయినను అవి singular nouns మాత్రమే. వానికి singular verb ను మాత్రమే ఉపయోగించవలయును. Every boy and every girl was given a packet of sweets. (ఇచ్చట boy మరియు girl వేరువేరుగా చెప్పబడినారు కదా !)
116. కొన్ని రూపములో plural గా ఉండి, భావములో singular గా నుండును. వానికి singular verb నే ఉపయోగించవలయును.
The news is true. Politics was with him the business of his life. The wages of sin is death. Mathematics is a branch of study in every school.
117. Pains అను పదము మరియు means అను పదము singular verb నుగాని plural verb నుగాని అంగీకరించును. కాని వానిని పేజీకి ఒక విధంగా రాయరాదు.
Great pains have been taken. Much pains has been taken. All possible means have been tried. The means employed by you is sufficient.
ఆదాయమును దృష్టిలో పెట్టుకొని means అను పదమును ఉపయోగించినపుడు verb plural formation గానే ఉంటుంది. My means were much reduced owing to that heavy loss. His means are ample.
(ఇచ్చట means అనగా అనేకవిధాలుగా డబ్బువచ్చే మార్గాలు అని అర్ధం)
118. కొన్ని nouns ఏకవచన రూపములో నుండును. వాని భావము మాత్రము బహువచన రూపములో (plural) నుండు వానికి plural verb ను వాడియే తీరవలయును.
According to the present market rate twelve dozen cost one hundred rupees.
119. “None” అను పదము singular form లో ఉన్నది. కాని దానికి plural meaning వస్తుంది. కావున plural verb ను ప్రయోగించవలయును.
None are so deaf as those who will not hear. Cows are amongst the gentlest of breathing creatures; none show more passionate tendemess to their young.
120. Collective noun ఉన్నది. దాని నుండి మనకు Collective భావము (గుంపు భావము) అవసరమైనపుడు singular verb ను వాడెదము (The class is dull) Plural భావము కావలసినపుడు plural verb ను వాడెదము.
The Committee has issued its report. The Committee are divided on one minor point. కాని ఎప్పుడూ ఒకే పద్దతిని వాడవలయును. The Committee has appended a note to its (not their) report.
121. ఒక plural noun అయి ఉండి అది proper noun భావము కలిగి ఉన్నచో ఒకే లక్ష్యము, ఒకే గుర్తింపు గలిగినట్టిది అయివున్నది. అట్టి దానికి singular verb వాడతాము.
The Arabian Nights is still a great favourite. The United States has a big navy. Plutarch’s lives is an interesting book. Gullliver’s Travels was written by Swift.
122. ఒక plural noun మనకు ఒక ఖచ్చితమైన పరిమాణమును quantity ని చూపించినపుడుగాని అలానే ఒక amount (మొత్తము) ను గురించి చెప్పినపుడుగాని, verb సాధారణంగా singular, ఉంటుంది.
Fifteen minutes is allowed to each speaker. Ten kilometers is a long walk.
Fifty thousand rupees is a large sum. Three parts of the business is left for me to do.
అభ్యాసము 110
ఈ క్రింది వాక్యములలో Subjects కు అనుకూలమైన Verb పదములతో ఖాళీలను నింపండి :-
- To take pay and then not to do work______ dishonest.
- The cost of all these articles____ risen.
- The jury____ divided in their opinions.
- That night everyone of the boat’s crew_____ down with fever.
- One or the other of those feilows___ stolen the watch.
- The strain of all the difficulties and vexations and_ anxieties____ more than he could bear.
- No news___ good news.
- The accountant__ and the cashier_____ absconded.
- A good man and useful citizen__ passed away.
- The famous juggler and conjurer ___ too unwell to perform.
- The Three Musketeers____ written by Dumas.
- Each of the suspected men_____ arrested.
- The ebb and flow of the tides____ explained by Newton.
- Ninety rupees____ too much for this bag.
- The cow as well as the horse_____ grass.
- Neither his father nor his mother____ alive.
- There______ many objections to the plan.
- Two-thirds of the city_____ in ruins.
- The formation of paragraphs______ very important.
- Man’s happiness or misery_____ in a great measure in his own hands.